Saturday, April 17, 2021

నేటి సంపాద‌కీయం – పాకిస్తాన్ యు ట‌ర్న్..

ఆడిన మాట తప్పడం,పిల్లిమొగ్గలు వేయడం పాకిస్తాన్‌కి అలవాటే.మాటకు కట్టుబడి ఉంటే పాక్‌తో మనకు పేచీయే ఉండేది కాదు. 18 సంవత్సరాల క్రితం ఆనాటి భారత్‌, పాక్‌ ప్రధానులు వాజ్‌పేయి, నవాజ్‌ షరీఫ్‌లు కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ సైనికులు ఈరోజుకీ గౌరవించడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల మోత వల్లే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా యి. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ , ఆ దేశపు ఆర్మీ జనరల్‌ బజ్వాలు ఈ మధ్య భారత్‌ తో సఖ్యతకూ,శాంతికీ కృషి చేస్తున్నామని ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదు. అలాగే, ఇరుదేశాల మధ్య సంబంధాల కృషిలో భాగంగా పాక్‌ ఆర్థికమంత్రి హమద్‌ అజార్‌ భారత్‌ నుంచి ఐదులక్షల టన్నుల చక్కెరనూ, అంతే మొత్తంలో గోధుమలను దిగుమతి చేసుకోవాలని ఆర్థిక సమన్వయకమిటీ నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత్‌ నుంచి చక్కెర దిగుమతుల వల్ల తమ దేశంలో చక్కెర ధర 20 శాతం తగ్గుతుందనీ, ప్రజల ప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని సమన్వయకమిటీతీసుకుందని అజార్‌ వెల్లడించా రు. పాక్‌లో ఇప్పుడు ఆకలి దప్పుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలోఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఉపఖండంలోనిదేశాలే కాకుండా యావత్‌ ప్రపంచదేశాలు భావించాయి. తమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి పాక్‌ మంత్రి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ తాయనే దాకా వెళ్ళారు. అలా జరిగితే అది మంచిదే కానీ, అంత సౌహార్దం, పెద్దమనసు పాక్‌ పాలకులకు లేదు. అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు బయటి నుంచి వచ్చే ఒత్తిడులకు మారిపోతుంటాయి. ఇందుకు ఇది తాజా నిదర్శనం. నిజానికిపాక్‌ ఆర్మీజనరల్‌ బజ్వా, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాటల్లో తరచు ఘర్షణల వల్ల ఇరు దేశాలూ నష్టపోతున్నాయనీ, పాక్‌ ఆర్థికపరిస్థితి దృష్ట్యా పొరుగు దేశాలతో ఘర్షణలకు స్వస్తి చెప్పి సామరస్యంగా మెలగాలని నిర్ణయించామని ప్రకటించగానే, పాక్‌ నాయకులది పశ్చాత్తాప ప్రకటనేమోనని చాలా మంది అనుకున్నారు. పాక్‌ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడం వల్ల, ప్రపంచబ్యాంకు,అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థల నుంచి రుణాలు లభించకపోవడం వల్లపాక్‌ నాయకుల్లో మార్పు వచ్చిం దేమోనని కూడా అంతా అనుకున్నారు.అయితే, ఇటీవల పాక్‌ ప్రయత్నాలు ఫలించడంతో రుణాలుఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. దాంతో ఆ దేశ వైఖరిలోమార్పు వచ్చింది.దానికి తోడుపాక్‌ ప్రభుత్వంపై సైనికులు, మతపెద్దల నిఘా, ఒత్తిడి నిరంతరం పని చేస్తూ ఉంటుందని మరోసారి రుజువైంది. భారత్‌ నుంచి చక్కెర, గోధుమ నిల్వలను దిగు మతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కడ వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరి అయిపోయింది. ధరల విషయంలో పేచీ రాలేదు. కానీ, కాశ్మీర్‌ అంశంపై భారత్‌ నిర్ణయానికి అక్కడి మత పెద్దలు అభ్యంతరాలు తెలిపారు. కాశ్మీర్‌ విభజన కు వ్యతిరేకంగా భారత్‌తో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోరాదని వారు ఒత్తిడి తెచ్చా రు. నిజానికి కాశ్మీర్‌ విభజన, ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలు పూర్తిగా భారత్‌ అంతర్గత విషయాలు. కాశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయ వేదికలపై పదే పదే ప్రస్తావిస్తూ భారత్‌పై విషం కక్కడం పాక్‌ నాయకులకూ, దౌత్యవేత్తలకూఅలవాటుగా మారింది. దీనిపై మన దేశం ఎప్పటికప్పుడు అభ్యంతరాలను తెలుపుతూనే ఉంది.ఇప్పుడు తమ దేశ అవసరాల కోసం తీసుకున్న నిర్ణయం విషయంలో కూడా ఒత్తిడి తేవడం పాక్‌ ప్రభుత్వంపై అక్కడి మత పెద్దల పట్టుకు ప్రత్యక్ష నిదర్శనం. చక్కెర దిగుమతుల విషయంలో పాక్‌ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోవడం వల్ల నష్టపోయేది అక్కడి ప్రజలే. అయితే, ప్రజల అభిప్రాయాల నూ, వారి స్వేచ్ఛనూ బలవంతంగా అణచివేయడంలో పాక్‌ పాలకులు ప్రపంచంలో నియంతలకు తక్కువకారని మరోసారి రుజువైంది. పాక్‌ ప్రభుత్వ నిర్ణయంవల్ల ప్రజా స్వామ్య భావజాలం కలిగిననాయకులే కాకుండా, వాణిజ్య వర్గాలు సైతం తీవ్ర నిరసన తెలియజేయడం గమనార్హం. ద్వైపాక్షిక సంబంధాల గురించి భారత ప్రధాని నరేంద్రమోడీ తో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లేఖలు రాసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మత నేతల పట్టు మరోసారి రుజువైంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News