Monday, May 17, 2021

ఏపీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి లేఖ

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను వైఎస్ఆర్ బీమా/ఎక్స్ గ్రేషియా చెల్లింపుల‌తో ఆదుకోవాలని తాను ఈ లేఖ‌ రాసిన‌ట్లు సోమిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్ర‌తి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున‌ అందజేయాలని ఆయ‌న అందులో విజ్ఞ‌ప్తి చేశారు. అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.15 వేలు చెల్లించాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని సోమిరెడ్డి కోరారు.

ఏపీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి లేఖ
Advertisement

తాజా వార్తలు

Prabha News