Thursday, December 8, 2022

బ్రిటన్‌ వీసాలు… తీపి కబురు

బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ మన ప్రధాని నరేంద్ర మోడీని ఇండోనేషియాలోని బాలీలో కలుసు కున్న ప్పుడు తీపి కబురు చెప్పారు. ఆయన మోడీతో సమా వేశం కానున్నారన్న వార్త రాగానే బ్రిటన్‌తో మన సం బంధాలు మెరుగవుతాయని ఆశించినట్టుగానే తొలి సమావేశంలోనే ఇరువురు ప్రధానులు ఉభయతా రకమైన రీతిలో చర్చలు జరిపారు. భారతీయ యు వకులు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకె)లో చదువుకు నేందుకు లేదా పరిశోధనలు చేసుకునేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఏటా 3000 వీసాలను మంజూరు చేయడానికి సునాక్‌ అంగీకరించడం చాలా గొప్ప విషయమే. స్వాతంత్య్రానికి పూర్వమే మనదేశం నుంచి అనేక మంది బారిష్టర్‌ చదువుకోసం, మెడిసిన్‌లో పరిశోధనల కోసం లండన్‌ వెళ్ళిన దాఖలాలున్నాయి. ఆనాడు తెల్లదొరలు తమ అవ సరాల కోసం మానవ వనరుల అభివృద్ధిలో భారతీ యులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బ్రిటన్‌ నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా ఇతర వృత్తుల్లో ఉన్న వారిని భారత్‌కి రప్పించి తొలిదశలో ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే, వారికి ఎక్కువ జీతాలు, భత్యాలు ఇవ్వాల్సి రావడం భారం అవుతుండేది. అందువల్ల భారతీయుల్లో మెరి కల్లాంటి వారికి కొద్ది పాటి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇక్కడి వారినే ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేయవచ్చన్న ఆలోచన బ్రిటిషు ప్రభుత్వానికి వచ్చింది. తద్వారా ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని ఆలోచించింది.

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారిలో తెలుగువారూ ఉన్నారు. భార తీయ నిపుణులు ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నారు. రుషి సునాక్‌ భారత సంతతికి చెందినవారు కావడం వల్ల సహజంగానే భారతీయ వృత్తి విద్యా నిపుణులను ప్రోత్సహించాలని తలపోసి ఉండవచ్చు. దానికి తగ్గట్టు ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్న భారతీయ విద్యార్ధులు ఇప్పుడు అక్కడ వీసాలను సంపాదిం చడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో అనేకమంది భారతీయ నిపుణులు స్వదేశం వచ్చేశారు. వారు తిరిగి వెళ్ళడానికి అమెరికన్‌ ప్రభుత్వం అనేక ఆంక్షలను విధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, వ్యయం విషయంలో కూడా అమెరికాతో పోలిస్తే బ్రిటన్‌లో వీసాలు సంపాదించడం తేలికే. బ్రిటన్‌లో స్థానికులు వృత్తివిద్యా కోర్సుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం లేదని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల భారతీయ విద్యార్ధులకు ఇదొక సదవకాశంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా సహా, బ్రిటన్‌ పర్యటనల సందర్భంగా ప్రవాస భారతీయులు అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందించారు. భారతీయులు కష్టసహిష్ణుతకు, అంకిత భావానికీ పేరెన్నికగన్న వారని ఇప్పటికే మంచిపేరు సంపాదించుకున్నారు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత బ్రిటన్‌లో విద్య, వైద్య, ఇంజనీరింగ్‌ రంగాల్లో నిపుణుల సంఖ్య బాగా తగ్గింది. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌ నుంచి ఎక్కువ మందిని రిక్రూట్‌ చేసుకుని తమ దేశంలో అవసరాలకు వినియోగించుకుంది.

- Advertisement -
   

అలాగే, వ్యాపారాలు, పరిశ్రమల్లో కూడా భారతీయులను ప్రోత్సహించింది. యూకె జనాభాలో భారతీయులు 2.11 శాతం ఉన్నారు. భారతీయుల మేధాసంపత్తిని ఎక్కువగా వినియోగించుకుంటున్న దేశాల్లో బ్రిటన్‌ మొదటిది. బ్రిటన్‌ జీడీపీ పెరుగుదల వెనుక అక్కడ స్థిరపడిన భారతీయుల శక్తి, సామర్థ్యాలు, మేధస్సు ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. బ్రిటన్‌కి వలస వచ్చిన వారిలో విద్య, సాంకేతిక రంగాల్లో ప్రతిభకల వారిలో అధిక సంఖ్యాకులు భారతీయులే. అయితే, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఇటీవల కాలంలో భారతీయులు పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ పోటీ వల్ల భారతీయులు ఆస్ట్రేలియా తదితర దేశాల్లో అవకాశాలను వెదుక్కుంటున్నారు. దాంతో వృత్తి విద్యా నైపుణ్యం గల వారిలో నమ్మకస్తులు కరవయ్యారు. భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా అక్కడి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తూ నమ్మకంగా ఉంటారనే ప్రతీతి. ముఖ్యంగా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నిర్వహించేవారిలో నమ్మకస్తులు లేకపోవడంతో అన్ని దేశాలూ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా పని చేసి ఎక్కువ అనుభవాన్ని సంపాదించిన సునాక్‌కి ఈ విషయం తెలియంది కాదు. అందుకే, భారతీయులను ప్రోత్సహించేందుకు వీసాల సంఖ్యను పెంచేందుకు అంగీకరించినట్టుగా భావించవచ్చు. సునాక్‌ కూడా ప్రవాస భారతీయుడే. ఆయన కూడా అక్కడ రాజకీయాల్లో తన ప్రతిభతోపాటు నమ్మకాన్ని రుజువు చేసుకోవడం ద్వారా అంచలంచెలుగా పైకి వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందం వీలైనంత త్వరలో కార్యరూపం దాల్చేందుకు ఆయన పదవిని చేపట్టిననాటి నుంచి కృషి చేస్తున్నారు. అది ఫలిస్తే బ్రిటన్‌తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement