Saturday, May 28, 2022

నేటి సంపాదకీయం-ఆకలి.. హాహాకారాలు

Afghanisthan ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా తయారైంది. మతపరంగా పాకిస్తాన్‌ అడుగు జాడల్లో నడుస్తున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు పాక్‌ కన్నా భిన్నంగా లేవు. అయితే, దశాబ్దాల తరబడి నియంతల పాలనలో మగ్గడం వల్ల పాకిస్తాన్‌ ఆర్థిక బాధలను ఎదుర్కొంటుండగా, మొదట రష్యా, తర్వాత అమెరికా సేనల దాష్టీకం కారణంగా అఎn్గానిస్తాన్‌ ప్రజల పరిస్థితి దయనీ యంగా తయారైంది. అమెరికన్‌ సేనల నిష్క్రమణతో తాలిబన్లు అధికారం చేపట్టేందుకు కొంత సమయం పట్టింది.

తాలిబన్లకు పాలన మీద పట్టులేదు.అవగాహన లేదు. అధికారా న్ని గుంజుకోవడంలో ఉన్న ఆసక్తినివారు ప్రజల సంక్షేమంపైన చూపకపోవడమే ఇందు కు కారణం. తాలిబన్ల పాలనలో తమ ఆకలిదప్పులు తీరవన్న సంగతి అఎn్గాన్‌ ప్రజలకు తెలుసు. అందుకే, వారు అమెరికన్‌ సేనలు వెళ్ళిపోగానే, ఇతర దేశాలకు వెళ్ళేందుకు క్యూ కట్టారు. అయితే, తాలిబన్లు చెక్‌పోస్టుల వద్ద కాపు కాసి, తమదేశం నుంచి వెళ్ళే అఎn్గాన్‌లను అడ్డుకుంటున్నారు. దీంతో అఎn్గాన్‌ల పరిస్థితి అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తినా నివ్వదు అన్న చందంగా తయారైంది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోకి చాలా మంది జారుకో గలిగిన ప్పటికీ, పాక్‌ పరిస్థితి కూడా అంతకన్నా దారుణంగా ఉంది.

పాక్‌లో వరుస రాజకీయ సంక్షోభాల వల్ల ఆకలిరాజ్యమేలుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం స్వదేశంలోని వారికే కూడూ, గుడ్డ కల్పించలేని స్థితిలో ఉండగా, అఎn్గాన్‌ నుంచి వచ్చిన శరణార్ధులను ఆదుకోవడం సాధ్యం కాని పని. శీతాకాలంలో అఎn్గానిస్తాన్‌లో చలి ఎక్కువ. దాంతో, తలదాచుకోవడానికి కూడా దారిలేని పరిస్థితిలో స్థానికులు పొరుగుదేశాలకూ, ప్రాంతాల కు తరలి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా, వారికి అడుగడుగునా తాలిబన్ల అవరోధాలు కల్పిస్తున్నారు. ప్రజలకు ఆహారభద్రత కల్పించే వ్యవస్థ కుప్పకూలిపోయింది. యెమన్‌, సిరియాల కన్నా అఎn్గానిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం కార్యనిర్వహణాధికారి డేవిడ్‌ బియాస్లీ పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని అఎn్గాన్‌లను ఆదుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, తాలిబన్లు తమ దేశ ప్రజలను కాపాడలేకపోగా, ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళనివ్వకుండా అవరోధాలు కల్పిస్తున్నారు. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటు న్నట్టు ప్రపంచ ఆహార సంస్థ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ తమ సేనల నిష్క్రమణ సమయంలో అఎn్గానిస్తాన్‌ని ఆదుకుంటామని ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితులు మారిపోయాయి. రెండు దశాబ్దాల పాటు రక్షణ బాధ్యతలను నిర్వహించేందు కు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసిన అమెరికాలో అఎn్గాన్‌ కోసం మరింత ఖర్చు చేసేందుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అఎn్గాన్‌లో పరిస్థితి కరవుకు దగ్గరగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆహారభద్రత సంస్థ తెలిపింది.

ఇతర దేశాల్లో కూడా పరిస్థితి అదే మాదిరి గా ఉండటంతో అఎn్గాన్‌కి ఆహార ధాన్యాలను అందించేందుకు ఏ ఒక్క దేశమూ ముందుకు రావడం లేదు. దేశంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అఎn్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబీవుల్లా ప్రకటించినప్పటికీ, ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. తాలిబన్ల పాలన తీరు తెన్నులేమిటో తెలియకపోవడం వల్ల ఏ ఒక్క దేశమూ అఎn్గాన్‌కి సాయం అందించేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా, మహిళల విషయంలో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరి పట్లా ఇస్లామిక్‌ దేశాల్లో చాలా మటుకు మండి పడుతున్నాయి.

తాలిబన్ల ప్రధాన ఆదాయమైన గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమరవాణాపై అంతర్జాతీయ ఆంక్షలు పెరగడంతో వారి ఆర్థిక మూలాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో అఎn్గాన్‌లో ప్రజలు ఆర్తనాదాలను అగ్రరాజ్యం సైతం పట్టించుకోవడం లేదు. అఎn్గానిస్తాన్‌కు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపడం లేదు. పాకిస్తాన్‌కే అప్పు పుట్టని ప్రస్తుత పరిస్థితుల్లో అఎn్గానిస్తాన్‌లో ఇంకా స్థిరమైన ప్రజాప్రభుత్వం ఏర్పడకుండా ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ సహాయం అందించేం దుకు ముందుకు రాకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితి లో ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడికి వెళ్లాలని పడిగాపులు గాస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement