Saturday, April 17, 2021

ఆత్మ‌హ‌త్య‌ల ప్రేర‌ణ – హక్కుల ఉల్లంఘ‌నే..

త‌నని తాను చంపుకోవడానికన్నా బ్రతకడా నికే ఎక్కువ ధైర్యం కావాలి’… ఆత్మహత్య ల సూక్ష్మాన్ని ఆల్బర్ట్‌ కేమస్‌ సంక్షిప్తంగానే విడమరిచి చెప్పారు. అంతటి ధైర్యం కోల్పోవడానికి కారణాలేమిటి? వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, మల్కెపల్లికి చెందిన రమేష్‌ అనే రైతు అప్పుల బాధ భరించలేక భార్య, యుక్తవయసు కూతురు, కొడుకు తో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాగే ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు రాలేదని కొంతమంది యువ కులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుల ఆత్మహత్యలు జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా 1991 నుంచి నిన్న మొన్న టి వరకు సరాసరిన ఐదు లక్షల మంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారు. అలాగే… అనేక సందర్భాల లో కొంతమంది మహిళలు తమకు జరుగుతున్న వేధింపులను బయటకు చెప్పుకోలేక ఆత్మగౌరవం అణచుకొని జీవించలేక ఆత్మహత్యలు చేసుకుంటుం డగా… కుటుంబ పెద్దలు, భర్త సరైన విధంగా తోడ్పాటునివ్వకపోవడంతో ఎదురయ్యే ఆర్థిక సమ స్యల చట్రంలో ఇరుక్కొని మరికొంతమంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట తెలంగాణలో సెంట్రల్‌ జైలునందు ఎ.సి.బి. ద్వారా పట్టుబడి రిమాండ్‌ ఖైదీగా వున్న సస్పెండెడ్‌ తహసీ ల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధం గా రకరకాల కోణాలలో జరుగుతున్న ఆత్మహత్యల ను సామాజిక వ్యవస్థలోని పలు రకాల జాఢ్యాలు ప్రేరేపిస్తున్నాయా…? పాలకుల విధానాలు ప్రేరేపిస్తు న్నాయా…? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మొత్తం మీద ఆత్మహత్యల ప్రేరేపణ అనేది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. 2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మొద్దు శీను అనే రిమాం డ్‌ ఖైదీ సెంట్రల్‌ జైలులో హత్యచేయబడ్డాడు. ఈ మొద్దు శీను హత్య వెనుక, నిన్నటి నాగరాజు ఆత్మ హత్య వెనుక వేరే విధమైన వ్యూహాలతో కూడిన పెద్ద తలల ప్రమేయం వుందని ఆరోపణలు వున్నాయి. పాలకులు ఎన్నికల సమయంలో తన మ్యానిఫెస్టోల లో సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా భవిష్యత్తు లో సంభవించే పరిణామాలను పట్టించుకోకుండా తాత్కాలిక ప్రయోజనాలతో వెంటనే అధికారంలోకి రావాలనే ఆరాటంతో, పదవీ కాంక్ష కక్కుర్తితో అనేక రకాల హామీలను ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నింటిని తూతూ మంత్రంగా అమలు చేయడం, మరికొన్నింటిని అసలు పట్టించుకోకపో వడం జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలలో ఇటు ప్రాంతీయ పార్టీ లు, అటు జాతీయ పార్టీలు పోటాపోటీగా మ్యానిఫె స్టోలు విడుదల చేశాయి. పేదలలో ఆశలు రేకెత్తిస్తారు. అవి అమలు కావు. ఈ విధమైన పాలకుల అస్తవ్యస్థ విధానాల వల్ల, కొన్ని బలమైన వర్గాల ఆధిపత్యం వల్ల బలహీన వర్గాలకు చెందినవారు, ఇతరత్రా చైతన్యం కొరవడినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. ఆత్మహత్య అనేది పాపమా? మహాపాప మా అనే కోణాన్ని పక్కన పెడితే, అదొక నేరం. చట్టాల లో వెసులుబాట్లు ఉన్నా ఒక ప్రాణి బలవంతాన మర ణానికి గురవుతున్న కారణాలను ప్రేరేపితాలుగా నిర్ధారించాలి. బ్రతికి జీవితాన్ని సాధించాలి అనే విధంగా చుట్టూ వున్న వ్యక్తులు, సామాజిక స్పృహ కలిగిన స్వచ్ఛంద సంస్థలు, తోటి మనుషులను చైత న్యవంతులను చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ప్రత్యేకంగా మానవహక్కుల కమిషన్లు, ఇతర హక్కుల కమిషన్లు నిరుపేదలకు, బలహీనవర్గాలకు కొండంత అండగా సేవలు అందిస్తున్నాయి. ఈ హక్కుల కమిషన్లకు ఎలా వెళ్లాలి. అక్కడ పిటీషన్లు ఏ విధంగా సమర్పించాలి… అని అనేక మంది ప్రాథమి క న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నల్గొండ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ మహ మ్మారి ద్వారా వ్యాధులకు గురవుతూ…. అతి చిన్న వయసులో చనిపోతున్న వారి గాథలను తెలుసుకోవ డానికి ఆ మధ్య జాతీయ మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధుల బృందం స్వయంగా పర్యటించింది. అలాగే… కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయేషా అనే డిగ్రీ చదువుతున్న యువతి మహిళా హాస్టల్‌ లో మానభంగానికి గురై హత్య చేయబడిన ఉదంతాన్ని స్వయంగా తెలుసుకోవడానికి జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ అప్పుడు అక్కడికి విచ్చేశారు. మొద్దు శీను హత్య మీద అప్పటి ఉమ్మడి మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పి. సుభాషణ్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ సంచలనాత్మక తీర్పును వెలువరించారు. ప్రస్తుత తెలంగాణ మానవ హక్కు లు కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి. చంద్రయ్య ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీ వెనుకనున్న వడ్డెర బస్తీ సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా పర్యటిం చారు. వామనరావు అనే న్యాయవాద దంపతులు దారుణంగా హత్యకు గురైన ఘటనను సుమోటోగా కేసు రిజిస్టర్‌ చేశారు. ఈ విధంగా హక్కుల కమిషన్ల అండదండలతో రేపటి రోజులు మనవేనని భావించి అవమానాలను అధిగమించి, ఆకలి, పేదరికం, ఓట ములనే ఆయుధాలుగా మలచుకొని ఆత్మ ధైర్యంతో ముందుకెళ్లాలని హితబోధలు చేయడం ఒక ఎత్తు. కాని సమాజంలో ఈ ఆత్మహత్యల దుష్పరిణామాల ను అరికట్టడమెలాగన్న దానిపై పరిశీలనాత్మక తుల నాత్మక అధ్యయనం జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలే ఎక్కువ సందర్భాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఒకటి రెండు దశాబ్దాలుగా ప్రభు త్వాలు.. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు పేదల సమున్నతి కోసం పథకాలు ప్రవేశపెడుతున్నా యి. పిల్లల చదువు, పెద్దల పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆసు పత్రి కిట్లు, పుట్టిన పిల్లలకు ఆర్థిక వెసులుబాటు, రైతు లకు నగదు పంపిణీ, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నా ఆర్థిక కారణలతో ఆత్మహత్యలు ఆగడం లేదంటే ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన మరికొన్ని కీలక కోణాలు ఇంకా మిగిలి ఉన్నట్టే అను కోవాలి. సస్పెండెడ్‌ తహశీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య ఈ కోవలోకి రాదు. ఒక అనైతిక, అవినీతి చర్యలో నిం దితుడైన అధికారి ఆత్మహత్య అది. అసలా అధికారి అలాంటి అవినీతి చర్యలకు పాల్పడే ఆస్కారాన్ని ప్రభుత్వ వ్యవస్థ కల్పిస్తున్నదని అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటించి, అమలు చేస్తూ చేతులు దులుపుకుంటే సరిపోదని, ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను నివారించే ప్రయ త్నాలు జరగాలని స్పష్టమవుతున్నది. మానవ హక్కుల కమిషన్లు రొటీన్‌ పద్ధతిలో నోటీసులు ఇచ్చి, న్యాయవ్యవస్థ పరిధిలో విచారణ జరపడం కాకుం డా ఒక్కో ఆత్మహత్య కేసుని మానవ, సామాజిక కోణంలో అధ్యయనం చేసి, లోపాలను, లొసుగుల ను కనుగొని ప్రభుత్వ స్థాయిలో వాటిని నివారించేలా చట్టాలు సవరించడమో, చట్టాలు చేయడమో జరిగే లా ప్రయత్నించాలి. అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలను కునే వ్యక్తులకూ తమకున్న బతికే హక్కు గుర్తుకు వచ్చే వీలవుతుంది.

  • తిప్పినేని రామ‌దాస‌ప్ప నాయుడు..
Advertisement

తాజా వార్తలు

Prabha News