Thursday, April 25, 2024

మన ప్రతిభ ఫలం మనకే…

ప్రపంచంలో ఇప్పుడు ఆవిష్కరణలకు ప్రాధాన్యం లభిస్తోందనీ, కరోనా వేళ భారత్‌ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ లను అందజేయగలిగిందంటే ఆవిష్కరణల ఫలితమేన ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటల్లో ఎంతో నిజం ఉంది.హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇరవైవ వార్షికోత్సవాలను ప్రారంభిస్తూ ఆయన చేసిన ప్రసంగం శాస్త్ర, పరిశోధన, రంగాల్లో వారికి దిశా నిర్దేశంగానే పేర్కొనవచ్చు. యావత్‌ ప్రపంచం ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోంది. జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో భారత్‌ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ భారత్‌ని ప్రశంసించారు. అదేదో మోడీ ఉబ్బి తబ్బిబ్బు అయ్యేట్టు చేయడానికి చేసిన ప్రశంస కాదు.కరోనా క్లిష్ట సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు భారత్‌ నాలుగు వ్యాక్సిన్లను సరఫరా చేసింది. భారత్‌లో మంచి ప్రతిభ గల ఇంజనీర్లు, పరిశో ధకులు,శాస్త్రజ్ఞులు ఉన్నారు.వీరందరినీ తయారు చేస్తు న్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆసియాలోనే అతి పెద్ద శిక్షణ సంస్థ. ఇలాంటివి హైదరాబాద్‌లో నెలకొనడం మనకు గర్వకారణం. అలాగే, కోవాక్సిన్‌ అనే టీకాను హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ లో తయారు చేశారు. ఇలా ఎన్నో ప్రాణావసర మందు లు, ఇంజినీరింగ్‌ పరికరాలు,తదితరాలకు తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ రూపు దిద్దుకుంది.అలాగే, పూణ, ముంబాయి, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరా ల్లో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లో ఎన్నోస్టార్ట్‌ప్‌లు వెలిశాయి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ప్రవాస భారతీయుల్లో ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు కనిపిస్తున్నారన్న మోడీ మాటల్లో అతిశ యోక్తి లేదు. ప్రపంచంలో అగ్రగామి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తు న్నాయి. గతఏడాది రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.విదేశాలకు వెళ్ళి ప్రచారం చేస్తేనో, లాబీయింగ్‌ చేస్తేనో వచ్చినవి కావివి. ఇక్కడ తగిన అవకాశాలు, వాతావరణం ఉండటం వల్లనే అందరూ క్యూ కడుతు న్నారు. అలాగే, ప్రధాని ఇంకో మంచి మాట చెప్పారు. భారత్‌లో ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగానికి ప్రభుతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారైన వస్తువులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. భారత్‌లో సంస్కరణల అమలుకు ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సంకీర్ణ రాజకీ యాల వల్ల వెనుకటి ప్రభుతాలు సంస్కరణల అమలు కు సంకల్పించినా, భాగస్వామ్య పార్టీలు తలోవైపునకూ లాగేవి . దాంతో ప్రభుతం ముందుకు వెళ్ళలేకపోయేది. ఇప్పుడు అలాంటిపరిస్థితి లేదు. అందుకే విదేశీ పెట్టు బడులు వరదలావస్తున్నాయన్నారు ప్రధాని. మంచిదే కానీ, ఆ మేరకు ఉద్యోగాల వృద్ధి కూడా జరిగితే ఆక్షేపణ ఏమీ ఉండదు. మన దేశంలో విద్యావంతులు, పరిశోధ కులు, శాస్త్రజ్ఞులకు ఎటువంటి కొదవ లేదు.వారికి మంచి అవకాశాలు వస్తే విదేశాలకు వెళ్ళిపోతున్నారు.కానీ, ఆ స్థాయికి ఎదగని ఇతర విద్యావంతులు, గుమాస్తా కేటగిరి ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు.

అందుకే, విద్యార్జనతోపాటు ప్రతిభ పెంచుకోవాల నీ, ఆవిష్కరణలకు పనికి వచ్చే విజ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని ప్రధాని చెబుతున్నారు. అందుకు తగిన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. కేంద్రం ఈ విష యంలో ముందడుగు వేస్తున్నా, అదే స్థాయిలో రాష్ట్రాల నుంచి ప్రోత్సాహం లభించడం లేదు. ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకే తమ ప్రభుత్వం రిఫార్మ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ ఫారమ్‌ నినాదంతో ముందుకు వెళ్తోందని మోడీ చెప్పారు శాస్త్ర విజ్ఞాన రంగానికి చెందిన విద్యార్ధుల్లో, రిసెర్చ్‌ స్కాలర్లలలో ప్రతిభ ఉంది కనుకనే విదేశీ కంపెనీ లు, సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంపదను వృద్ధి చేయడానికి మన వారి తెలివి తేటలు, మేథో సంపత్తి ఉపయోగ పడుతున్నాయి.అవి మన దేశానికే ఉపయోగ పడితే సంపద పెరగవచ్చు.సంపద ఇప్పుడూ పెరుగుతున్నా, పంపకం సక్రమంగా జరగక పోవడం వల్ల పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం పెరు గుతోంది. అందువల్ల ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపులో సంపద పంపిణీ సక్రమంగా జరగాలన్నది కూడా ముఖ్య మైన అంశమే. అలాగే, పాలసీ విధానాలు నాలుగు గదులకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్ళినప్పుడే ఫలితం లభిస్తుంది.పరిశోధనా ఫలితాలు క్షేత్ర స్థాయికి వెళ్ళాలనే పిలుపు నాలుగైదు దశాబ్దాల నుంచి వినిపిస్తు న్నా, అటువంటి సమనయం లేకపోవడం వల్ల ఫలితా ల ప్రయోజనాలు కనిపించడం లేదు. ఇదే విదేశాల్లో అయితే, అక్కడి వారు పరిశోధకులను రంగంలోకి దింపి రైతులకూ, తయారీ దారులకు అండగా నిలబడేట్టు చేస్తు న్నారు. ఆ తేడాను మన వారు గుర్తిస్తే మనకున్న వనరు లు, మన వారి మేధస్సు మన ఉత్పత్తులను పెంచడానికి తోడ్పడేవి.కనుక పరిశోధనా ఫలితాల మార్పిడి అత్యవస రమన్నదే ప్రధాని ఉద్బోధ సారాంశం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement