Thursday, April 18, 2024

Editorial – విదేశీ గ‌డ్డ‌పై మాట‌ల దూకుడు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు గారు ఏనాడో రాసిన గేయం ఇప్పటికీ నిత్యనూతనం. అంటే పరాయి వాళ్ళముందు, పరాయి దేశం వెళ్ళినప్పుడు మన దేశం గురించి గొప్పలు చెప్పుకోకపోయినా, ఉన్న దున్నట్టు చెప్పుకుంటే చాలునని అర్థంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలా జరుగుతోందా? వాస్తవానికి అలా జరగ డం లేదని పరిణామాలు చెబుతున్నాయి. మన దేశం గురించి పొగుడుకోనవసరంలేదు. మంచిని చెబితే చాలు, కానీ, చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నామనే ఆవేదనను అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తరచూ వ్యక్తం చేస్తుంటారు. అది సహేతుక వాదనే. పూర్వపు తరం నాయకులు తమ ప్రభుత్వాలు, లేదా పార్టీలు చేసిన మంచిని గురించే చెప్పుకునే వారు. ఇప్పు డు అంతా మారిపోయింది. ఎదుటివారిని ఎంత దూషి స్తే, నిందిస్తే అంత గొప్పవాళ్ళమనుకునే సంస్కృతి పెరిగి పోయింది. భారత దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారు మన కవులు, కళాకారులే. రాయ బారుల కన్నా వీరి వల్లే దేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఇప్పటికీ పెరుగుతున్నాయి.

అయితే, ప్రస్తుత రాజకీ యా ల్లో మార్పు వచ్చినట్టే, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు బాగా వచ్చింది. ఇంట్లో తిట్టుకున్నట్టే, బయటా తిట్టుకుంటున్నారు. పూర్వపు కవులు తమ రచనల ద్వారా భారత దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారు.విశ్వకవి రవీంద్రనాథ్‌ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నా నని అన్నారు. ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద చికాగో సర్వమత సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంటాం. ఆయన ప్రసం గంలో కొత్త విషయాలులేకపోవచ్చు. కానీ, తరతరాలు గా భారత్‌ అనుసరించి ఆచరించిన విధానాలనే ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన ప్రసంగం 125వ వార్షికోత్సవాలను ఇటీవల జరుపుకున్నాం. రాజకీయ నాయకుల్లో కూడా ఆనాటి తరం వారు కొన్ని హద్దుల నూ, సంప్రదాయాలను పాటించేవారు. వారి నోటంట ఏ మాట వెలువడినా అది దేశ ఔన్నత్యాన్నీ, ప్రతిష్టను పెంచే రీతిలో ఉండేవి. జాతిపిత మహాత్మాగాంధీ మహాత్ముల ప్రసంగాలను క్రోడీకరిస్తూ భారత్‌ ప్రతిష్టను నలుదిశలా వ్యాపింపజేసేవారు. ఇప్పటి రాజకీయ నాయ కులు దేశంలో విమర్శించుకుంటున్నట్టే, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా తమ ఆక్రోశాలను వెళ్ళగ క్కుకుంటున్నారు.ఆవేశకావేశాలను ప్రదర్శిస్తున్నారు.

దీని వల్ల దేశ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. విదేశాల్లో పర్యటించినప్పుడల్లా ప్రవాస భారతీయుల సమావేశా ల్లో ప్రసంగించడం ప్రధాని నరేంద్రమోడీకి అలవాటు. ఆయన ప్రసంగాల్లో సోత్కర్ష ఎక్కువగా కనిపించవచ్చు. తమ ప్రభుత్వ కార్యక్రమాలను గురించి ఘనంగా చెప్పుకుంటూనే ప్ర త్యర్థులపై విసుర్లు విసర డాన్ని కూడా చూస్తున్నాం. రాసుకొచ్చిన ప్రసంగాలను కాకుండా, ఆశువుగా మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో పరిధి దాటడం సర్వసాధారణమే. ప్రతిపక్షాల గురించి అలా మాట్లాడవచ్చా? అవమానించవచ్చా అనే సద్విమర్శ చేసుకునే అవకాశం ఉండదు. ఆయనను చూసి ఇప్పుడు కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కూడా ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మోడీ ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించినప్పుడు తన వారిని చూడగానే అభిమానం ఉప్పొంగడంతో మనసు లో మాట చెప్పుకుంటున్నారేమోనని అనుకోవడానికి వీలుంది.

- Advertisement -

కానీ,రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్న వేదికలన్నీ విదేశీ విద్యాలయాల విద్యార్థుల సమావేశాలే. అంటే వారిలో ప్రవాస భారతీయులతో పాటు విదేశీ విద్యార్థు లు కూడాఉండవచ్చు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న దృష్ట్యా, అమెరికా విదేశాంగ శాఖ, అమెరిక న్‌ కాంగ్రెస్‌ సభ్యులు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకు ని లేదా ఉదహరిస్తూ భారత్‌లో ముస్లింల పరిస్థితిపై వ్యాఖ్య చేసి ఉండవచ్చు. కానీ, మరి ఏ దేశంలోనూ లేనంత స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను భారత్‌లో ముస్లింలు అనుభవిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం రాహుల్‌కి సైతం తెలిసి ఉండవచ్చు. కానీ, అక్కడి వ్యాఖ్య లకు అక్కడే సమాధానం చెప్పాలన్న ఉద్దేశ్యంలో ఆయన ముస్లింల గురించి ప్రస్తావన చేసి ఉండవచ్చు. భారత్‌లో పూర్వపు పాలకుల హయాంలో ఉన్న లౌకిక భావజాలం క్రమంగా సన్నగిలుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాహుల్‌ కూడా అదే విషయాన్ని ప్రస్తావించి ఉండ వచ్చు. ఏమైనా, భారత్‌ లౌకిక స్వరూపం ఎప్పటి కీ చెక్కు చెదరదు. అది మన రాజ్యాంగ రచయితల పుణ్యమే.! దేశంలో వివిధ సందర్భాల్లో నాయకుల నోట వింటున్న మాటలే విదేశీ గడ్డపై వినవలసి రావడం దురదృష్టకరం. అయితే వారికి ఉద్దేశాలను ఆపాదించకుండా అలవాటు ప్రకారం వారి నోటంట వచ్చిన మాటలు గానే పరిగణిం చాలి. నిప్పును తాకితే అది కాలుతుంది. అలాగే నోరు జారితే ప్రమాదం చాలా ఉంటుందన్న విషయం ఉన్నత పదవుల్లో ఉన్నవారు తెలుసుకోవడం అత్యవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement