Saturday, April 20, 2024

గోధుమలపై నిషేధం సరైనదే..!

దేశంలో గోధుమ ఉత్పత్తులు మార్చి నెలలో అధిక ఎండల కారణంగా గోధుమ ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో ఏప్రిల్‌ మాసంలో ఆహార ద్రవ్యోల్బణం 8శాతానికి పెరిగింది. ఈ కారణంగా గోధుమ ఎగుమతులను నిషేధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా గోధుమను ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశం రెండవది. మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని జి-7 దేశాల ఆహార మంత్రులు తప్పుపడుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచంలో పలు దేశాల్లో ఉత్పత్తులు దెబ్బతిన్న తరుణంలో భారత్‌ కూడా ఎగుమతులు ఆపేస్తే కష్టమవుతుందని వారు వాదిస్తున్నారు. అమెరికా , దానిమిత్ర దేశాలు గతంలో స్వీయరక్షణ పేరిట ఎన్నో సార్లు ఈ మాదిరి నిర్ణయాలు తీసుకున్నాయి. గోధుమల విషయంలో అగ్రరాజ్యమైన అమెరికా దశాబ్దాలుగా ఒంటెత్తు పోకడలను అనుసరిస్తోంది. ఆహార రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి ముందుమన దేశం అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునేది. పిఎల్‌– 480 పథకంకింద అమెరికా ఎగుమతి చేసిన గోధుమ నిలువ‌లన్నీ పుచ్చిపోయినవని అప్పట్లో పార్లమెంటులో ప్రభుత్వంపైప్రతిపక్షాలు ధజమెత్తాయి.

ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు మన దేశం ఇతర దేశాలకు ఆపన్నహస్తాన్ని అందితోంది.ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత నల్లసముద్రం మీదుగా గోధుమల ఎగుమతులు నిలిచిపోయాయి.గోధుమలఉత్పత్తి విషయంలో ఇప్పటికీ మన దేశం ఎప్పుడూ ముందు ఉంటూ వస్తోంది. వరుసగా ఐదేళ్ళ పాటు రికార్డు స్థాయిలో దిగుబడులను సాధించింది.ఈ ఏడాది గోధుమల దిగుబడి 111 .3 మిలియన్‌ టన్నులు ఉంటాయని అంచనా వేయగా,పలు ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గి 106 మిలియన్‌ టన్నుల దిగుబడి లభించింది.ఎండల కారణంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి,మరి కొన్ని రాష్ట్రాల్లో అతి వృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకునే కేంద్రం ఎగుమతులను నిషేధించింది గోధుమల ఎగుమతిలో భారత్‌ ఎప్పుడూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల యూరప్‌ పర్యటన సందర్భంగా కూడా పేర్కొన్నారు.కరోనా కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ల కారణంగా బలహీన బడుగు వర్గాలు పనులు కోల్పోవడంతో కేంద్రం ఉచిత రేషన్‌ పద్దతిని ప్రవేశపెట్టింది.ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నది. దేశంలో గోధుమనిలువ‌లు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలో గోధుమ పిండి ధర 40 శాతంపెరగడంతో ముందు జాగ్రత్త కోసం ఎగుమ తులను నిషేధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.అయితే. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీప్రభుత్వం కుచించడం వల్ల ఉత్పత్తులు తగ్గాయని కాంగ్రెస్‌ ,తదితర పార్టీ లు ఆరోపిస్తున్నాయి. వరి ఉత్పత్తిని అధికంగా సాధించినా, కేంద్రం కొనకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. వరి కొనుగోలు అంశంపై చాలా రోజుల పాటు వాదోప వాదా లు,ఆరోపణలు,ప్రత్యారోపణలు జరిగాయి. గోధుమల ఉత్పత్తుల పై ఏడాది పాటు మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు సాగించిన ఆందోళన ప్రభావం ఉంది.అయితే, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఆహార నిలలకులోటు రాలేదు.

విదేశాలకు ఎగుమతుల విషయంలో మన దేశాన్ని తప్పు పట్టే హక్కుఏ దేశానికీ లేదు.గోధుమల ఎగుమతులపై మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని మన ప్రత్యర్ధి అయిన చైనా సమర్ధించడం గమనార్హం.గోధుమలను ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తున్న అమెరికా,దాని మిత్ర దేశాలే ఇలాంటి సం క్షోభ సమయాల్లో స్పందించాలని కూడా చైనా పేర్కొంది. జి-7 కూటమి ఆహారమంత్రులు భారత్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని కూడా చైనా తప్పు పట్టింది. భారత్‌ తన అంతర్గత అవసరాలు,సమస్యలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాన్ని జి-7 దేశాలే కాదు ఏ దేశమూ తప్పుపట్టాల్సిన పని లేదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ ఆహార సంస్థ ఇలాంటి సమయాల్లో చొరవ తీసుకుని గోధులు ఎక్కువ పండించే దేశాల నుంచి దిగుమతులు పెరిగేలా చూడాలి అయితే ,ఆ సంస్థ కూడా అమెరికా కనుసన్నుల్లో పని చేస్తుండటం వల్ల పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నది. మన దేశం ఇతర దేశాలకు గోధుమను ఎగుమతి చేయ డానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిం చినప్పటికీ, ద్రవ్యో ల్బణం కారణంగా ఎగుమతులను నిషేధించాలని నిర్ణయించింది. ముందుగా హామీ ఇచ్చినదేశాలకు ఎగుమతులవిషయంలో ఎటువంటి తేడాలుండవని స్పష్టం చేసింది. ఏడుమిలియన్‌ టన్నుల నుంచి పదిమిలియన్‌ టన్నుల వరకూ ఎగుమతి చేయాలని సంకల్పిం చినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement