Thursday, April 18, 2024

ఇది ప్రజా విజయం!

నూట ముప్పయి కోట్ల జనాభాగల భారత్‌లో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ విజయవంతంగా పూర్తి కాగలదా అని యావత్‌ ప్రపంచంఎంతో ఆసక్తితో ఎదురు చూసింది. వ్యాక్సినేషన్‌ వైద్యులు, వైద్య వ్యవస్థ , దేశంలో మౌలిక సదుపాయాలనుబట్టి విజయవంతం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన ప్రాథమిక విషయం. మన దేశంలో కోటానుకోట్లమందికి తగిన వైద్య సదుపాయాలు లేవు. ప్రభుత్వాసుపత్రులు ధర్మాసుపత్రు లుగా ముద్రవేసుకున్నాయి. వాటి ని సందర్శిస్తే రోగాలు నయం మాట దేవుడెరుగు, లేని రోగాలు వస్తాయన్న వ్యంగ్యోక్తులు తరచూ వినిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శతమానం భవతి అన్నట్టు వంద కోట్లమందికి వ్యాక్సినేషన్‌ విజవంతంగా పూర్తిచేయడం నిస్సందేహం గా ప్రశంసార్హమైన విషయం. అందుకే, ఐక్యరాజ్య సమితి మొదలుకుని , భారత రాష్ట్రపతివ రకూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన వైద్య రంగంలోని వారందరినీ అభినందించారు. జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుుడు ఇదొక ప్రచార కార్యక్రమమని పరిహాసం చేసినవారు న్నారు. మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని అలాంటి విమర్శలు రావడం సహజమే. అయితే, ప్రధాని మోడీ వజ్ర సంకల్పం కారణంగా ఈ కార్యక్రమం విజయవం తం అయింది. అయితే, ఈ కార్యక్రమం పూర్తిగా అన్ని చోట్లా నూరు శాతం విజయవంతం కాలేదు. అంటే, రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 50 శాతానికి దగ్గరగా ఉంది. రెండో డోస్‌ తీసుకోవడంలో అలసత్వం కన్నా, వ్యాక్సినేషన్‌ కంపెనీలు విధించిన గడువు, కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వ్యవధి పాటించాలన్న నియమ నిబంధనలు మొదలైనవి కారణం కావచ్చు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉత్సాహభరితంగా సాగుతోంది. ఎక్కడా అలసత్వం కనిపించడంలేదు. అలాగే, తెలుగు రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కేటాయింపులో కేంద్రం ప్రత్యక శ్రద్ధ తీసుకుంటోంది. అమలు జరుగుతున్న కార్యక్రమంలో ఉత్సాహాన్ని గమనించి కేంద్రం వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. సంప్రదాయబద్దంగా తరతరాలుగా పాటిస్తున్న ఆచారాలు, దైవసంబంధమైన ఉత్సవాలు, పెళ్ళిళ్ళు, ఇతర శుభ కార్యాక్రమాలకు సమూహాలు ఒక చోట చేరడ వల్ల వైరస్‌ వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రా యాన్ని తోసిపుచ్చడానికి లేదు.తెలంగాణలో వంద శాతం వ్యాక్సినేషన్‌ను త్వరలో పూర్తి చేసే లక్ష్యంతో వైద్యఆరోగ్య శాఖ చేస్తున ్నకృషి ఫలించాలని జనం కోరుకుంటున్నారు. తెలంగాణలో కోవిడ్‌ అదుపులో ఉంది. పాజిటివ్‌ కేసులు 0.4 శాతం మాత్రమే నమోదు అవుతున్నట్టు అధికారులు తెలిపారు. కోవిడ్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, అధికారులు తీసుకుంటున్న శ్రద్ధాసక్తుల ఫలితంగానే ఈ కార్యక్రమం ఆశించిన దాని కన్నా ఎక్కువ వేగంగా సాగుతోంది. రాజకీయాలను పక్కన పెట్టి, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువలో తీసుకుని వెళ్ళడంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసార్హమైన పాత్ర వహిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు కూడా కోవిడ్‌ నియంత్రణ విషయంలో చాలా ఆచితూచి వ్యాఖ్యలు చేస్తున్నాయి. రెండేళ్ళ వయసు వారి నుంచి 18 ఏళ్ళ వయసు వారి వరకూ టీకాలను అందజేసేందుకు జైడస్‌ కంపెనీకి కేంద్రం నుంచి అనుమతి లభించింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. చుక్కల మందు పేరిట పోలియో వ్యాక్సిన్‌ను విజయవంతంగా అమలు జేసిన అనుభవం తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులకు ఉంది. అలాగే, మలేరియా, మసూచి వంటి అంటు వ్యాధుల నియంత్రణలోనూ మన వైద్య సిబ్బందికి మంచి అనుభవం ఉంది. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న వారు కూడా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వాతావరణంలో మార్పుతోపాటు పరిసరాల కాలుష్యం, జల, వాయు కాలుష్యం ఇందుకు కారణం. ప్రజల్లోకూడా చైతన్యం వస్తే తప్ప కేవలం ప్రభుత్వ సేవల వల్ల ఇలాంటి వైరస్‌లు అదుపులోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఎవరి జాగ్రత్తలు వారు పాటించడం శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement