Friday, March 10, 2023

ఎడిటోరియ‌ల్ – ఈశాన్యం కొత్త సంకేతం…

ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కి కొంచెం అటూఇటూగా వచ్చాయి. త్రిపుర, నాగాలాండ్‌లలో బీజేపీ అధికారాన్ని దాదాపు నిలబెట్టుకున్నట్టే. మేఘాల యలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ పిఎ సంగ్మా కుమారుడు కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి దూసుకుని వస్తోంది.త్రిపురలో బీజేపీ కూటమి బలం 36 నుంచి 33కి తగ్గింది. క్రిందటి సారి బీజేపీ ఒక్కటే 36 స్థానాలు సాధించగా, ఈసారి ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ తో పొత్తుకుదుర్చుకున్నా బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ 31 కన్నారెండు సీట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. త్రిపు ర మాెెథా పార్టీ 12 స్థానాలను గెల్చుకుంది.ఈ పార్టీ ప్రధా న డిమాండ్‌ని అంగీకరించేది లేదని బీజేపీ మొదటి నుం చి స్పష్టం చేసింది.ఈ పార్టీ మద్దతు ఇస్తే బీజేపీ కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. మాణిక్‌ రాజవంశానికి చెందిన ప్రద్యుత్‌ విక్రమ్‌ వర్మ నేతృత్వంలోని త్రిపుర మోథా పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.దాంతో బీజేపీ మెజారిటీ తగ్గింది. త్రిపుర అసెంబ్లిd ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ ముఖ్యమం త్రి విప్లవ్‌ కుమార్‌ని మార్చి మాణిక్‌ సాహూని ముఖ్య మంత్రిగా చేసింది. అయినప్పటికీ పార్టీలో సఖ్యత ఏర్పడ లేదు.విప్లవ కుమార్‌ మీద తీవ్ర వ్యతిరెెకత కారణంగానే ముఖ్యమంత్రిని మార్చింది.త్రిపురలో మార్క్సిస్టు పార్టీ కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది.తృణమూల్‌ కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.ప్రధాని నరేంద్రమోడీని ఇటీవల కాలంలో విమర్శిస్తున్నా, తృణమూల్‌ అధ్యక్షురాలు,పశ్చిమ బెం గాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీతో లోపాయి కారీగా సఖ్యతతోనే ఉంటున్నారనీ, త్రిపురలో తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి మార్క్సిస్టు- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్ధుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నారంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనాయకు డు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణ ఈ ఫలితాల్లో రుజువై ంది,

- Advertisement -
   

మార్క్సిస్టు, కాంగ్రెస్‌ కూటమికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చి ఉంటే ఈసారి బీజేపీ మట్టి కరిచి ఉండేది. బీజేపీ,వామపక్ష కూటముల మధ్య సీట్ల తేడా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఓట్ల తేడా ఒక శాతం మాత్రమే. ఇండిజినెస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌డీటీ) బలహీనమైందని బీజేపీ భావించింది. ఈ సారి ఎన్నికల్లో సొంతంగానే మెజారిటీ సాధించగలమనే అతిశయాన్ని ఆ పార్టీ ప్రదర్శించింది. కిందటి సారి ఐపి ఎఫ్‌డిటీతో కలిసి 44 సీట్లను సాధించిన బీజేపీ ఈసారి 33 సీట్లను మాత్రమే గెల్చుకుంది. బీజేపీ అతి విశ్వాసమే ఆ పార్టీ సీట్లు తగ్గడానికి కారణం.అయితే, మెజారిటీ తగ్గినా అధికారాన్ని నిలబెట్టుకున్నందుకు కమలనాథులు సంబ రపడుతున్నారు. కానీ, ఆదివాసీలతో ఏర్పడిన ఐపీఎఫ్‌ డిటీ ఎప్పటికైనా బీజేపీకి పక్కలో బల్లెం కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం లో తమ పార్టీ అధికా రంలో ఉంది కనుక తాయిలాలు ఇచ్చి ఆదివాసీ పార్టీకి నచ్చజెప్పవచ్చని కమలనాథులు భావిస్తున్నారు.

త్రిపుర మోథా పార్టీ నాయకుడు ప్రద్యత్‌ విక్రమ్‌ వర్మ ఆదివాసు లకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఆది వాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ని ప్రకటించాలన్నది ఆయన డిమాండ్‌.42సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ 12సీట్లను మాత్రమే గెల్చుకుంది. నాగాలాండ్‌ ఎన్నికల్లో మళ్ళీ పాత కూటమే గెల్పొందింది.ఈసారి నాగాలాండ్‌ అసెంబ్లిdలో తొలి మహిళగా హెకానీ జకాలు కాలు మోప నున్నారు. అమెరికాలో ఉన్నత విద్య నభ్యసించి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం చేశారు. ఆమె తర్వాత క్రుసో అనే మరో మహిళ కూడా నాగాలాండ్‌ అసెంబ్లిdకి ఎన్నికయ్యా రు. నాగాలాండ్‌ రాష్ట్రం 60 ఏళ్ళ క్రితం ఏర్పడింది. ఇప్పటికి13 సార్లు ఎన్నికలు జరిగాయి.ఈసారి బీజేపీ, ఎన్‌డిపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. మేఘాలయలో సంగ్మా నేతృత్వంలోని పార్టీ విజయ పథంలో సాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ 26సీట్లు గెల్చు కుంది.ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొత్తం 52 సార్లు పర్యటించారు.ఎన్నో కేంద్ర పథకాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.మరోసారి అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ చేస్తామని వాగ్దానం చేశారు. ఆయన ప్రచారం ఒక ఎత్తు. తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో ఉండటం మరో ఎత్తు. బీజేపీ ప్రయోజనం కోసమే తృణమూల్‌ పోటీ చేసిందన్న రాహుల్‌ మాటనిజమే కావచ్చు.ఉప ఎన్నికల్లో కూడా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అక్కడ పోటీ చేసి గెల్చింది. తమిళనాడులో డిఎంకె కూటమి భాగస్వామి గా కాంగ్రెస్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ స్థానం నుంచి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఈవీఎస్‌ ఇలం గోవాన్‌ విజయం సాధించారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి మొత్తం 40 సీట్లను గెలుచు కోగలదన్న ధీమా ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాప నలు చేసి వదిలేయడమే కేంద్రం చేస్తున్న పని అని ఇప్పటి వరకూ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన సాయం ఏదీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement