Friday, January 27, 2023

ఎడిటోరియ‌ల్ – స‌క‌ల జ‌నుల సంక్రాంతి

భోగీ, మకర సంక్రాంతి, కనుమ… వరుసగా వచ్చే ఈ మూడు పండుగలు హిందువులకేకాక, భారతీయులకు ఎంతో ప్రాధాన్యమైనవి. సమ్యక్‌ క్రాంతి… ప్రజలందరినీ సమైక్యంగా ఉం చే పండుగ ఇది. మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. సూర్యకిరణా ల ప్రసరణతో పకృతిలో, మనిషిలో వచ్చే మార్పులకు ప్రతీకగా ఈ పండుగకు ప్రాధాన్యం ఉంది. చలిగిలిపో యి శరీరం చుర్రుమనే ఎండలు ప్రారంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. మిగిలిన పండు గలు కేవలం ఆయా దేవతలను ఆరాధించడానికి ఉద్దేశిం చినవి కాగా, మకర సంక్రాంతినాడు సూర్య భగవానుని ఆరాధించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని గమనంలో మార్పును సూచించే ఈ పండుగను కొన్ని ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు. సూర్యారాధనతో ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయన్న ది హిందువుల నమ్మకం సూర్యుని కిరణాలు పడనిదే చైతన్యవంతులు కాలేరు. ఈ పండుగతో వాతావరణం లో మార్పు వస్తుంది. ప్రకృతిలో మార్పు వస్తుంది. మనం తినే ఆహారంలో మార్పు వస్తుంది. మనిషిలో నవచైతన్యానికి మకర సంక్రాంతి దోహదం చేస్తుంది. జనవరి 14వ తేదీనే సంక్రాంతి పండుగ జరుపుకుంటా రు. అయితే, కొన్ని సందర్భాల్లో 15వ తేదీన సంక్రాంతి వస్తుంది. మతాలు, కులాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరికీ వెలుగునిచ్చే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయం కాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. సూర్యా రాధనతో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. సూర్యా రాధనతో శరీరానికి పసిమి ఛాయ వస్తుంది. దేవుడు లేడనే వారుండవచ్చునేమో కానీ, సూర్యుడు లేడనే వారు ఈ జగత్తులో లేనేలేరు. మనిషిలో ఉండే వైక్ల బ్యాల నూ, వైకల్యాలను సూర్యుడు తొలగిస్తాడు. సూర్యారాధా నను కొందరు అరుణ పారాయణ పేరిట నిర్వహిస్తారు.

- Advertisement -
   

అయితే, ఇందుకువారు మాఘమాసాన్ని ఎంచుకుంటా రు. అందుకే మకర సంక్రాంతిని కొన్ని ప్రాంతాల్లో మాఘీగా పిలుస్తారు. మాఘీ, మహామాఘీ సందర్భం గా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సిక్కులు మాఘీగానూ, తమిళులు పొంగల్‌గానూ, మధ్య భారత్‌ వారు సుకరాత్‌గానూ ఈ పండుగ జరుపు కుంటారు. పేరు ఏదైనా, అందరూ సంక్రాంతి పండుగ నాడు సూర్యుణ్ణి ఆరాధించి పొంగలిని నైవేద్యంగా పెడతారు. తెలుగునాట ఈ పండుగ నాడు పెద్దలకు తర్పణాలు వదులుతారు. గుమ్మడి పండ్లను దానం చేస్తారు. సంక్రాంతికి కళ భోగి పండుగతో ప్రారంభమవు తుంది. ధనుర్మాసంలో ఆడపిల్లలు రోజూ తెల్లవారు జామున తమ ఇళ్ళముందు కళ్ళాపు జల్లి, రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలను ప్రతిష్టిస్తారు. వాటికి పూజలు చేసి చుట్టూ తిరుగుతూ గొబ్బీయల్లో అంటూ పాటలు పాడు తారు.

ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ విల్లిపుత్తూరులో రంగనాథుణ్ణి ఇదే తీరులో ఆరాధించేదట.ఆమె కథను చెప్పుకుని ఆమె మాదిరిగా మంచి భర్త రావాలని ప్రార్ధన లు జరుపుతారు. గొబ్బెమ్మల అలంకరణ, గోదా కల్యా ణం వంటివి దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఎక్కువ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో వైష్ణవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆలయాల్లో తిరుమల తిరుపతి ప్రధానమైనది.తెల్లవారు జామున వేంకటేశ్వరుని (రంగనాథుని) మేల్కొలుపు గీతాలు, తిరుప్పావై పాశురాల పఠనంతో ఆలయాల్లో ఒక అద్బు éత వాతావరణం దర్శనిస్తూ ఉంటుంది. కార్తీక మాసం లో పరమేశ్వరుణ్ణి, మార్గశీర్ష మాసంలో శివ కేశవులనూ, పుష్య మాసంలో శ్రీమహావిష్ణువు అంశతో వెలసిన వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, భోగాలు నిర్వహిస్తా రు. సంక్రాంతి పండుగ మూడు రోజులలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. భోగినాడు వీధుల కూడళ్ళల్లో భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. దీనికి ఎంతో పారమార్థికత ఉందని పెద్దలు చెబుతారు.

వాతా వరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని మలుచు కోవడానికి భోగి మంటలు ఉపకరిస్తాయన్నది భౌతికం గా చెప్పే మాట. ఆధ్యాత్మికంగా భోగి మంటల్లో మనిషి తనలో ఉండే అరిషడ్వర్గాలను దహనం చేసుకుని మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవాలన్నది భోగి మంటల పరమార్థమని చెబుతారు. పిల్లలకు భోగి పళ్ళుపోయడం తెలుగునాట ఓ సంప్రదాయం. సంక్రాంతినాడు బంధుమిత్రులను ఆహ్వానించి పిండి వంటలతో ఆరగించడం, ఇళ్ళముంగిళ్లకు వచ్చే హరి దాసులు, గంగిరెద్దులకు సంక్రాంతి కానుకలు అందజే యడం కూడా సంప్రదాయమే. అలాగే,.కొత్త అల్లుళ్ళను ఆహ్వానించి నూతన వస్త్రాలను వినోద కార్యక్రమాలతో అలరిస్తారు. కనుమనాడును బల్లకట్టు పండుగగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా పాడిపంటల కు నిలయాలుగా గ్రామసీమలకు సౌభాగ్యాన్ని అందిస్తు న్న పశువులను పూజించే పండుగ ఇది. కాడెడ్లకు పూజలు నిర్వహించి హారతులు ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement