Thursday, March 16, 2023

ఎడిటోరియ‌ల్ – మ‌న గుండెను మ‌నం కాపాడుకుందాం

హార్ట్‌ ఎటాక్‌…గుండె నొప్పి …ఛె స్ట్ట్‌పెయిన్‌ ..ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ ఉన్నపళంగా మనిషి ప్రాణాలు తీసేవే.ఇలాంటిరోగాలతో ఆకస్మికంగా ప్రాణాలు వదలడం అనేది గతంలో అరవై ఏళ్ళు దాటిన వారిలో ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ముప్పయి,నలభై ఏళ్ళ వయసుగల యువతీ యువకులు ఈ కారణాలతో ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు.ఇందుకు కారణం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు,తదితర కారణాలను వైద్యులు చెబుతున్నారు.రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా తర్వాత మన జీవన విధానంలో చాలా మార్పులు తెచ్చింది.ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి.కరోనా పోయినా ఆ జీవన విధా నం,అలవాట్లు మనల్నివిడిచి పెట్టడం లేదు.దానికి తగినట్టు సామాజిక మాధ్యమాల ప్రభావం వయసుతో నిమిత్తం లేకుండా అందరి మీదా పని చేస్తోంది.ఉదయం లేస్తూనే కాఫీ తాగే అలవాటు మాదిరి బదులు సెల్‌ఫోన్‌ని చేతుల్లోకి తీసుకుని తమకు కావల్సిన ప్రోగ్రామ్‌ల కోసం అన్వేషణ అనేది ప్రబలిపోయింది. మనగుండెను కాపా డుకుందాం అనే నినాదంతో కార్యక్రమాలు వస్తున్నా యంటే గుండెపోటు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
   

అలాగే సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథలు, ఇతరకార్యక్రమాల కోసం అన్వేషణ జరపడం నిత్యకృత్యమైంది.గతంలో నిద్ర లేవగానే ఏరోజుకారోజు కార్యక్రమాలను సమీక్ష చేసుకునేవారు.ఈరోజు ఎవరిని కలవాలి?ఏయే ప్రాంతా లకు వెళ్ళాలి? అనే అంశాలపై పునశ్చరణ చేసుకునే వారు.ఇప్పుడు అలాంటివేమీలేవు.సామాజిక మాధ్య మాల్లో చానల్స్‌ని వరుసపెట్టి తిప్పేసి సంచలనాల కోసం ఎదురు చూడటం అలవాటైంది.దీంతో మనిషిలో టెన్షన్‌ పెరిగి పోతోంది. చదివే వార్తలు, చూసే దృశ్యాలతో బీపీ మరింత పెరిగి పోతూ ఉంటుంది.మన పూర్వీకులు అలవాటు చేసిన పద్దతులకు స్వస్తి చెప్పి ఆధునిక జీవన విధానాన్ని అలవర్చుకున్న తర్వాతనే ఇలాంటి దుస్థితి ఎదురవుతోంది. మన పెద్దలు ఎలాంటి సంచలనాత్మక వార్త, లేదా సమాచారం విన్నా నిండుకుండ తొణకనట్టు గా ఉండేవారు.మంచి,చెడు అనే తేడాలేకుండా అన్ని వార్తలను సమానంగా స్వీకరించడం ద్వారా మనిషి తనను తాను అదుపు చేసుకోవచ్చు.
అలాగే, ఆలోచనలు అవధులు దాటుతుండటంవల్ల కూడామనిషిలో ఆందోళనలు పెరుగుతున్నాయి.అందుకే నడుస్తున్న వారు ఉన్నట్టుండి పడిపోవడం,వాహనాలు స్టార్ట్‌ చేసే వారు కుప్పకూలి పోవడం,బస్సు ఎక్కుతూ పడిపో వడం వంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువ అవుతు న్నాయి. బస్సు డ్రైవర్లకు ఈ మధ్య గుండెపోట్లు తరచూ వస్తున్నాయి. సకాలంలో బస్సును పక్కకుతీసి ఆపుతూ ఉండటం వల్ల ఈ మధ్య కొన్ని ఘోరమైనప్రమాదాలు తప్పిపోయాయి. అలాగే, విమానాల్లో పైలట్లకు ఉన్నపళంగా స్ట్రోక్‌ రావడంతో కో పైలట్‌లు అప్రమత్తమై ప్రమాదాల నుంచి ప్రయాణీకులను రక్షించిన సంఘటన లున్నాయి. ఇప్పుడు ఉదహరించిన సంఘటనలన్నీ ముప్పయి,నలభై ఏళ్ళ వయసు గల విషయంలోచోటు చేసుకున్నవే.దీనికి కారణాలపై నలుగురూ,నాలుగు రకాలుగా చెప్పుకోవడాన్ని చూస్తున్నాం. ఇప్పుడు తిండి అలాంటిది,ఇప్పుడు వడ్లు,పప్పు ధాన్యాలు క ృత్రిమ ఎరువులతో పండిస్తున్నారు.వాటిలో జీవం ఏముం టుంది?అందుకే చిన్న వయసు వారు కూడా పడిపోతు న్నారంటూ పాత కాలం వారు విశ్లేషణలు ఇస్తుంటారు. పోషకాహార లోపం వల్లనే ఇలాంటి ఘటనలు సంభవిస్తు న్నాయని వైద్యులు పేర్కొంటూ ఉంటారు.మనం తీసుకునే ఆహారంలో పోషకాహారాలెన్ని ఉన్నాయో తూకం వేసుకుని సరిచూసుకునేవారెందరు ? అలా చూసుకోవడానికి ఎవరికైనా వ్యవధి ఎక్కడుంది? ఉద యం లేచింది మొదలు రాత్రి పడుక్కునే వరకూ పరుగుతోనే జీవితం.ఆధునిక ప్రపంచంలో పెరిగిన పోటీ అందుకు కారణం.ఎంత పరుగు తీసినా సమ యానికి ఆఫీసుకు చేరుకోగలమా? లేదా అనే టెన్షన్‌ మనిషిలో పెరుగుతూ ఉండటం వల్ల ఉన్నపళంగా గుండె ఆగిపోవడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకుం టున్నాయి. టెలివిజన్‌ చానల్స్‌లో మనుషుల్లో ఆరోగ్య స్పృహ పెంచేందుకు వివిధ కార్యక్రమాలను రోజూ ప్రసారం చేస్తుంటారు.తాము ఆరోగ్యంగా ఉన్నామనీ, అవి తమకు అవసరంలేదని యువత చానల్స్‌ తిప్పేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో కూరగాయలు, మాంసం, తదితర ఆహార పదార్ధాల్లో ఏయే విటమిన్లు ఉన్నాయో, వాటి ఉపయోగాలేమిటో విడమర్చి చెబుతూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేది అనుభవం ఉన్న వైద్యలే కానీ, వారు చెప్పే విషయాలను నోట్‌ చేసుకుని ఆ యా విట మిన్లు గల ఆహార పదార్ధాలను మాత్రమే సేవిం చాలన్న నిర్ణయం తీసుకున్నా, ఒకటి రెండు రోజులు ఆ పద్దతులను పాటించి ,మళ్ళీ మామూలు ధోరణిలో మనిషి జీవనం సాగుతున్నప్పుడు ఆరోగ్య సూత్రాలు ఎన్ని విన్నా ఏమిటి ప్రయోజనం? కరోనా తగ్గినా దాని ప్రభావం కారణంగానే ఉన్నపళంగా మనుషుల్లో అలసట,తలతిరిగి పడిపోవడం వంటివి రావడానికి కారణమన్న వాదనలో అసత్యం లేకపోవచ్చు.మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం కూడా మన ఆరోగ్యంపై పని చేస్తూ ఉంటుంది. ఉన్నపళంగా గుండెపోటు వస్తే కార్డ యాక్‌ రిసిటేషన్‌ (సీపీఆర్‌) ద్వారా మనిషిని కాపాడవచ్చని ఇటీవల పలు సంఘటనల ద్వారా రుజువు అయింది. వాకింగ్‌కి వెళ్ళినా, వ్యాహ్యాళికి వెళ్ళినా అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల దాని ప్రభావం గుండెపై పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మంచి గాలి,మంచి వాతావ రణం, ఆందోళనలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న పెద్దల మాట చద్ది మూట.

Advertisement

తాజా వార్తలు

Advertisement