Saturday, April 17, 2021

నేటి సంపాద‌కీయం – మ‌య‌న్మార్ శ‌ర‌ణార్ధుల హాహాకారాలు…

మ‌యన్మార్‌ నుంచి మన భూభాగంలో ప్రవేశించే వారికి ఆశ్రయం కల్పించడం మిజోరం, మణిపూర్‌ రాష్ట్రాలకు పెను సవాల్‌గా తయారైంది. మయన్మార్‌ ప్రభు త్వం తమ పౌరులను కనిపిస్తే కాల్చివేసే రీతిలో తరిమివేస్తుండటంతో వేలాది మంది సరిహద్దు పౌరులు మన దేశంలోకి ప్రవేశించి ఆశ్రయాన్ని అర్ధిస్తున్నారు. ఈ రెండు సరిహద్దు రాష్ట్రాలూ మొదట వీరికి ఆశ్రయం కల్పించేందుకు నిరాకరిం చినా, మానవీయ కోణంలో ఆశ్రయమివ్వక తప్పడం లేదు.దీంతో మయన్మార్‌ సైనికాధికారులు మన దేశంపై గుర్రు పెంచుకుంటున్నారు.ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభమైన తిరుగుబాటు తర్వాత దేశంలో పౌరులు ఇళ్ళకే పరిమితం కావల్సి వస్తోంది. బయటకు వస్తే కాల్చివేస్తున్నారు. ఇళ్ళల్లో ఉన్నవారిని తలుపులుబద్దలు కొట్టి మరీ లాక్కుని పోతున్నారు. మయన్మార్‌ సైనికాధికారుల ఆగడాలు రోజురోజుకీ మీరుతున్నా, అంతర్జాతీ య మానవ హక్కుల సంఘాలు కానీ, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. ఇది ఆంతరంగిక సమస్యఅని సైనికాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల కనీస సౌకర్యాలను హరించడం, నిత్యావసరాల కోసం బయటకు రానివ్వకుండా చేయడం ఎంత అమానుషమో అంతర్జాతీయ సమాజం గుర్తించాలి.సైనిక పాలకుల ఆంక్షల ను ధిక్కరిస్తూ వందలాది మందిమయన్మార్‌ పౌరులు వీధుల్లోకి వచ్చి పిట్టల్లా రాలిపోతు న్నారు.ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు వారు సిద్ధ పడుతున్నా రు. ప్రజాస్వామ్యం కోసం గొంతుచించుకునే దేశాలు మయన్మార్‌ లో పరిస్థితికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి అంతర్జాతీయ హక్కుల సంఘాలు గళం ఎత్తాల్సిన సమయం ఇది. శ్రీలంకలో వేలుపిళ్ళై ప్రభాకరన్‌ నేతృత్వంలోని ఎల్‌టిటిఈ కార్యకర్తలపై ఆనాటి అధ్యక్షుడు,నేటి ప్రధాని మహిందా రాజపక్స దాడులు జరిపించినప్పు డు మానవహక్కుల కోణాన్ని ఎత్తి చూపి ఖండించిన మనదేశం ఇప్పుడు సరైన రీతిలో స్పం దించడం లేదని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు ఆరోపిస్తున్నారు.మయన్మార్‌లో దశాబ్దాల పాటు ప్రజాస్వామ్యం కోసం పోరాడి అత్యధిక కాలంలో గృహ నిర్బంధంలో గడిపిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అంగసాన్‌ సూకీ నేతృత్వంలో ఐదేళ్ళ పాటుకొనసాగిన ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు సైనికాధికారులకు అస్త్రాలయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సైనికాధికారులు రొహింగ్యా ముస్లింలపై విరుచుకుని పడినప్పుడు సూకీ ఆనాటి సైనికాధికారులకు అండగా నిలవడం వల్లనే వారంతా ఇప్పుడు రెచ్చిపోయి వ్యవ హరిస్తున్నారన్నఅభిప్రాయంలో సహేతుకత ఉంది.రొహింగ్యా ముస్లింలవిషయంలో సూకీ దృఢంగా వ్యవహ రిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనీ, మనదేశమూ,బంగ్లాదేశ్‌ వంటి ఇతరపొరుగు దేశాలూ ప్రజాస్వామ్య ఉద్యమకారులకు అండగా నిలిచి ఉండేవన్న అభిప్రాయం సరైనదే. మయన్మార్‌ పోలీసు అధికారులు సైనికాధికారుల ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నారు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న పౌరులను తమ చేతులతో చంపలేమంటూ ఒక పోలీసు అధికారి కన్నీటి పర్యంతమై, మణిపూర్‌ లో ఆశ్రయాన్ని కోరారు.తానుతిరిగి స్వదేశానికి వెళ్తే, మిలటరీ అధికారులు కాల్చిచంపుతారని ఆయన వాపోతున్నారు.ఇలాంటి అధికారులు ఎంతోమంది ఉన్నారు. మన దేశ సరిహద్దు ల్లో శరణార్థి శిబిరాలకు అనుమతి ఇవ్వొద్దని మయన్మార్‌ సైనిక పాలకులు హుకుం జారీ చేశారు.దీనిపై మన ప్రభుత్వం సీరియస్‌ గా స్పందించాల్సిఉండగా, నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంది. సాధారణ వ్యాఖ్యలతోసరిపెట్టింది. బంగ్లాదేశ్‌ యుద్ధంసమయంలో ఆనాటి పాకిస్తాన్‌ సైనిక పాలకుల కర్కశ పాలనను వ్యతిరేకించిన ప్రజాస్వామ్య ఉద్యమకారులకు ఆశ్రయంఇచ్చిన భారత్‌ ఇప్పుడు మయన్మార్‌ యోధులకు అలాంటి దన్నుఇవ్వడం లేదన్న విమర్శలు వచ్చాయి. సూకీ వంటి ప్రజాస్వామ్య ఉద్యమనేతలు చేసిన చిన్న పొరపాట్లు ఇప్పుడు యావత్‌ దేశ ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టాయి.అంతేకాకుండా సైనికాధికా రుల పట్ల సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ ఎల్‌ డి) ప్రభుత్వం మెతకగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ వారినే లక్ష్యంగా దాడులు చేయిస్తున్నారని విశ్లేషకు లు పేర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి సైతం ప్రేక్షక పాత్రకు చైనాయే కారణం.

Advertisement

తాజా వార్తలు

Prabha News