Thursday, May 18, 2023

ఎడిటోరియ‌ల్ – గ‌వ‌ర్న‌ర్లు .. ఇది విన్నారా…

సుప్రీంకోర్టు గురువారం రెండు కీలకమైన తీర్పులు ఇచ్చింది.ఈ రెండూ కూడా కేంద్రప్రభుత్వాన్ని ప్రత్యక్షం గాను, పరోక్షంగానూ ప్రభావితం చేసేవే. అంతేకాదు కేంద్రం వైపు వేలెత్తి చూపేవే. ఢిల్లిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవహారమైనా మహారాష్ట్రలో అప్పటి గవర్నర్‌ కోషి యారి వ్యవహారశైలి అయినా కేంద్రప్రభుత్వంతో సం బంధంలేదని భావించలేం. ఢిల్లిలో పాలన ఎన్నికై న ప్రజాప్రభుత్వానిదేనన్నది మొదటి తీర్పు. మహారాష్ట్ర లో శివసేన వర్గాల మధ్య బలాబలాల నిర్థారణలో గవ ర్నర్‌ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టు వ్యా ఖ్యానించడం రెండో తీర్పులోని సారాంశం. ఈ రెండూ పరోక్షంగా కేంద్రానికి ఎదురు దెబ్బలే. ఎందుకంటే, ఢిల్లిలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయా లకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కట్టుబడి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లి ప్రభుత్వంలో అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికి నియంత్రణాధికారం ఉందంటూ 2015లో కేంద్రం ఒక నోటిఫికేషన్‌ని జారీ చేసింది. దానిని ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా,2019లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లి ప్రభుత్వం మళ్ళీ అప్పీలు చేయగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ నేతృత్వం లోని ధర్మాసనం కీలకమైన తీర్పు చెప్పింది.

- Advertisement -
   

ఢిల్లిలో పాలనాధికారుల నియంత్రణకు సంబంధించి శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఢిల్లి ప్రభుత్వా నిదా అన్న అంశం పై సుప్రీంకోర్టు తీర్పును కేజ్రీవాల్‌ కోరారు. దీనిపై రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు సిఫార్సు చేసింది. ఆ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి ఇప్పుడు తీర్పు చెప్పింది. ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలను గవర్నర్‌ అమలు జరిపి తీరాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాక, పాలనా సర్వీసులపై ఢిల్లి ప్రభుత్వానికి అధికారం లేదంటూ ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు అమలు జేస్తారు. కానీ, ఢిల్లి కేంద్ర పాలిత ప్రాంతం కనుక, ఆ సూత్రం వర్తించదన్నది కేంద్రం వా దన. ముఖ్యంగా ఢిల్లిలో పోలీసులపై అధికారం పూర్తిగా తనదేనని కేంద్రం వాదిస్తుండటం వల్ల అనేక సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లిలో రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ రాయబారుల వంటి సెలబ్రెటీలు నివసిస్తా రు కనుక అక్కడ శాంతిభద్రతల బాధ్యత తమదేనని కేంద్రం వాది ంచింది. అసలు కేంద్రానికీ, కేజ్రీవాల్‌కీ మధ్య ఉన్న వివాదం హోంశాఖ అధికారాలకు సంబం ధించినవే

. ఇక మహారాష్ట్ర వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు గవర్నర్‌ రాష్ట్ర శాసన సభలో బలా బలాల పరిస్థితి తెలుసుకోకుండా, బలపరీక్ష కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ కేసులో ఆనాటి ముఖ్య మంత్రి ఉద్ధవ్‌ థాకరేని బలపరీక్షను కోరే ముందు రాష్ట్రం లో రాజకీయ పరిస్థితిని అప్పటి గవర్నర్‌ అంచనా వేయ డంలో విఫలమయ్యారని స్పష్టం చేసింది. గవర్నర్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా, ఇదేమీ తనని శిక్షించినట్టు కాదని కోషియారి ప్రకటన చేయడంలోని అనౌచిత్యాన్ని గర్హించాల్సిందే. గవర్నర్‌ చర్య మీద అభిశంనగా దీన్ని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఉద్ధవ్‌ థాకరే షిండేకి నైతిక పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తానెలా వ్యవహరించాలో తెలుసుకోకుండా తొందర పాటు నిర్ణయం తీసుకున్నానన్న గుణపాఠం నేర్చుకున్నారా లేదా అన్నది ఈ సందర్భంలో తలెత్తే ప్రశ్న. అయితే, ఉద్ధవ్‌ థాకరే బలపరీక్షను ఎదుర్కో కుండా రాజీనామా చేయడం వల్ల ఊరట కలిగించలేమ ని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పర్యవసానం గా ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే రాజీనామా చేయాలని శివసేన (ఉద్ధవ్‌వర్గం) నాయకులు డిమాండ్‌ చేస్తున్నా రు. ఇది దాయాదుల పోరు వంటిది. కొద్ది రోజుల పాటు మహా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించడానికి ఇది తోడ్ప డ వచ్చు. ఢిల్లిలో ఆప్‌ ప్రభుత్వంపై ఇచ్చిన తీర్పు మాత్రం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి నైతిక విజయాన్ని ఇచ్చినట్టు ఆప్‌ నాయకులు అభివర్ణించారు. ముఖ్యంగా, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నడిపేందుకు కేజ్రీవాల్‌ సాగిస్తున్న యత్నాలకు ఇది ఊతం ఇవ్వొచ్చు. సుప్రీంకోర్టు తీర్పుని ఢిల్లిd, మహారాష్ట్ర లకే పరిమితం చేయనక్కర్లేదు. గవర్నర్లకి, అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వివిధ రాష్ట్రా లకూ ఇదిపరోక్షంగా వర్తిస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్ల అధికారిక వ్యవహారశైలికీ ఈ తీర్పుని అన్వయించుకోవా ల్సిన అవసరం ఉంది. ఎన్నికైన ప్రభుత్వపు నిర్ణయాలను గవర్నర్‌ అమలు జరిపి తీరాలన్న సుప్రీంకోర్టు తాజా గీతోపదేశంతోనైనా వివాదాలు సద్దుమణుగుతాయని ఆశిద్దాం!

Advertisement

తాజా వార్తలు

Advertisement