Thursday, April 25, 2024

ఎడిటోరియ‌ల్ – క‌రోనా మ‌ర‌ణాల‌పై చైనా గోప్య‌త‌

చైనాలో నిరవధిక లాక్‌డౌన్‌లు ఎత్తేసిన తర్వాత రోజూ కరోనా కేసులు లక్షల్లో, మరణాలు వేలల్లో నమోదు అవుతున్నాయి. దీంతో చైనాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న వారు ఏదో ఒక కారణం చెప్పి, అక్కడి నుంచి తప్పుకుంటున్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చన్న చందంగా ఎంతోమంది ఉద్యోగులు కూడా చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. జనాభా విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న చైనా ఇప్పుడు రెండో స్థానానికి దిగజారింది. మొదటి స్థానాన్ని భారత్‌ ఆక్రమించింది. చైనా ఆర్థికంగా, వాణిజ్యపరంగా ప్రపంచంలో అగ్రరాజ్య స్థానాన్ని సాధించేందుకు సాగి స్తున్న యత్నాలన్నీ కరోనా వల్ల విఫలమవుతున్నాయి. దాంతో చైనా ప్రభుత్వం కరోనాపై నియంత్రణకు మరో మార్గాన్ని ఎంచుకుంది. మరణాలను ఆపలకపోతుండ టంతో బీజింగ్‌ ప్రభుత్వానికి ఒక చక్కని ఆలోచన వచ్చిం ది. మరణించిన ప్రతివారూ కరోనావల్ల అంటూ నివేదిక లు తయారు చేయవద్దని వైద్యులను ఆదేశించడం మొద లు పెట్టింది. అది అధికారుల చేతుల్లో ఉన్న పనే కనుక, వెంటనే ఆదేశాలు జారీ చేసేశారు.

అయితే, ప్రభుత్వం ఎంత దాద్దామనుకున్నా, దాగని నిజం కరోనా మరణం. కరోనా వల్ల గత నెలారంభం నుంచి చైనాలో 60 వేల మంది పైగా మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వ్యక్తులకు సహజంగా ఉన్న రోగ లక్షణాలను మాత్రమే వారి మరణాలకు కారణాలుగా చూపాలని కరోనా మాట ప్రస్తావించరాదంటూ ప్రభు త్వం వైద్యులను ఆదేశించింది. చైనాలో వైద్యులకు స్వేచ్ఛ లేదు. వారు రాసిచ్చే ప్రిస్కిప్షన్లకు విలువలేదు. వైద్యుల రాసిన చీటీల ప్రకారం మందులు ఇవ్వాలి. కానీ, మెడికల్‌ దుకాణాల వారు అలా ఇవ్వడం లేదు. మందులు లేవనో, లేక తెప్పించాల్సి ఉందనో ఏదో ఒక కారణం చెబుతున్నా రు. వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నా, కరోనా బారిన పడిన వారు కుదుటపడటం లేదు. కరోనా వచ్చిందంటే జీవితంపై చాలామంది ఆశ వదులుకుంటున్నారు. ఇటు వంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని చైనాలో అన్ని వర్గాల వారూ వాపోతున్నారు. శ్వాస కోస వైఫల్యం జరిగి నట్టు మరణ ధ్రువీకరణ పత్రాల్లో రాయొద్దని వైద్యులను ఆదేశిస్తున్నారు.

కరోనా రోగి మృతికి న్యుమోనియా కార ణమైతే దానిని వైద్యులు వైద్యులు రెండు అంచెలలో నిర్ధా రించాలన్న ఆదేశాలు కూడా వచ్చాయి. చైనాలో కార్మిక నియంత్రణ మాదిరిగానే వైద్యుల నియంత్రణ కూడా అమలులో ఉందని ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తోంది. మరణాల రేటు పెరుగుతుంటే, మరోవంక జననాల రేటు తగ్గడం పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. తొలి దశలో ఒక ఇంటికి ఒక్క సంతానం విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం కావడంతో ఒక ఇంటికి ఇద్దరు పిల్లలుండవచ్చనంటూ నిబంధనలను సడలించింది. అయితే, ఎంతో కాలంగా ఒకే సంతానం విధానానికి అలవాటుపడిన కుటుంబాలు ఇద్దరు పిల్లల నినాదానికి సానుకూలంగా స్పందించడం లేదన్న వార్తలు వచ్చా యి. తాజాగా కరోనా ప్రభావం వల్ల జనాభా తరిగిపోతోం దన్న ఆందోళన ప్రభుత్వాధినేతల్లో కలుగుతోంది.

2021- 2022 చివరి నాటికి తమ దేశంలో జనాభా 8 లక్షలు తగ్గినట్టు చైనాలోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటస్టి క్స్‌ తెలిపింది. కరోనా వచ్చిన తర్వాత జననాలకన్నా మరణాల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా ఆ సంస్థ తెలి యజేసింది. చైనాలో ప్రభుత్వం అనుసరిస్తున్న నియంత్ర ణ విధానం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతోం దన్న వాస్తవాన్ని పాలకులు గ్రహించారు. అంతేకాక, జనాభా విషయంలో భారత్‌ ప్రథమ స్థానాన్ని ఆక్రమించ వచ్చునంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు చైనాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2050 నాటికి భారత్‌ జనాభా 161 కోట్లకు చేరుకుంటుందనీ, అదే సమయం లో చైనా జనాభా 130 కోట్లకు తగ్గవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులోనూ వృద్ధుల సంఖ్య చైనాలో బాగా పెరిగి, భారత్‌లో యువతరం బాగా పెరగ వచ్చన్న విషయం చైనాను మరింత ఆందోళనకు గురి చేసింది.

- Advertisement -

భారత్‌ భవిష్యత్‌ అంతా యువతరానిదేనని అల నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీ కూడా యువ తరం దేశ భవిష్యత్‌ను తమ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగాలని పదే పదే సూచిస్తున్నారు. సైనిక, శాస్త్ర, విజ్ఞాన రంగాలలో యువతరం ప్రాతినిధ్యం పెరిగితే భారత్‌కి తిరుగుండదు, ఉక్కు కండరాల యువ తరం భారత్‌కి పెట్టని కోట వంటి ఆస్తి అని స్వామి వివేకా నంద ఏనాడో స్పష్టం చేశారు. భారత్‌ ముందున్న బంగా రు భవిష్యత్‌ ఒక్క చైనానే కాకుండా అగ్రరాజ్యమైన అమెరికాను కూడా కలవరపరుస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత యువతరంగం అమెరికాని ఊపేస్తోం ది. భారత్‌ వివిధ రంగాల్లో ముందుకు దూసుకుని పోతోంది. ఈ తరుణంలో తమ దేశంలోని లోపాలను రొష్టు చేసుకోవడం చైనా అధినేతలకు ఇష్టం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement