Monday, June 5, 2023

నేటి సంపాదకీయం-సోనార్‌ బంగ్లాకు ఏభై ఏళ్లు!

బంగ్లాదేశ్‌ అవతరించి ఏభైఏళ్ళు అయింది. బంగ్లాదేశ్‌ అవతరణ కోసం సాగిన యుద్ధం ప్రపంచ విముక్తి పోరాటాల చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిం ది. అందుకే ఆనాడు బంగ్లాదేశ్‌ని సోనార్‌ బంగ్లాగా అభివర్ణించారు. ఒకనాటి తూర్పు బెంగాల్‌ దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో భాగమైంది. అయితే, పాక్‌ ఆవిర్భావంనాటి నుంచి అణచివేత, హక్కుల ఉల్లంఘన, మేధావి వర్గంపై దాడులు నిత్యకృత్యం కావడంతో తూర్పు బెంగాల్‌ ప్రజలు ప్రత్యేకదేశం కోసం ఉద్యమాలు నడిపా రు. ఈ ఉద్యమాలకు మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని బెంగాలీలు నైతిక మద్దతును ఇచ్చారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ వహించిన పాత్రను పార్లమెంటులో ప్రతిపక్షనాయకుడైన భారతీయ జనసంఘ్‌ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రశంసించడమే కాకుండా ఆమెను కాళికా దేవిగా పొగిడారు.భాషకు వారు ప్రాణం ఇస్తారు. తమ భాష పేరు చెప్పగానే బెంగాలీల్లో భావావేశం పొంగి పొరలుతూ ఉంటుంది. బెంగాలీలు స్వేచ్ఛా స్వాతంత్య్ర ప్రియులు. అన్యాయాన్ని ధైర్యంగా ఎత్తి చూప గల స్థయిర్యం వారి సొత్తు. నిజానికి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి జరిగిన పోరాటం మత పరమైనది కాదు.

బెంగాలీలది సున్నితమైన మనసు, మతం కన్నా. ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికపై ఏర్పడిన పాకిస్తాన్‌లో తూర్పు బెంగాల్‌ ప్రాంత ప్రజలు ఇమడలేకపోయారు. వారికి భాష, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎక్కువ ముఖ్యం. పాకిస్తాన్‌ ఆవిర్భావ కాలం నుంచి సైనిక తిరుగుబాట్లు, దాడులు, రక్తపాతాలు నిత్యకృత్యం కావడంతో బెంగాలీలు ఆ వాతావరణంలో మనుగడ సాగించలేకపోయారు తూర్పు బెంగాల్‌లో కూడా మహిళలపై న దాడులు జరిగాయి..స్వాతంత్య్ర సమర యోధుల్లో బెంగాలీ యోధులను ఎదుర్కోలేక బ్రిటిష్‌ వారు కుట్రపూరితంగానే బెంగాల్‌ విభజన జరిపించారు. బెంగాలీల జాతీయ వాద స్పూర్తి బ్రిటిష్‌ వారిని గడగడలాడించింది. విభజన రాజకీయాలకు బెంగాలీలు మొదటి నుంచి వ్యతిరేకం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మతపరమైన దాడుల కారణంగా బెంగాల్‌ విభజన జరిగింది. నౌఖాలీ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పాకిస్తాన్‌ ఆవిర్భావ కాలం నుంచి ప్రజాస్వామ్యం పట్టుమని పదేళ్ళు కూడా కొనసాగకపోవడం, ఆర్మీ జనరల్స్‌ నియంతలపాలన కొనసాగడంతో స్వేచ్ఛా స్వాతంత్య్రా లు మృగ్యమయ్యాయి.మొదటి నుంచి స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగించిన బెంగాలీలు పాకిస్తాన్‌ పాలకుల ధోరణిపై ఏకంగా యుద్ధాన్నే ప్రకటించారు.

- Advertisement -
   

ఈ యుద్ధానికి షేక్‌ ముజిబూర్‌ రెహమాన్‌ నేతృత్వం వహించారు.ఆయన పట్టుదల వల్లే బంగ్లాదేశ్‌ అవతరణ సాకారమైంది.ప్రపంచ దేశాల మద్దతు కూడా లభించింది.భారత్‌లో ఇందిరాగాంధీ కాకుండా మరొకరు ఎవరు ఉన్నా బంగ్లా అవతరణకు మన దేశం సహకారం అంది ఉండేది కాదు. భారత్‌ తన ప్రాదేశిక సరిహద్దులను కాపాడుకోవడమే లక్ష్యంగా మొదటి నుంచి పనిచేస్తూ వస్తోంది.అయినప్పటికీ 1962లో భారత్‌లో దురాక్రమణకు పాల్పడిన చైనా పాకిస్తాన్‌ని పురికొల్పింది. తూర్పు బెంగాల్‌ విడిపోవడానికి భారత్‌ కారణమంటూ పాకిస్తాన్‌ను కవ్వించింది. నిజానికి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారి తీసిన పాక్‌ యుద్ధంలో భారత సైనికులు ఎంతో సంయమనాన్నీ, సహనాన్ని ప్రదర్శించారు.

తూర్పు బెంగాల్‌ ప్రాంతంపై ఆనాటి పాక్‌ ప్రభుత్వం జరిపించిన వైమానిక దాడుల్లో అనేకమంది మరణించారు. మత పరంగా తూర్పు బెంగాల్‌ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పాక్‌ పాలకు లు ఎంతో ప్రయత్నించారు. అయితే, అప్పటికే విసిగిపోయిన బెంగాలీలు పాక్‌ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చకునేందుకు జీవన్మరణ సమస్యగా పోరాటం సాగించారు. షేక్‌ ముజి బూర్‌ నేతృత్వంలో ఏర్పడిన వంగ ముక్తి వాహిని కార్యకర్తలు అనేక మంది ప్రాణ త్యాగం చేశారు. పాక్‌ దళాల దాడులకు బెంగాలీల్లో అనేక మంది పశ్చి మ బెంగాల్‌కు, పాశ్చాత్య దేశాలకు తరలి పోయారు. నిజానికి బంగ్లాదేశ్‌ అవతరణ కోసం జరిగిన పోరాటాన్ని బెంగాలీల అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటంగా ఆనాటి మీడియా అభివర్ణించింది. బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంఒక చారిత్రక అవసరమని ముజీబూర్‌ రహమాన్‌ ప్రపంచంలోఅన్ని దేశాలకు నచ్చజెప్పడంలో విజయం సాధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement