ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సామాన్యులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) (GST) భారం తగ్గుతుందని, తదుపరి తరం సంస్కరణలు అమలు చేయనున్నట్టు స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ (Prime Minister Modi) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సామాన్యూలకు ఏ రంగంలో ధరలు తగ్గుతాయని చర్చ మొదలైంది. ప్రస్తుతం 12శాతం శ్లాబ్ లో ఉన్న నిత్యావసరాల్లో చాలా వరకు 5శాతం శ్లాబ్ లోకి మార్చే అవకాశం ఉంది. దానితో వాటి ధరలు తగ్గుతాయి.
ఇందులో ప్యాకేజ్ చేసిన పాలు, బటర్, పనీర్, నెయ్యి, పళ్లరసాలు, బాదాం ఇతర డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జామ్, సబ్బులు, టూత్పేస్టులు, హెయిర్ ఆయిల్, గొడుగులు, ప్రాసెస్ చేసిన ఆహారం, కుట్టు మిషన్లు, సాధా రణ వాటర్ ఫిల్టర్లు (ఎలక్ట్రిక్ కానివి), అల్యూమి నియం, స్టీలు పాత్రలు, కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గీజర్లు, చిన్న వాక్యూమ్ క్లీనర్లు, రూ.1000 కన్నా ఖరీదైన రెడీమేడ్ వస్త్రాలు, రూ.1000 ధరలోపు పాదరక్షలు, రబ్బర్ బ్యాండ్లు, హ్యాండ్ బ్యాగులు, వైద్య పరీక్షల కిట్లు, సైకిళ్లు, వ్యవ సాయ యంత్రాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, మధ్యస్థాయి లాడ్జీలు, హోటళ్లలో గదుల అద్దె వంటివి కూడా 12శాతం పన్నురేటులో ఉన్నాయి. వీటిని 5శాతం శ్లాబ్లోకి తెస్తే ధరలు బాగా తగ్గు తాయి. అదే 18శాతం శ్లాబ్లోకి మార్చితే ధరలు పెరుగుతాయి.
ప్రస్తుతం ఆరోగ్య, టెర్మ్, ఇతర బీమా పాలసీల ప్రీమియంపై 18శాతం పన్ను ఉంది. దీనిని తగ్గించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. తాజా సంస్కరణల్లో భాగంగా 5శాతానికి తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి. సిమెంటు, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్, వాషర్లు, 32 అంగుళాలకు పైన ఉన్న ఎల్ఈడీ టీవీలు, ప్రింటర్లు, రేజర్లు, వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, కార్లు, ఖరీదైన ద్విచక్రవాహ నాలు వంటివి ప్రస్తుతం 28శాతం శ్లాబ్లో ఉన్నాయి. వీటిని 18శాతం శ్లాబు మార్చితే ధరలు బాగా తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.