ఏపీలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 36,970 మందికి కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,215కి చేరింది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఈరోజు 82 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 8,82,219 మంది చికిత్స నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 826 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 7,710కి చేరింది.
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement