Friday, April 19, 2024

Editorial – మ‌హానేత – మ‌హానాడు

తెలుగుజాతి ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్‌. ఆయన స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఆవిర్భావం.. అది సాధించి న విజయం ఓ సంచలనం. ఆయన పాలన సంక్షేమ అజెండా. బీసీలకు రాజ్యాధికారం రుచి చూపించి అంద లమెక్కించిన ఘనుడాయన. అందువల్లే, ఆయన జయం తి సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే మహానాడు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమమే అయినా ఈసారి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈనెల 28న ఎన్టీఆర్‌ శత జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ మండ్రి సమీపంలోని వేమగిరిలో మహానాడు శని, ఆదివారాల్లో నిర్వహి స్తున్నారు. మళ్లి అధి కారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న తెలుగు దేశం పార్టీ, మరొక్క ఏడాదిలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు శని, ఆదివారా లలోజరుగుతున్న ఈ మహానా డు భిన్నమైనది. అధి కారంలోకి వస్తే ఏం చయాలో నిర్ణ యించుకునే వేది క. మేనిఫెస్టోలో ఏఏ అంశాలు పొందు పరచాలో స్థూలంగా చర్చించే కార్యక్రమం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విశ్లేషించి.. విమర్శించి.. తామేమి చేయబోతు న్నామో తెలియచెప్పే సందర్భం.

అందువల్ల ఈసారి మహానాడు ఆసక్తి రేపుతోంది. తెలుగుగడ్డపై రాజకీయాలను ఓ మలుపుతిప్పిన ఎన్టీఆర్‌, పార్టీ యంత్రాగాన్ని ఉత్తేజి తులను, కార్యోన్ము ఖులను చేసేందుకు ప్రారంభించిన సంప్రదాయమే మహానాడు. అందువల్ల మహానాడు, శతజయంతి వేళ తెలుగువారు ఎన్టీఆర్‌ తలుచుకోకుం డా ఉండలేరు. తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని నాయకునిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు రాజకీయ రంగ ప్రవేశం ఒక సంచలనం. మహిళలకూ, వెనుకబడిన తరగతుల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పదవుల్లో అత్యధి క ప్రాతినిధ్యం ఇచ్చారు. ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి వచ్చి జాతీయ పార్టీల మత్తు వదిలించింది. అంతవరకు ఏ రాజకీయ పార్టీ పట్టించు కోని బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో యువకులు, విద్యాధికులు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. మంత్రుల య్యారు.

అప్పటి నుంచే ఆయా వర్గాలకు ఇతర రాజకీయ పార్టీలు ప్రాతినిథ్యం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్తితి ఏర్పడింది. తెలుగు జాతి ఖ్యాతిని ఆచంద్రా ర్కం చేసిన నందమూరి తారకరామారావు ఎంత సేపు ప్రసంగించినా, ఏ అంశంపై ప్రసంగించినా, తెలుగులోనే సాగేది ఆయన వాగ్ధాటి. ఒక్క ఆంగ్ల పదం ఆయన ప్రసంగంలో దొర్లేదికాదు.ఆయనకు తెలుగు నేర్పిన కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఎన్టీఆర్‌కి తెలుగు పై ఉన్న మమకారాన్ని ప్రశంసిస్తూ ఓ సందర్భంలో అన్న మాటలివి. మూడు దశాబ్దాలు పైగా చలన చిత్ర రంగం లో రారాజుగా కీర్తి ప్రతిష్టలను సంపాదించిన ఎన్టీఆర్‌ రాజకీయరంగ ప్రవేశం ఒకానొక చారిత్రక మలుపులో చోటు చేసుకుంది. తెలుగు భాషకు అంతకు ముందులేని గౌరవం, ప్రాభవం ఎన్టీఆర్‌తోనే సంప్రాప్తమైంది.

- Advertisement -

హైదరాబాద్‌లో తెలుగు మాట్లాడటం తెలుగంత సులభ తరం అయింది. ఢిల్లిd వెళ్ళినప్పుడు తెలుగువారిని మద రాసీలుగా పరిగణించేవారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశా రు. ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే తెలుగువారికి ఢిల్లిలో గౌర వం దక్కడం ప్రారంభమైంది. ఆయన చేసిన రెండు రూపాయిలకు కిలో బియ్యం వాగ్దానం అతి ముఖ్యమై నది. ఎన్టీఆర్‌ రెండు రూపాయిల సబ్సిడీ బియ్యం పథకాన్ని తెస్తున్నారనగానే, అంతకుముందున్న కాంగ్రె స్‌ ప్రభుత్వం ఇంకా తక్కువ ధరకు తాము సరఫరా చేస్తా మంటూ వాగ్దానం చేసింది. కానీ, నిలబెట్టుకోలేక పోయింది. అలాగే, ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఆయన అమలు జేశారు. మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని వాదించడమే కాకుండా దానిని అమలు జరి పిన చిత్తశుద్ధిగల పాలకుడు. తెలుగునాట తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినదీ ఆనే. తెలంగాణాలో అమలులో ఉన్న పటేల్‌, పట్వారీ వ్యవస్థ ను రద్దు చేశారు. పాలన వికేంద్రీకరణ ఆయనకే సాధ్య మైంది. మండల పరిషత్‌ల పేరుతో మూడంచెల వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలనేవి అంతకు ముందు కూడా అమలు జరిగినా, ఎన్టీఆర్‌తోనే వాటికి సార్థకత ఏర్పడింది. అలాగే, పేదవారికి ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్‌ ప్రారంభించారు. చిత్త శుద్ధి, నిజాయితీ, అంకితభావం ఉన్న నాయకుడు ప్రజలను ఏ విధంగా మెప్పించగలరో ఎన్టీఆర్‌ నిరూపిం చారు. జాతీయ స్థాయిలో కాంగ్రేసేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన నేషనల్‌ ఫ్రంట్‌ని ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో భిన్న ధ్రువాలైన కమ్యూ నిస్టులు, భారతీయ జనసంఘ్‌ (ఇప్పటి బీజేపీ) లను ఏకతాటిపైకి తెచ్చారు. ఎన్టీఆర్‌ రాజకీయాలలో అందరి వాడిగా పేరు గాంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement