Monday, October 18, 2021

నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం.. ప్రధాని మోదీ ట్వీట్

జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రత్యేక నిపుణుల బృందం మన్మోహన్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మన్మోహన్‌కు మంచి ఆరోగ్యాన్నివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ను కలిసేందుకు కేంద్రఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులను అడిగి మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.PM Modi wishes speedy recovery for Manmohan Singh;

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News