Monday, April 15, 2024

కాల‌కూట విషం – ప్రాణ‌ధార ఔష‌ధం..

విషసర్పాలు, విష పురుగులు కనిపిస్తే ప్రాణ భయంతో పరిగెత్తడం మానవ సహజం. అయితే.. వాటి విషం ధర కోట్లలో ఉంటుం దని తెలిస్తే ప్రాణాలకు తెగించి మరీ వెంటాడి, వేటాడి వాటిని పట్టి… కాల కూట విషాన్ని సేకరించి కోట్లకు పడగెత్తాలని ఆరాటపడేవారెందరో ఉంటారు. తాచు పాము, దానికంటే ప్రమాకరమైన ‘రస్సెల్‌ వైపర్‌’ తదితర పాముల విషం కంటే దక్షిణాఫ్రికా అడవుల్లో జీవించే ‘మాక్రోతెల్‌ ర్యులేని’ అనే జాతి సాలె పురుగు విషం చాలా ఖరీదైనది. దీని గ్రాము విషం ఖరీదు.. 1350 అమెరికన్‌ డాలర్లు. అంటే ఈ జాతికి చెందిన సాలీడు విషం ఖరీదు కిలో సుమారు రూ. 9 కోట్లకి పైమాటే! దీని విషమే ప్రపంచంలో అత్యంత ఖరీదైన దని అంటారు. అలాగే ‘ఆర్నితో క్నోనస్ హ్యూనం’ అనే సాలెపురుగు విషం గ్రాము 1050 డాలర్లు, ‘చిలో బ్రత్యాగునాక్సీ నేసిన్‌’ అనే జాతి సాలీడు విషం గ్రాము ఖరీదు 1080 అమెరికన్‌ డాలర్లు. ఇవన్నీ అంతర్జాతీ య మార్కెట్లో పలికే ధరలు. క్షణాల్లో ప్రాణాలు తీసే ఈ పాషానాన్ని మానషి ప్రాణాలు కాపాడే ఔషధాల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధిం చిన పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నా యి. వీటితో పోల్చుకుంటే.. పాము విషం ధర చాలా తక్కు వనే చెప్పాలి. తాచు పాము విషం గ్రాము 70 డాలర్లు ఉండగా, ప్రపంచంలోనే అత్యంత బలిష్టమై న ఆఫ్రి కన్‌ ఏనుగుని కేవలం ఒకే ఒక్క కాటుతో రెండు గంట ల్లో చంపగల కింగ్‌ కోబ్రా విషం ధర 250 డాలర్లు. అలాగే ‘రస్సెల్‌ వైపర్‌’ పాము విషం 100 డాలర్లు. కట్లపాము విషం 320 డాలర్లు. చెట్ల ఆకుల్లో ఒదిగి పోయి వుండే ‘మెడోగ్రీన్‌ పిట్‌’ అనే పసిరిక పాము విషం గ్రాముకి 35 డాలర్లు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మొత్తం 3 వేల సర్ప జాతులు ఉండగా వాటి లో కేవలం 600 జాతులు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. మనిషి ప్రాణాలను తీసే వీటి విషం ఇప్పుడు ప్రాణాధార ఔషధాలలో కీలకం మారింది. ముఖ్యంగా పాముల విషంలో హమోటాక్సిన్స్‌, న్యూరో టాక్సిన్స్‌ అనే రెండు రకాల విషాలు వుంటా యి. హమోటాక్సిన్‌ … అధిక రక్తం కారుతున్న వారి లో వారి రక్తం గడ్డ కట్టే కాంపౌండ్స్‌ని కచ్చితంగా ఉం చి రక్త ప్రసారం అవసరమైనంత వరకు జరిగేలా చూస్తుంది. అయితే న్యూరోటాక్సిన్స్‌ .. మని షి కేంద్ర నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపి కండ రాలని నిస్తేజపరచి శ్వాస కోశం మీద ప్రభావం చూపి శ్వాస ఆగేటట్లు చేస్తుంది. ఇలా ప్రతియేటా ప్రపంచం లో లక్షలాదిమంది న్యూరోటాక్సిన్‌ అనే విషంతో శ్వాస తీసుకోవటం కష్టంగా మారి చనిపో తున్నారు. ఇక అరుదుగా కొన్ని దేశాల్లో మాత్రమే వుండే సాలీ ళ్ళు, తేళ్లు, పాముల నుండి లభిస్తున్న విషంతో మనుషులలో అధిక రక్త స్రావాన్ని అరికట్టడం, హర్ట్‌ అటాక్‌ వచ్చిన రోగి గుండెలో ఏర్పడిన అడ్డంకులు తొలగించి ప్రా ణాలు కాపాడడం వంటి మరెన్నో ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలు తయారు చేయవచ్చునని 1960లో డాక్టర్ హగ్‌ అలీస్టర్రీడ్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన చేసిన పరిశోధనలో భాగంగానే ‘మలయంపిట్‌’ అనే వైపర్‌ జాతికి చెంది న పాము విషంతో మనుషుల రక్తనాళాలలో ఏర్పడిన అడ్డంకుల వల్ల సంభవిస్తున్న హార్ట్‌ అటాక్‌, బ్రెయిన్‌ అటాక్‌ తదితర ప్రాణాంతక వ్యాధుల నుండి వేలాది మందిని రక్షించే ఔషధాన్ని తయారు చేయడానికి పరిశోధనలు సాగుతున్నాయి. అలాగే మరికొన్ని పాములు, తేళ్లు, సాలీళ్ల విషంతో కాన్సర్‌ నిరోధక మందుల తయారీకి పరిశోధనలు జరిగాయి ఇంకా జరుగుతున్నాయి. లాస్‌ఏంజిల్స్‌లోని సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డా. ఫ్రాన్సి స్‌ మార్కులాండ్‌ ఈ కాన్సర్‌ ఔషధ వినియోగంపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ ఔషధం మార్కె ట్లోకి వస్తే బ్రెస్ట్‌ కాన్సర్‌ నుండి మహిళలకు విముక్తి లభించినట్లే. ప్రాణాలు హరించే కీటకాలు, పాముల విష మే మనిషి ప్రాణాలు నిలిపే ఔషధంగా మారడం సైన్స్‌ సృష్టించిన అబ్బురమనే చెప్పాలి.అత్యంత ఖరీ దైన సాలీడు విషం, తేలు విషంలతో కూడా ప్రాణాంత వ్యాధులను తగ్గించే దిశ గా పరిశోధనలు జరుగుతు న్నాయి. అయితే… కోట్లు సంపాదించవచ్చు కదా అని పాములు, తేళ్లు, ఇతర కీట కా లను చంపి వాటి విషా న్ని సేక రించడానికి ప్రయత్నించ వ ద్దు.అదిఅత్యంత ప్రమాద కరం.
….చ‌లాది పూర్ణ‌చంద్ర‌రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement