Saturday, March 25, 2023

ఎడిటోరియల్ – రాజ్యాంగానికి ర‌క్ష‌ణ ఏది?

మనకు ఎన్నో పండుగలు వస్తాయి. కానీ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలంతా జరుపు కునే పండుగలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. రెండు పండుగల సందర్భంగా త్రివర్ణ పతా కాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేయడం ప్రతిపౌ రుని విధి. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ప్రపంచంలో వివిధ దేశా ల్లోని వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటికన్నా మన రాజ్యాంగం విశిష్టమై నది. అత్యుత్తమమైనది. మనది లిఖితరాజ్యాంగం. ప్రభుత్వం శరీరమైతే, రాజ్యాంగం ఆత్మలాంటిదని రాజ్యాంగ నిపుణులు అభివర్ణించారు. రాజ్యాంగానికి కట్టుబడిన వారికే ఈ దేశంలో స్థానం. ప్రజల అవ సరాలు, సంక్షేమం, హక్కులు కాపాడటం కోసమే రాజ్యాంగానికి సవరణలు జరిగాయి. వ్యక్తి కన్నా దేశం గొప్పదన్న మౌలిక సూత్రం ప్రకారం మన దేశం రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అనుగుణంగానే చట్టసభలు శాసనా లను చేయాల్సి ఉంటుంది. చట్టసభలు రూపొందించే శాసనాలను పరిశీలించి, సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థ కు ఉంది.

- Advertisement -
   

మన నాయకులు పార్లమెంటును దేవా లయంగానూ, రాజ్యాంగాన్ని భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి పవిత్ర గ్రంథాలుగా అభివర్ణిస్తుంటారు. చట్టసభల సభ్యులు రాజ్యాంగంతో పాటు తమ మతగ్రం థాలపై ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెబుతూ దేవునికి అపచారం చేస్తున్నట్టే, రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి అపచారం చేస్తున్నారు. అయితే, రాజ్యాం గాన్ని వక్రీకరించేందుకు నాయకులు ప్రయత్నించినా, రాజ్యాంగం మౌలిక సూ త్రాలను మార్చే ప్రయత్నం ఎవ రూ ఇంతవరకూ చేయ లేదు. చేద్దామని ప్రయత్నించినా అది వారి వల్ల కాలేదు. మనది లౌకిక, ప్రజాస్వామ్య, సమసమాజ, సర్వసత్తాక ప్రభుత్వమని రాజ్యాంగంలో రాసుకున్నాం. దేశంలో అన్నివర్గాలకూ ఎటువంటి వివక్ష లేకుండా వారి హక్కు లను పరిరక్షిం చుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. డాక్టర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలోని కమిటీ వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెక్కుచె దరని రీతిలో మన రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ రూపక ల్పనకు దాదాపు మూడేళ్ళు పట్టింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్ని సంక్షోభాలు వచ్చి నా, మన దేశం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను తట్టుకుని నిలబడగలిగిందంటే మన రాజ్యాంగం ర క్షక కవచంలా కాపాడటమే కారణం.

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని సవరిం చినట్టే, ఇతర వెనుకబడిన తరగతులను (ఒబీసీలను) గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు దత్తం చేయడానికి 127వ సవరణ చేశారు. సామాజిక న్యాయానికి మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పెద్దపీట వేయడానికి రాజ్యాంగం కల్పించిన వెసులు బాటే కారణం. అంటరానితనాన్ని నిర్మూలిం చేందుకు రాజ్యాంగం పెద్ద పీట వేసింది. సమాజంలో అన్నివర్గాల వారూ సమష్టిగా, సామరస్యంతో కలిసి మెలిసి జీవించాలని మన రాజ్యాంగం ఘోషిస్తోంది. సామాజిక న్యాయ సూత్రాల అమలులో చాలా వరకూ పురోగతి కనిపిస్తున్నా, మహిళా సాధికారత విషయంలో మన దేశం ఇంకా వెనుకబడే ఉంది. ఈ విషయాన్నే రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రసార మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.

మహిళా సాధికారతను సాధించేందుకు పూర్వపు యూపీఏ ప్రభుత్వం తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ని ఎంపిక చేయగా, ప్రస్తుత ప్రధాని మోడీ చరిత్ర లో తొలిసారిగా గిరిజన మహిళను ఎంపిక చేశా రు. అయినప్పటికీ, మహిళా సాధికారతకోసం ఉద్దేశిం చిన చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు గడప దాటడం లేదు. మహిళలపై లైంగిక దాడులను నిరోధించడానికి కేంద్రంలో అలనాటి యూపీ ఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రాల పరిధి లో దిశ వంటి చట్టాలను తెచ్చాయి. అయినప్పటికీ మహి ళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే, గ్రామాల్లో పెత్తం దారీ తనం, అంటరానితనం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాం గం కల్పించిన హక్కుకల గురించి ప్రజలకు అవగాహన లేకపోవడంవల్ల ఇటువంటివి జరుగుతు న్నాయన్న అభిప్రాయంలో నిజం ఎంతో ఉంది. సామా జిక న్యా యంతోపాటు మహిళా సాధికారత కోసం ఉద్య మాలు జరగాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెబు తూనే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్య లు తీసుకున్న ప్పుడే రాజ్యాంగ రక్షణ జరిగి నట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement