Friday, January 27, 2023

ఎడిటోరియ‌ల్ – సేతు స‌ముద్రంపై క‌ద‌లిక‌..

భారత దేశం ఎల్లలు గురించి చెప్పేటప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అనే పదం వాడుకలో ఉంది. అంటే దక్షిణాన సేతు సముద్రం నుంచి ఉత్తరాన హిమాల యాల వరకూ అని అర్థం. అలాంటప్పుడు తార్కికంగా చూసినా సేతు సముద్రం ఉందా? లేదా అనే మీమాంస అర్థరహితం. సేతు సముద్రంపై ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై తమిళనాడులోని రాజకీయపార్టీలన్నీ ఒకే అభిప్రాయాని కి రావడం స్వాగతించాల్సిన విషయం. రాష్ట్ర శాసనసభ ఈ విషయమై ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించ డం ఆహ్వానించదగిన పరిణామం. గతంలో ఈ ప్రాజెక్టు ను వ్యతిరేకించిన బీజేపీ కూడా ఇందుకు మద్దతు తెలపడం వల్ల దీనిని చేపట్టేందుకు మార్గం సుగమం అయినట్టే. భారత. శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. రామాయణ కథలో లంకలో ఉన్న సీతాదేవిని రావణాసు రుడి చెర నుంచి విడిపించడానికి వానరమూక నిర్మించి న వారథే సేతుసముద్రమని హిందువుల ప్రబల విశ్వాసం. మన దేశంలో పశ్చిమ, తూర్పు తీరాల మధ్య నౌకాయానం చేయాలంటే శ్రీలంకను చుట్టి రావల్సి ఉంటుంది. రామసేతుకు కొద్ది పాటి మార్పులు చేస్తే ఆ ప్రయాస తొలగిపోతుందని బ్రిటిష్‌ వారి హయాంలోనే ఆలోచన చేశారు. అయితే, దీనివల్ల సేతుసముద్రంలో కొంత భాగాన్ని తవ్వాల్సి వస్తుంది. అలాచేస్తే హిందువుల మనో భావాలు దెబ్బతింటాయని ఈ ప్రాజెక్టును తలపెట్టి నప్పుడల్లా సందేహాలతో ఆపేస్తూ వచ్చారు.1860లోనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. కానీ, రామసేతు హిందువులకు సంబం ధించిన వారథి అనీ, దీనిని తవ్వడానికి వీలు లేదని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో బ్రిటి ష్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాయి. తమిళనాడులో 1967 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకె, దాని దాయాది పక్షమైన అన్నా డీఎంకె వంతుల వారీగా అధికారంలో కొనసాగు తున్నాయి.

- Advertisement -
   

ఈ రెండు పార్టీలకూ సైద్ధాంతిక విభేదాలు పెద్దగా లేవు. అందువల్ల ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం లో ఒకే తీరులో వ్యవహరిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్‌ ఓట్లుు, సీట్ల రాజకీయాల్లో అసలు దీనిని గురించి పట్టించు కోలేదు. డీఎంకె వ్యవస్థాపకుడు అన్నా దురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరకూ ద్రవిడ పార్టీలన్నిం టిదీ ఈ విషయంలో ఒకే తీరు. కేంద్రంలో సంకీర్ణ ప్రభు త్వాల్లో డీఎంకె భాగస్వామ్యం వహించినప్పుడల్లా ఈ ప్రాజెక్టు కోసం పట్టుపడుతూ ఉండేది. వాజ్‌పేయి నేతృ త్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత అధికా రంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ డీఎంకె భాగస్వామ్య పక్షం గా ఉంది. డీఎంకె ఒత్తిడిపై యూపీఏ ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయిల వ్యయంతో సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. అయితే, హిందుత్వ సంఘాలు, పర్యావరణ వేత్తలు న్యాయపోరాటం జరిపా యి. 2007లో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత అన్నా డీఎంకె ప్రభుత్వం దీనిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు స్టాలిన్‌ ప్రభుత్వం ద్రవిడ సంప్రదాయాన్ని పునరుద్ధరిం చాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. కరుణానిధి వైఖరికి భిన్నంగా కేంద్రాన్ని ఢీకొనేందుకు అడుగులు వేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలతో చేతులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సేతు సముద్రం అంశా న్ని తెరమీదికి తెచ్చారు. అలనాటి రామసేతును తవ్వడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుం దంటూ బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ ద క్షిణాదిన ముఖ్యంగా తమిళనాడులో కాలు మోపేందు కు తీవ్రంగా యత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సేతు సముద్రం ప్రాజక్టు విషయంలో తన వైఖరిని మార్చుకుని ఉండవచ్చు.

సేతు సముద్రం ఆనాడు వానరసేన లంకకు పోవడానికి నిర్మించిన వారథి అని విశ్వాసం. ఆధునిక కాలంలో నౌకావాణిజ్యం ప్రాధాన్యం పెరిగింది. భారత తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య నౌకాయానానికి శ్రీలంకను చుట్టి రావల్సి వస్తోంది. ఈ ప్రయాసను తప్పించేందుకు అలనాటి రామసేతులో కొంత భాగాన్ని తవ్వితే సరిపోతుందన్న ఆలోచన ఆధు నికుల్లో వచ్చింది. ఏమైనా సేతు సముద్రం నిర్మాణం జరిగితే నౌకా వాణిజ్యానికి ఎంతో ఉపయోగమనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పటికే శ్రీలంక తీరంలో తన నౌకలను నిలుపుతున్న చైనా ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకుని హిందూమహాసముద్రంలో సులభంగా ప్రవే శించవచ్చు. అమెరికా వైఖరి ఏమిటో చూడాలి. సేతు సముద్రం వల్ల వాణిజ్య అవకాశాలు పెరిగినా పొరుగు దేశాలతో సమస్యలూ పెరిగే అవకాశం ఉంటుంది. వాటి ని పరిష్కరించుకోవడం ఒక సవాల్‌ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement