Monday, November 29, 2021

బీసీలలో అక్షర కాంతులు

కాలం జ్యోతిభాపూలే కన్న కలల్ని బ#హుజన వెలుగు పూలతోటలుగా ఎప్పుడు పూయిస్తుందని తెలంగాణ ఎదురుచూసింది నిజం. మలిదశ తెలంగా ణ అస్తిత్వ ఉద్యమం మళ్ళీ ఆ తర్వాత ఆలోచనలకు ఊపిరి పోసినట్లుయ్యింది. బిక్కుబిక్కుమంటూ రాత్రుల్లో వెన్నెల కూడా చూడలేని దశలో ఉన్న ఉత్తర తెలంగాణ అంతా ఒక్కసారిగా స్వేచ్ఛగా గాలిపీల్చిం ది. మలిదశ తెలంగాణ అస్తిత్వ రాజకీయ పోరాటానికి కేసీఆర్‌ శంఖారావం ఊదాక తెలంగాణను ఆవరించి న నిర్బంధనీడలు పోయాయి. కేసీఆర్‌ పిలుపు మేర కు తెలంగాణ అంతా కదలిపోతుంటే ప్రగతిశీల శక్తుల న్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఉద్యమంలోకి దూకాయి. అన్నింటా వోడిన తెలంగాణను కేసీఆర్‌ ఉద్యమంలో గెలిపించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత అదే ఉద్యమదారుల్లో తెలంగాణను ఆయనే తిరిగి పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగుతు న్నారు. ఆ పునార్మిర్మాణంలో బ#హుజనుల జీవితాల ను పకడ్బందీగా నిలబట్టే పనులు చేపాట్టారు. ఇలా ఇంతకు ముందు ఏ పాలకుడు చేయలేదు. బ#హుజను ల అన్నిరకాల అస్తిత్వాలను నిలిపి సమాజంలో సగభాగమైన బీసీలను స్వతంత్రంగా నిలబెట్టే పను లు మొదలయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీ వర్గాల పిల్లల చదువుకు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యాలయ్యలను విస్తృత పరిచే పనులు కేసీఆర్‌ చేపట్టారు. సరిగ్గా పూలే కన్న కలలు ఈ విద్యాలయాల ద్వారా విస్తరిస్తున్నాయి. ఇంతకు ముందే దేశంలో దళిత బ#హుజనుల రాజ్యాలు, సైద్ధాంతికంగా పూలే ఆలోచనలతో అధికార పీఠాల ను అధిరో#హంచిన రాష్ట్రాలలో కూడా జరగని విధం గా తెలంగాణలో కేసీఆర్‌ బీసీ గురుకులాలను అత్యధి క సంఖ్యలో పెట్టి వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఇది బీసీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే పెద్దపని. ఇది బీసీ సూర్యోదయలకు పునాదిగా నిలుస్తుంది. ఇది ఉత్పత్తి శక్తులకు ఆధునిక విజ్ఞానశక్తి నందించినట్ల య్యింది. పూలే మహాత్ముడిగా చేసిన ఆలోచనలను కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో ఆచరణాత్మకంగా బీసీ గురుకుల విద్యావ్యవస్థను శక్తివంతంగా ప్రతిష్ఠిం చారు. ఈ గురుకులాలు కార్పోరేట్‌ విద్యాసంస్థలను తలదన్నే విద్యాకేంద్రాలుగా విరజిల్లుతున్నాయి. అవును, ఇది స్పష్టంగా కేసీఆర్‌ దార్శనిక ఆలోచనల ముద్రగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీన్నెవరూ కాదనలేరు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశా లు ఎక్కడకు వెళ్లినా మీ తెలంగాణ గొప్పతనం, ప్రత్యేకత ఏమిటని అడిగితే మా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన అత్యంత శక్తివంత మైన వేయి గురుకుల పాఠశాలలున్నాయని ప్రతి తెలంగాణవాసీ గర్వంగా చెప్పుకోవచ్చు. మహాత్మా జ్యోతిబాపూలే ఆలోచనల విస్తృతికి ఈ గురుకుల విద్యా వ్యవస్థ ప్రతీకగా నిలుస్తుంది. బీసీ గురుకుల విద్యావ్యవస్థను పరిశీలిస్తే తెలంగాణ రాక ముందు కేవలం 19 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మాత్రమే ఉండేవి. అది 2017 నాటికి 119 అయ్యాయి.
2021 నాటికి 142 అయ్యాయి. రాష్ట్రం రాక ముందు ఒక్క బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ లేదు. 2016-17 నాటికి అవి 19 జూనియర్‌ కాలేజీల య్యాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఒక బీసీ మ#హళా డిగ్రీ కాలేజీ ఉంది. దీంతో మొత్తం బీసీ గురుకుల విద్యాలయాల సంఖ్య 28కి చేరింది. ఇవన్నీ మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యాషన్స్‌ సొసైటీ వ్యవస్థ కిందే ఈ 28 విద్యాసంస్థలు నిర్వ#హం చబడుతున్నాయి. ఈ మొత్తం 261 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 1,15,760 మంది విద్యార్థులు, 138 జూనియర్‌ కాలేజీల్లో 15,600 మంది, ఒక మ#హళా రెసిడెన్షిల్‌ డిగ్రీ కాలేజీలో 1,080 మంది విద్యార్థిను లు మొత్తంగా 1,32,440 మంది బీసీ విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. అంటే 1,32,440 బీసీ కుటుంబాల నుంచి వచ్చినవారు ఇందులో ఉన్నారు. ఇవి మామూలు విద్యాసంస్థలు కావు. అత్యంత ప్రతిభావంతమైనవి. ఐదవ తరగతి పరీక్షల ఫలితాలు స్టేట్‌ యావరేజ్‌ కంటే బీసీ గురుకులాల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. 2014లో పదవ తరగతిలో రాష్ట్ర సగటు ఫలితాలు 88.62 శాతం ఉంటే, బీసీ గురుకులాలు 99.70 శాతం, అదేవిధంగా 2015లో రాష్ట్ర సగటు 85.63 శాతం అయితే ఈ సంస్థలవి 96 శాతం, 2017లో 84.15 శాతం అయితే ఈ సంస్థలవి 94.62 శాతం, 2018లో రాష్ట్ర సగటు 83.78 శాతం అయితే ఈ సంస్థలవి 96. 25 శాతం, 2019లో రాష్ట్ర సగటు 92.43 అయితే ఈ సంస్థవి 98.78 శాతంగా ఫలితాలలో వచ్చాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర సగటు ఫలితాలను చూస్తే 2016లో 98 శాతం 2017లో 93 శాతం, 2018లో 85 శాతం, 2019లో 90.20 శాతం, 2020లో 91.77 శాతం అత్యధిక ఫలితాలు బీసీ గురుకుల విద్యా సంస్థలదే. ఒక్కమాటలో చెప్పాలంటే పదవతరగతి, ఇంటర్‌లో రాష్ట్ర ర్యాంకులన్నీ బీసీ గురుకుల విద్యాల యాలవే. ఇంతకంటే ఏంకావాలి. ఈ విద్యాసంస్థ నిర్వ#హణకు 2020-21 విద్యాసంవత్సరానికి గాను 545 కోట్లను కేటాయించటం జరిగింది. ఈ గురుకుల విద్యాలయల్లో టీచింగ్‌ స్టాఫ్‌ 6,045 మంది ఉండగా, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 3,658 మంది ఉన్నారు. ఈ విద్యాసంస్థల్లో బీసీ (ఏ) గ్రూపునకు 18 శాతం, బీసీ (బి) గ్రూపునకు 26 శాతం, బీసీ (సీ) గ్రూపునకు 3 శాతం, బీసీ (డి) గ్రూపునకు 18 శాతం, బీసీ (ఈ) గ్రూపునకు 10 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎన్టిdలకు 5 శాతం, ఈబీసీలకు 2 శాతం, అనాథ పిల్లలకు 3 శాతం రిజర్వేషన్ల ద్వారా సీట్లకు ఎంపిక చేస్తారు. ఈ విద్యార్థుల హాస్టల్‌కు విశాలభవనాలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఆంగ్ల భాషలో బోధన, రాష్ట్ర స్థాయి క్రీడోత్సావాలు, సా#హత్య సాంస్కృతిక కార్యక్రమా లు, డిజిటల్‌ తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మూడు జతల బట్టలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు ఒక జత తెల్ల, రెండు జతల నల్ల బూట్లు ఇస్తారు. దుస్తులు కుట్టిస్తారు. యూనిఫాం, బెడ్డింగ్‌ మెటీరియల్‌, నోట్‌ బుక్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌ ఇస్తారు. సమ్మర్‌ క్యాంపులు నిర్వ#హస్తారు.
పిల్లలకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం ఉంటుంది. పిల్లలకు శుచికరమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన మంచి భోజనాన్ని అందిస్తారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కోడి, మేకమాసం, వెజిటేరియన్‌ భోజనం, ప్రతి రోజు కోడిగుడ్డు, పొద్దున్నే టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తా రు. బాత్‌ రూమ్‌లు, టాయెలేట్లు శుభ్రంగా ఉంచుతా రు. క్రీడలు కళలు, సా#హత్యంపై పిల్లల్లో ఉన్న మక్కువను చూసి వాళ్ల ప్రతిభను మెరుగు పరుస్తు న్నారు. ఇది చాలా పెద్దకృషి. బీసీల జీవితాల బాగు కోసం కేసీఆర్‌ ఆలోచనా విధానాలు, కేసీఆరిజంను ఆచరణాత్మకంగా అమలు జరుపటానికి బీసీ సంక్షేమ శాఖ కృషి చేస్తున్నది. బీసీ గురుకుల విద్యాలయాలు తెలంగాణ సమాజంలో ఎన్నెన్నో మార్పులకు కారణ భూతం కాబోతున్నాయి. రేపటి తెలంగాణ సమాజా న్ని మరింత పటిష్టం చేసేందుకు కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో అత్యంత శక్తివంతమైన బ#హుజన మానవ సంపదను సృష్టిస్తున్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు దేశ వ్యాపితంగా పెట్టిన నవోదయ విద్యావ్యవస్థ కంటే తెలంగాణలో కేసీఆర్‌ ప్రారంభించిన గురుకు ల విద్యాలయ వ్యవస్థ చాలా పెద్దది. తెలంగా ణ బ#హుజన సమాజం #హృదయం లో కేసీఆర్‌ చెక్కుచెదరని రూపం గా చిరస్థాయిగా ఉండిపోతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News