Wednesday, April 24, 2024

ఎడిటోరియ‌ల్ – అణు గాయం … శాంతి గేయం

మానవజాతి చరిత్రలో మాయనిమచ్చగా మిగిలి పోయిన అణుబాంబు విస్ఫోటనం జరిగిన ప్రదేశంలో  జి-7 దేశాల అధిపతుల సమావేశాలు జరుగనున్నాయి. అణు విస్ఫోటనం జరిగి 77 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఆ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుంది. బాంబు విస్ఫోటనాల వల్ల కలిగే అనర్థం ఏమిటో ఇప్పటికీ మనం ఉక్రెయిన్‌లో చూస్తున్నాం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించి పదిహేను మాసాలు దాటింది. ఎన్నో మహా నగరాలు ఈ దాడుల్లో నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది అణుయుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం వింత కాదు. ఆ విస్ఫోటనంలో గాయపడినవారు, వికలాంగులైన వారు, మానసిక వైక్లబ్యం పొందిన వారు అంతే సంఖ్యలో ఉంటారు. ఇలాంటి వారితో ఒక తరం దాటిపోయింది. మరణించిన వారి కన్నా, మానసిక, శారీరక వికలాంగులైన వారివల్ల తదనంతర సంతతి ఇంకా జీవన్మృతులుగా బతుకులీడుస్తున్నారు. అటు వంటి వారిని ఆదుకోవడానికి కృషి చేయవల్సిన సంప న్న, అగ్రరాజ్యాలు మళ్ళీ ఆనాటి పీడకలను తలపింప జేసే రీతిలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయి న్‌ యుద్ధంగురించి టోక్యోలో దిగగానే విలేఖరులు అడిగిన ప్రశ్నలకు భారత ప్రధాని నరేంద్రమోడీ సమా ధానమిస్తూ, తరతరాలుగా భారత్‌ శాంతినే కోరుతున్న దనీ, గౌతమ బుద్ధుడు, ఆధునిక కాలంలో మహాత్మా గాంధీ యావత్‌ మానవజాతికి ప్రబోధించినవి శాంతి సామరస్యాలనేనని అన్నారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపాల ని రష్యాను కోరిన దేశాల్లో తమదేశం కూడా ఉందనీ, అయితే, ఐక్యరాజ్య సమితిలో రష్యా పై ఆంక్షల విషయం లో భారత్‌ తటస్థ వైఖరిని అనుసరిస్తోందని చెప్పారు.

అణు యుద్ధం కన్నా ప్రమాదకరమైన పరిస్థితులను ఇప్పుడు భూతాపం వల్ల యావత్‌ మానవాళి ఎదుర్కొం టోందనీ, భూతాపాన్ని తగ్గించే విషయంలో కూడా జరుగుతున్న కృషి భారత్‌ తోడ్పాటును అంది స్తోందని మోడీ అన్నారు. ఏడున్నర దశాబ్దాలు పైగా అణు దాడి జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలు అతి స్వల్ప కాలంలో అభివృద్ధిని సాధించాయి. సాఫ్టవేర్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో జపాన్‌ సాధించిన అభివృద్ధి అగ్రరాజ్యాలు సైతం అసూయపడే రీతిలో ఉంది. ఈ విషయం ప్రపంచ దేశాల నాయకులు ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలు అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రా లు కావాలని నినదిస్తున్నారు. ప్రజలకు తిండి, బట్ట, వసతి కల్పించడమే అగ్రప్రాధాన్యంగా అన్నిదేశాలూ పాటు పడుతున్నాయి. అలనాడు అణు యుద్ధం అనంత రం ప్రపంచ దేశాల మధ్య శాంతి, సామరస్యాల సాధన కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ కొనసాగుతు న్నా, దాని ఉనికి నామమాత్రంగానే ఉంది. ఏకైక అగ్ర రాజ్యమైన అమెరికా జేబు సంస్థగా అది పనిచెస్తోందన్న అపప్రథను మూట కట్టుకుంటున్నది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడినే కాకుండా,సిరియా యుద్ధాన్ని, పాలస్తీనా – ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని, వియత్నాం యుద్ధాన్ని ఆపించ డంలో అది విఫలమైంది. సమితి విధించే ఆంక్షలు పనిచేయని తూటాలుగా ఉంటున్నాయి. ఏ ఒక్క దేశ మూ సమితి ఆదేశాలను పాటించడంలేదు. ఈ నేపథ్యం లో ఉత్తర కొరియా వంటి దేశాలు తరచూ చేసే హెచ్చరిక లు, చేస్తున్న ప్రయోగాలనుబట్టి మళ్ళీ అణుయుద్ధం వస్తుందేమోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఆధునిక కాలంలో ప్రజలకు ఆయుధం కన్నా తిండి, వసతి, వస్త్రాలు అవసరం ఎంతైనా ఉంది. వాటిని ఇవ్వలేని దేశాలు అవి ఎంత శక్తివంతమైనవి అయినా, సంపన్నమైనవి అయినా వ్యర్థ దేశాలే తప్ప ప్రజాహిత దేశాలు కావు. జి-7 దేశాల కూటమికూడా శాంతి, సత్యం అహింసల కోసమే కృషి చేస్తోంది.ఈ కారణంగానే అలనాటి అణు విస్ఫోటాన్ని గుర్తు చేసే ప్రదేశంలో జి-7 కూటమి సమావేశాలను నిర్వహిస్తూ ప్రపంచ దేశాల బాధ్యతలను గుర్తెరిగింపజేయనున్నది. ఈ కూటమి సమావేశాలకు భారత ప్రధానిని ముఖ్య అతిధిగా ఆహ్వా నించడం గర్వించదగిన విషయం.

- Advertisement -

ఎంతో సముచితం. ఉత్తర కొరియా విన్యాసాలు అణుబాంబు దాడిపై అనుమానాలను మరింత విస్తృత పరుస్తున్నాయి. అందుకే యావత్‌ ప్రపంచం ఉత్తర కొరియా పోకడలను నిరంతరం పరిశీలిస్తోంది. ఆధునిక యుగంలో అణ్వస్త్రా లు, రసాయనిక అస్త్రాలు ప్రజలను భయపెడుతు న్నాయి. వీటిని తయారు చేసే దేశాలు ప్రపంచ శాంతికి శత్రు దేశాలుగా పరిగణిస్తున్నాయి. తాజాగా రష్యా- ఉక్రెయిన్‌పై జరిపిన దాడిలో వేలాది మంది మృత్యు వాత పడ్డారు. వీరిలో రష్యన్‌ జాతీయులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు రష్యాను ఇప్పుడు దూరంగా ఉంచుతున్నాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నాయి. మనదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అన్ని దేశాలు అణ్వస్త్ర దేశాలు కావడం వల్ల ఎవరూ ఎవర్ని నమ్మలేని స్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement