Friday, April 19, 2024

నేటి సంపాద‌కీయం – ఇరు వర్గాల‌లో మార్పు రావాలి ….

క‌న్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేది ఆటవిక న్యాయం. దాదాపు ఆరు దశాబ్దాలుగా అడవుల్లో ఉంటున్న నక్సలైట్లు ఇప్పటికీ ఇదే న్యాయాన్ని పాటిస్తుండటం దుర దృష్టకరం. అలాగే, భద్రతాదళాలు కూడా నక్సలైట్లను అంతమొందిస్తే ఆ సిద్ధాం తాన్ని అణచివేయగలమని అనుకుంటున్నాయే కానీ, హింసకు, ప్రతి హింస సమాధానం కాదన్నవిషయాన్ని నక్సలైట్లూ, భద్రతాదళాలూ గ్రహించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో గెరిల్లా పోరాటాలకు తావు లేదన్నవాస్తవాన్ని తీవ్ర వాదులు గ్రహించడంఎంతైనా అవసరం. తమ పోరాట లక్ష్యాలను ప్రజలకు వివరించి వారి మద్దతుపొందాలే తప్ప హింసతో సాధించేది ఏమీలేదని ఇప్పటికైనా వారు గ్రహించడం ఎంతైనా అవసరం. చత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఎత్తయిన కొండలపై నుంచి భద్రతాదళాలపై జరిపినకాల్పుల్లో 22 మందిమరణించిన సంఘటనతోయావత్‌ దేశం ఉలిక్కి పడింది. చత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌, సుక్మా జిల్లాల్లోనూ, వాటి సరిద్దున ఉన్న ప్రాంతాల్లోనూ దాడులు జరపడం కొత్త కాదు. అయితే, ఈసారి మరింత పకడ్బందీగా వ్యూహం పన్నిదానిని అమలుజేశారు. ఈ మొత్తం ఆపరేషన్‌ అంతా మావోయిస్టు పీపుల్స్‌ ఆర్మీ కమాండర్‌ హిడ్మా ఆధ్వర్యంలో జరిగింది. హిడ్మా కదలికలపై భద్రతాదళాలకు పదిరోజుల క్రితమే సమాచారం అందింది. అతడినీ, ఇతర నక్సల్స్‌ని గాలించేందుకు రెండువేల మందితో పోలీసులు గాలింపు ప్రారంభించారు. నాలుగు వందల మంది ఉన్న నక్సలైట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించి భద్రతాదళాలకు భారీ నష్టం కలిగిం చారు. ముందు ఐదుగురు మాత్రమే మర ణించారన్న భద్రతాదళాలు ఆ తర్వాత గల్లంతయి న మరో17 మంది కూడా మరణించినట్టు గుర్తించారు. వీరంతా కోబ్రా దళానికి చెందిన వారని చెబుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టుల కదలిక లపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా సమాచారం అందడం వల్లనే 2వేల మందితో ఆప్రాంతా న్ని ముట్టడించారు. అయితే, నక్సలైట్లు భద్రతాదళాల కన్నాఆధునికమైన ఆయుధాలనూ, కమ్యూునికేషన్‌ సామగ్రిని వినియోగించినట్టు ఉన్నతాధికారులు కనుగొన్నారు. తెలంగా ణా సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉండటంవల్ల ఇక్కడ కూడా భద్రతాదళాలు అప్రమత్తమ య్యాయి. మావోయిస్టులు ఈమధ్య కాలంలో ఇంత పెద్దఎత్తునదాడికి తెగబడలేదు. అక్కడక్కడ ప్రజాప్రతినిధులను ఎత్తుకుని పోయి దండించడం,విడిచిపెట్టడం జరిగింది కానీ, ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టానికి పాల్పడటంఇదే మొదటిసారి. నక్సలైట్లులో ఎక్కువ మంది బలహీనవర్గాలకు చెందినవారున్నట్టే, పోలీసు ప్రత్యేకదళాల్లో కూడా ఎక్కువమంది బలహీనవర్గాలే. నక్సలైట్‌ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఇటు ఎదురు కాల్పుల్లో, అటు నక్సల్స్‌ కాల్పుల్లో బలి అవుతున్నది బలహీనులే. ఈ విషయాన్ని ఎన్ని సార్లు గుర్తెరిగేట్లు చేసినా నక్సలైట్లలో మార్పు రావడం లేదు. ప్రతిసారి వారి లక్ష్యాలు గురి తప్పడం వల్లనే ఇలా జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతు న్న తరుణంలో భారీగా భద్రతాదళాలను తరలించాల్సి వచ్చింది. ఈ సమయాన్ని అదును గా తీసుకుని నక్సలైట్లు దాడి జరిపారు. గత నెలలో నారాయణ్‌పూర్‌ జిల్లాలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు ఐదుగురు జవాన్లు మరణించారు. అడవుల్లో విలువైన ఖనిజాల గనులను బహుళజాతి సంస్థలకు లీజుకి ఇవ్వడాన్నినక్సలైట్లు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకుంటామని ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి న కొత్తలో ప్రకటించారు. కానీ, యూపీఏ ప్రభుత్వం హయాంలో అమలుజరిగిన విధానమే ఇప్పటికీ కొనసాగుతోం ది. అడవుల్లో మైనింగ్‌ కోసం డైనమైట్లు తరచూ పేలుస్తుండటం వల్ల గిరిజనుల్లో ప్రాణభయం ఏర్పడుతోందని హక్కుల సంఘాల వారు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. కొత్త మైనింగ్‌ విధానాన్ని రూపొందిస్తామని ప్రభుత్వా లు హామీ ఇవ్వడం ఆనవాయితీ, అలాగే, కాల్పులు, డైనమైట్ల పేలుళ్ళు కూడా అంత ఆనవాయితీగా తయారైంది. నక్సలైట్ల హింసా వాదాన్ని ఎవరూ సమర్ధించరు. గిరిజనుల భద్రతకోసం ఆరు దశాబ్దాలుగా నక్సల్స్‌ సాగిస్తున్న పోరాటానికి గిరిజనులే కాకుండా, హక్కుల సంఘాల వారిమద్దతులభిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement