Friday, March 29, 2024

చైనా… మారని బుద్ధి!

హిందీ-చైనీ భాయి భాయి అనే నినాదంతో తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూని నమ్మించిన ఆనాటి చైనా ప్రధాని చౌఎన్‌లై తర్వాత చైనాలో అధికారాన్ని చేపట్టిన నాయకులు ఎవరూ ఆనాటి ఒప్పందాలకు కట్టుబడలేదు. పొరుగుదేశంతో భారత్‌ మొదటి నుంచి శాంతిని కోరుతున్నది, ఇందులో భాగంగానే పంచశీల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చిత్తశుద్ధితో అమలుజేస్తోంది. పరస్పరం దురాక్రమణలకు పాల్పడకపోవడం, దేశాల ప్రాదేశిక సమగ్రత పట్ల అవగాహన కలిగి ఉండటం, ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటు పడటం, సమానత్వం, పరస్పర గౌరవంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పంచశీల సిద్ధాంతాల్లోని ముఖ్యాంశాలు. పండిట్‌ నెహ్రూ 1954లో ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలకు చైనా ఆమోదం తెలిపినప్పటికీ, ఇంతవరకూ ఒక్క అంశంలో కూడా చైనా తన నిజాయితీ, నిబద్దతను రుజువు చేసు కోలేదు. పైగా1962లో దురాక్రమణకు పాల్పడింది. అయినప్పటికీ, పొరుగు దేశంతో శాశ్వతంగా ఉద్రిక్తత మంచిది కాదన్న ఉద్దేశ్యంతో భారత్‌ పలు ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఏ ఒక్కదానినీ చైనా ఖాతరు చేయ లేదు.

తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో తావాంగ్‌ ప్రాంతం లోకి చైనీస్‌ సేనలు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించగా, మన సైన్యం తిప్పికొట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలో సైనికులు గాయపడటం తప్ప పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. ఈ చొరబాట్లపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. అరుణాచల్‌ ముఖ్యమంత్రి ఖండుఫెమా కూడా ఇది 1962 కాదని గుర్తుంచుకోవాలంటూ చైనాని హెచ్చరించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌పై తన హక్కును నిరూపించుకోలేకపోయిన చైనా ఈ మాదిరి దూకుడును ప్రదర్శించడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రాదేశిక హక్కులను కాపాడుకునేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా చైనాతో భారత్‌ శాంతినే కోరుకుంటోందనీ, అదే సందర్భంలో సమయం వచ్చినప్పుడు తన సత్తాని చూపేందుకు వెను కాడదని స్పష్టంచేశారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ విన్‌బిన్‌ తాజా పరిస్థితికి భారత సైనికులదే తప్పం టూ అడ్డగోలుగా వాదించారు. అయితే, సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగానే ఉందనీ, దౌత్య పరమైన సంప్రదింపు లకు తమ దేశం సిద్ధమేనని అన్నారు. అయితే, అరుణా చల్‌ ప్రదేశ్‌ని తమ భూభాగంగా చైనా సమయం వచ్చిన ప్పుడల్లా స్పష్ట ం చేస్తోంది.

అరుణాచ ల్‌ ప్రదేశ్‌లోని కొన్ని భాగాలను చైనాలో అంతర్భాగంగా ప్రకటించుకోవడమే కాకుండా, అక్కడ శాశ్వత ప్రాతిపదికపై నిర్మాణాలు సాగి స్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌నే చైనా ఎందుకు ఎంచుకుం దంటే, అది బాగా అభివృద్ది చెందిన ప్రాంతం, జనావాసా లకు అనువైన ప్రాంతం. పైగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తెగలతో ఆవలి వైపున చైనా తెగలకు చాలా కాలంగా సం బంధాలున్నాయి. ఇవి చాలా కాలంగా సాగుతున్నా, ఇరుదేశాలూ పెద్దగా పట్టించుకో లేదు. పైగా, సంస్కృతి, ఆహార్యం, జీవన విధానంలో పోలికలు ఉండటం వల్ల ఎవరు చైనీయులో, ఎవరు అరుణాచల్‌ వాసులో పోల్చ డం చాలా కష్టం కావడంతో సరిహద్దు దళాలు కూడా పసిగట్టలేకపోయాయి. సైన్యం కన్నుగప్పి స్థానికులు రాకపోకలు సాగించడం మామూలే. అంతేకాకుండా సహజవనరుల వినియోగంలో కూడా ఇరుగుపొరుగు ప్రాంతాల మధ్య సదవగాహన ఉంది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ ఆవలి వైపున చైనా చిన్న వంతెనలు, రహదా రులు సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. అరుణాచల్‌ వాసులను ఆకర్షించేందుకు పలు కార్యక్ర మాలను చేపట్టింది. దీనినాధారంగా చేసుకుని అరుణా చల్‌ ప్రదేశ్‌ తమ దేశంలో అంత ర్భాగమని వాదించడం మొదలు పెట్టింది. టిబెటెన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ధర్మశాలలో తలదాచుకోవడం చైనీస్‌ పాలకు లకు కంట్లో నలుసుగా ఉంది.

ఆయన తరచూ చై నీస్‌ నాయకులపై చేసే వ్యాఖ్యలను వారు జీర్ణించుకోలేకపోతు న్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఆయన ప్రవేశాన్ని నిషే ధించారు. అంతేకాదు. భారత రక్షణ మంత్రి, ఇతర నాయకులు అరుణాచల్‌లో పర్యటించరాదంటూ ఆంక్ష లు విధించారు. దీనిని మన దేశం పలు సందర్భాల్లో, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఖండించింది, అరు ణాచల్‌లో నిర్మాణాలకు సైతం చైనా దుస్సాహసాలకు ఒడిగట్టింది. దీనిపై గట్టిగా నిలదీస్తే అవి శాశ్వత నిర్మాణా లు కావనీ, ప్రజలు వేసుకున్న గుడారాలని నమ్మబలి కింది. మన సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చైనీస్‌ సైనికుల కదలికలను గమనిస్తూనే ఉన్నారు. పీపు ల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఏ) జవాన్లు ఏ మాత్రం చొర బడినా మన సైనికులు తరిమి కొడుతున్నారు. దౌత్య సం బంధాలను కొనసాగించేందుకు సిద్ధమేనంటూ ఈ మాదిరి కవ్వింపు చర్యలకు పాల్పడటం చైనా దుర్మార్గాని కి నిదర్శనం. చైనా 2014 నుంచి ఇంతవరకూ 1025 సార్లు చొరబాట్లకు యత్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement