Monday, October 18, 2021

జియో సేవ‌ల్లో అంత‌రాయం..

మొన్న‌టి రోజున ఫేస్‌బుక్‌లో అంత‌రాయం క‌లిగిన సంగ‌తి తెలిసిందే.  దాదాపు 7 గంట‌ల‌పాటు ఫేస్‌బుక్‌కు అంత‌రాయం క‌లిగింది.  ఏడు గంట‌ల అంత‌రాయంతో 7 బిలియిన్ డాల‌ర్ల మేర న‌ష్టం వ‌చ్చింది.  ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గ‌త కొన్ని గంట‌లుగా జియో నెట్ వ‌ర్క్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.  జియోనెట్ లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.  జియోనెట్‌డౌన్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న‌ది.  ఈ నెట్ వ‌ర్క్ స‌మ‌స్య‌లు తాత్కాలిక‌మే అని, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని జియో నెట్ వ‌ర్క్ ప్ర‌క‌టించింది.  

ఇది కూడా చదవండి: ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: చిరంజీవి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News