Friday, March 17, 2023

ఎడిటోరియ‌ల్ – అమెరికాతో డ్రాగ‌న్ కొత్త‌బాట‌…

అమెరికా,చైనాల మధ్య సామరస్యం ఏర్పడితే ప్రపంచంలో ఇక ఎక్కడా ఏ సమస్యలూ ఉండవు.అయితే,రష్యా తన పూర్వ వైభవం కోసం ఏడాది పై నుంచి ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దాడుల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. ముఖ్యంగా, రష్యా క్రూడ్‌పైనా,ఉక్రెయిన్‌ ఎరువులు,ఇతర సరఫరా లపైనా ఆధారపడిన దేశాలు ఎన్నో ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాయి.ఈ తరుణంలో అగ్రరాజ్యమైన అమెరికాతో చైనా సంబంధాలను మెరుగుపర్చుకోవాలని కోరుకోవడం స్వాగతించాల్సిన విషయమే.ఇరు దేశాల మధ్య కొన్ని విష యాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ,అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలపట్ల సంబంధాల వృద్ధికి అవకాశాలు మెరుగవుతున్నాయని చైనా కొత్త విదేశాంగ మంత్రిగా ఇటీవల నియమితులైన క్విన్‌ గాంగ్‌ అన్నారు.ఆయన 2021 నుంచి 23 వరకూ అమెరికాలో చైనా రాయబారిగా పని చేశారు.ఈ వ్యవధిలో ఆయన మొత్తం 22 రాష్ట్రాల్లో పర్యటించినట్టు,అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను స్వయంగా ,ప్రత్యక్షంగా చూసినట్టు గాంగ్‌ తెలిపారు. అమెరికా లోని పాఠశాలలు, విద్యా సంస్థల పనితీరును స్వయంగా పరిశీలించినట్టు ఆయన చెప్పారు.


అమెరికా,చైనా అధ్యక్షులు ఇటీవల కలుసుకుని వాతావరణ మార్పుపైనా,ప్రపంచం ఎదుర్కొంటున్న పెక్కు సమస్యలపై చర్చిం చారనీ,వారి మధ్య సంపూర్ణ అవగాహన కుదిరిందని గాంగ్‌ తెలిపారు.సమస్యలను ఎదుర్కోవడంలో సారూప్యత ఉన్నప్పుడు,వాటి పరిష్కారానికి ఏకీకృత విధానాన్ని అనుసరించడం సాధ్యమేఅవుతుంది.అయితే,సమస్యలను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి ,దృఢ దీక్ష అవసరం.అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నప్పుడు చైనాతో నిత్యం ఘర్షణకు దిగుతూ ఉండేవారు.వాణిజ్య రంగంలో చైనా దాటుకుని పోతోందని ఆక్రోశం వ్యక్తం చేసేవారు.అసలు ట్రంప్‌ హయాంలోనే చైనాతో అమెరికా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అంతకుముందు మెరుగుగా లేకపోయినా, చెడిపోలేదు.వాణిజ్యరంగంలోనే కాకుండా ఐటి పరిశ్రమల రంగంలో కూడా చైనా వేగంగా అభివృద్ధిని సాధించింది.చైనాకి చెందిన ఐటి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి, తమ రహస్యాలను రహస్యంగా చైనాకు చేరవేస్తున్నారంటూ అప్పట్లో ట్రంప్‌ ఆరోపించేవారు.ఇది పూర్తిగా అసత్యం కాకపోయినా,ఇరుదేశాల సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనా తైవాన్‌ని తమ దేశంలో కలుపుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు అమెరికా అడ్డుపడటంతో ఇరుదేశాల మధ్య సంబం ధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.అమెరికా చట్టసభల అధ్యక్షురాలు నాన్సీ పెలోసీ తైవాన్‌ని సందర్శించడం చైనాకు కంటగింపు అయింది.

- Advertisement -
   

తైవాన్‌ చుట్టూ అమెరికా సైనిక విన్యాసాలను నిర్వహించింది.తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమంటూ పదే పదేప్రకటనలు చేయడం,వాటిని తైవాన్‌ ఖండించడం,తైవాన్‌కి అమెరికా అండగా నిలవడంతో అగ్రరాజ్యం,చైనాల మధ్య దూ రం మరింత పెరిగింది.అప్పటి నుంచి చైనా అమెరికాపై ద్వేషాన్ని కక్కుతోంది.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా రష్యాకు భారీగా ఆయుధాలనూ,ఆయుధ సామగ్రని సరఫరా చేయడంతో అదే స్థాయిలో అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయి న్‌కి ఆయుధాలను,క్షిపణులను అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టడానికి ప్రధాన కారణం ఇదే. క్విన్‌ కాంగ్‌కి ముందు అమెరికాలో చైనా రాయబారిగా వ్యవహరించిన వాంగ్‌యీ చైనా విదేశాంగ విధానంలో మార్పులు తెచ్చారు.భారత్‌తోనే కాకుండా,అమెరికా తదితర దేశాలతో చైనా విధానంలో సామరస్య ధోరణిని ప్రోత్స హించారు. దాంతో ఇరుదేశాల మధ్య వాతావరణం క్రమంగా నెమ్మదించడం ప్రారంభమైంది.ఫుట్‌బాల్‌,ఇతర క్రీడల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు కావడానికి కృషి చేశారు.వాంగ్‌ యీ ఇటీవల చైనా విదేశాంగ శాఖ విధాన రూప కల్పన బాధ్యతలను చేపట్టారు.ప్రపం చంలోని వివిధ దేశాలతో చైనా సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ఆయన పలు మార్గదర్శకాలను సూచించారు.అయితే, వాటి వివరాలను వెల్లడించలేదు.గత సంవత్సరం జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో రూపొందించిన సూత్రాలకు అనుగుణంగా చైనా తన విధానాల్లో పెను మార్పులను తేనున్నట్టు తెలియ వచ్చింది. ఈ కోణంలోనే అమెరికాతో సంబంధాల మెరుగుకు చైనా కృషి చేస్తు న్నట్టు తెలుస్తోంది.వాంగ్‌ ఈ రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని నివారింపజేసి ఉండేవాడినని అనడాన్ని బట్టి ఆయన వాంగ్‌యీ చైనా విదేశాంగ విధానంలో మార్పులు తెచ్చారు. భారత్‌తోనే కాకుండా,అమెరికా తదితర దేశాలతో చైనా విధానంలో సామరస్య ధోరణిని ప్రోత్సహించారు.

దాంతో ఇరు దేశాల మధ్య వాతావరణం క్రమంగా నెమ్మదించడం ప్రారం భమైంది.ఫుట్‌బాల్‌,ఇతర క్రీడల్లో ఇరుదేశాల మధ్య సంబం ధాలు మెరుగు కావడానికి కృషి చేశారు.వాంగ్‌ యీ ఇటీవల చైనా విదేశాంగ శాఖ విధాన రూపకల్పన బాధ్యతలను చేపట్టారు. ప్రపం చంలోని వివిధ దేశాలతో చైనా సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ఆయన పలు మార్గదర్శకాలను సూచించారు.అయితే, వాటి వివరాలను వెల్లడించలేదు.గత సంవత్సరం జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో రూపొందించిన సూత్రాలకు అనుగుణంగా చైనా తన విధానాల్లో పెను మార్పులను తేనున్నట్టు తెలియవచ్చింది.ఈ కోణంలోనే అమెరికాతో సంబంధాల మెరుగుకు చైనా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.వాంగ్‌ ఈ రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని నివారింపజేసి ఉండేవాడినని అనడాన్ని బట్టి ఆయన అనుసరించబోయే విధానాలు సరళంగానూ, సామరస్యం గానూ ఉంటాయని భావించడానికి వీలు కలుగుతోంది. ప్రపం చంలో అతిపెద్దఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు మెరుగ యితే,ప్రపంచానికి మేలు జరిగే అవకాశం ఉంది.అలా జరగాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement