Thursday, December 8, 2022

డ్రెవెూక్రాట్లకు ద్రవ్యోల్బణం దెబ్బ!

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక న్లు పై చేయి సాధించే అవకాశాలు ఉన్నట్టు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రతినిధుల సభలో ఎన్నికలు జరిగిన పలు ప్రాంతాల్లో రిపబ్లికన్లు విజయం సాధించే అవ కాశాలున్నట్టు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు పై చేయి సాధిస్తే, దేశాధ్యక్షుడు బిడెన్‌ అజెండా అమలుకు వారు అడ్డుపడవచ్చు. ద్రవ్యోల్బణం వల్ల తమ పార్టీకి ఈసారి ఆశించిన స్థానాలు రాక పోవచ్చని డెమోక్రాట్లు ముందే నిర్ధారణకు వచ్చారు. అయితే ఫలితాలు వారు ఆశించినంత దారుణంగా లేవు. అలాగే, ఈ ఎన్నికల్లో తమ హవా తప్పదని రిపబ్లికన్లు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఫలితాలు వారూహించనంత గొప్పగా రాలేదు. మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లో 35 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. అమెరికన్‌ కాంగ్రెస్‌కి ఈసారి నలుగురు భారత అమెరికన్లు ఎన్నికయ్యారు. ప్రాథమిక ఫలితాల సరళి ప్రకారం రిపబ్లికన్లకు ఆధిక్యత లభిస్తున్నప్పటికీ డెమోక్రాట్లు మంచి ఫలితాలనే రాబడుతున్నారు.

అక్కడి రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం సెనేట్‌లో హంగ్‌ పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడనవసరం లేదు. కాగా, ఈ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన అరుణా మిల్లర్‌ మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఇది చాలా గొప్ప విషయం గా భావిస్తున్నారు. అరుణ మిల్లర్‌ తల్లితండ్రులు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో మెజారిటీ సీట్లు సాధించిన రిపబ్లికన్లు వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాతో ఉన్నారు. ప్రతినిధుల సభలో స్థానాల కోసం తీవ్రమైన పోటీ జరిగింది. పోలింగ్‌ జరుగుతుండగానే రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన రిపబ్లికన్లలో ఆశలు రేకెత్తించింది. వారు మరింత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.

- Advertisement -
   

ఆయన చేసే ప్రకటన రిపబ్లికన్‌ పార్టీ విజయానికి సంకేతంగా ఆ పార్టీ వారు భావిస్తున్నారు. మరోవైపు, అబార్షన్లపై సుప్రీం కోర్టు తీర్పు కారణంగా గట్టెక్కవచ్చని డెమోక్రాట్లు ఆశించారు. కానీ, ద్రవ్యోల్బణంతో వారి ఆశలు ఆవిరి అయ్యాయి. రిపబ్లికన్లు నేవెడా, విస్కా న్‌సిన్‌, అరిజోనాలో ముందంజలో ఉన్నట్టు, అత్యధిక స్థానంలో లీడింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల స్థానాన్ని డెమోక్రాట్లు ఇల్లినాయిస్‌ జిల్లాలో సాధించారు. ఇంకా అనేక చోట్ల రిపబ్లికన్లు విజయపథంలో సాగుతున్నట్టు సమాచారం. వర్జీనియాలో ట్రంప్‌ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్‌ అభ్యర్ధిపై డెమాెెక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బిడెన్‌ పాలనపై రిపబ్లికన్లు చేసిన వ్యతిరేక ప్రచారం చాలావరకూ పనిచేసింది. బిడెన్‌ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలున్నాయి. అరిజోనా సెనేట్‌ సీటుకు డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. లాస్‌వేగాస్‌లో డెమో క్రాటిక్‌ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. డమోక్రాట్లకు చెందిన ఆరు సీట్లను రిపబ్లికన్లు కైవసం చేసుకున్నారు. ద్రవ్యోల్బణంవల్ల అధిక ధరలు తమ విజయా వకాశాలను బాగా దెబ్బతీశాయని డెమోక్రాట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా రోడ్‌ ఐలండ్‌, ఓహియో, కాన్సాస్‌ తదితర ప్రాంతాల్లో డెమోక్రాట్లు తమ పట్టు నిల బెట్టుకున్నారు. మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీకి తక్కుకవ సీట్లు రావడం సహజమే అయినప్పటికీ,ఈ సారి తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందంటూ రిపబ్లికన్లు చేసిన ఆత్మవిశ్వాస ప్రకటనలు నిజం కాలేదు.

\కొన్ని చోట్ల డెమోక్రాట్లు ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, మొత్తం మీద సంప్రదాయకంగా తమ పార్టీకి రావల్సిన స్థానాలను కాపాడుకుంటున్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ప్రతినిధి డాక్టర్‌ వందనా శ్లాటర్‌ (డెమోక్రాట్‌) తిరిగి ఎన్నిక య్యారు. బాగా పోటీ ఉన్న స్థానాల్లో డెమోక్రాట్లు ఆశ్చర్యకరమైన రీతిలో విజయాలు సాధించడంతో రిపబ్లికన్లు ఆశించిన రీతిలో ఘనవిజయాలు రాలేదు. బిడెన్‌ ప్రసంగాలు, ఆయన ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేకపోవడం డెమోక్రాట్లకు తగినన్ని ఫలితాలు రాలేదు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ ప్రభావం ఎక్కువ కనిపించలేదు. నలుగురు భారత అమెరికన్లు ఎన్నికైనప్పటికీ వారి సొంత పలుకుబడి, పరిచయాలతోనే వారు ఎన్నిక య్యారు. ఈ ఎన్నికల ఫలితాలు బిడెన్‌కు గుణపాఠాల వంటివే. తన అజెండా పట్ల ప్రజల్లో అవగాహన, కల్పిం చడంలో ఆయన విఫలమైనట్టు కనిపిస్తోంది. ఇందు కోసం ఆయన కృషి చేయాల్సి ఉంటుంది. రెండేళ్ళలో చేసిన దాని కన్నా ఇంకా చేయవల్సింది ఎంతో ఉందని ఆయన గ్రహించి అజెండా అమలుపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement