Tuesday, April 23, 2024

ఛాందసంపైనే ఆందోళనలు!

ఇరాన్‌లో గడిచిన మూడు మాసాలుగా మహిళలు జరుపుతున్న ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చింది. అయినా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు అదుపులోకి రాలేదు. మహిళలు హిజాబ్‌ని తప్పని సరిగా ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ ఆందోళన సాగించిన మహిళలపై పోలీసులు అత్యంత క్రూరంగా జరిపిన లాఠీ చార్జిలో గాయపడిన మెషా అమిని అనేయువతి మరణానికి నిరసన జ్వాలలు దేశంలోని అన్ని నగరాలను చుట్టుముట్టాయి. మోరల్‌ పోలీసింగ్‌ని రద్దు చేయాలంటూ ఆందోళన కారులు తెచ్చిన ఒత్తిడికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. అయితే ఆందోళన చేస్తున్న మహిళలు వెనక్కి తగ్గగానే యూనివర్శిటీ హాస్టళ్ల లో విద్యార్ధినీ విద్యార్ధులపై విషప్రయోగం జరిగింది. విషప్రయోగానికి ప్రభుత్వానిదే బాధ్యత అని విద్యా ర్ధులు ఆరోపిస్తున్నారు. రాక్‌ క్లైంబింగ్‌ పోటీల్లో హిజాబ్‌ లేకుండా పాల్గొన్న ఎల్నాజ్‌ రెకబీ ఇంటిపై కొందరు దుండగులు జరిపిన దాడి వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉండి ఉండవచ్చని విద్యార్ధులు అనుమానిస్తున్నారు. ఈ పోటీల్లో హిజాబ్‌ ధరించి తీరాలని అధికారులు ఒత్తిడి చేసినా ఆమె పట్టుకోకపోవడం వల్ల ఆమె ఇంటిపై దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.. ఆందోళన కారులను శాంతింపజేసేందుకు మోరల్‌ పోలీసింగ్‌ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మరునాడే ఈ సంఘ టన జరగడం గమనార్హం.

ఆందోళనకారులను బెది రించి ఏదో విధంగా హిజాబ్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు, మెషా అమిని మరణం విషయంలో కూడా అధికారులు ఇలాగే కట్టుకథలు చెప్పారని వారంటున్నారు. అయితే, మత పెద్దలకూ, రివల్యూ షనరీ గార్డ్ కీ మధ్య జరుగుతున్న ప్రచ్చన్నయుద్ధం కారణంగానే దేశంలో అల్లర్లు జరిగాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మహిళా ఆందోళనకారులందరినీ విడుదల చేయలేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అందరినీ విడుదల చేసే వరకూ ఆందోళనలను విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. హిజాబ్‌ని తప్పనిసరి చేస్తూ ఇరాన్‌ ప్రభుత్వం 1983లో చట్టం చేసింది.తర్వాత 2013లో రోహానీ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఇరాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ రైసీ అధికారాన్ని చేపట్టిన తర్వాత హిజాబ్‌ నిబంధనలను కఠినంగా అమలు జేయాలని ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్‌ని వద్దనే వారు ఇరాన్‌కి శత్రువులని ఆయన అన్నారు. దీంతో దేశంలో మహిళలు, ముఖ్యంగా యువతులు ఆందోళనలు ప్రారంభించారు.

ఈ ఆందోళనలను అణచివేయడానికి ప్రభు త్వం చేసిన ప్రయత్నంలో 448 మరణించినట్టు నార్వేలోని మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. ఈ మరణా లనుప్రభుత్వం తగ్గించి చూపుతోందని విద్యా ర్ధులు ఆరోపిస్తున్నారు. హిజాబ్‌కి వ్యతిరేకంగా ఇతర దేశాల్లో కూడా యువతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళ నలు జరిపారు.ఇంకా జరుపుతున్నారు. నార్వే ,స్వీడన్‌, ఆస్ట్రేలియా వంటి ఇస్లామేతర దేశాల్లో కూడా ఇరాన్‌ మహిళలకు మద్దతుగా ఆందోళనలు సాగుతున్నాయి. నడిరోడ్డుపై మహిళలు జుట్టు కత్తిరించు కుంటున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియా లో వైరల్‌ అయ్యాయి .దానిపై ఇరాన్‌ ప్రభుత్వం ఆందోళన కారులపై మరింత తీవ్రంగా విరుచుకుని పడింది. ఇరాన్‌లో ఇరాన షా హయాంలో ప్రజలపై ఇలాంటి దౌష్ట్యాలు జరిగేవి. వారిని తరిమి వేసి ఆయు తుల్లా ఖమైనీకి అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిం దని ప్రజలు వాపో తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పాశవిక విధానా లకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగు తాయని ఆందోళన కారులు ప్రకటించారు.

- Advertisement -

ప్రభుత్వంపై వారి ఆగ్రహం ఎంత వరకూ వెళ్ళిందంటే ఫిఫా ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో ఇరాన్‌ జట్టు ఓడినప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు. ఇది తమ దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయమని కూడా వారు గ్రహించక పోవడం శోచనీయం.హిజాబ్‌పై ఉత్తర్వులు ఎత్తివేసినా చాందస వాద భావాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తామని వారు ప్రకటిస్తున్నారు. కాగా,ఇరాన్‌లో ఆందోళనల్లో బలూచిస్తాన్‌ వాసుల భాగ స్వామ్యం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్‌లోని బలూచి స్తాన్‌ ఇరాన్‌కి చేరువలోనే ఉంది. దీని వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇరాన్‌ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇంత కఠినంగా ఉత్తర్వులు జారీ చేయలేదు.ఆందోళన కారులపై కర్కశంగా విరుచుకుని పడలేదు. ఇరాన్‌లో ఆంతరంగిక పరిస్థితుల కారణం గానే ఇబ్రహీం రైసీ ప్రభుత్వం ఇలా వ్యవహ రిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement