Tuesday, March 19, 2024

నేటి సంపాద‌కీయం – స్వీయ నియంత్ర‌ణే మేలు

దేశంలో జరిగే పరిణామాలపైనా, కోర్టుల్లో వ్యాజ్యాల విచారణపైనా మీడియా అం దించే సమాచారాన్ని నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం మరో సారి మీడియా స్వతంత్రతకు అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. ఇలాంటి కేసుల సందర్భంగా స్వీయ నియంత్రణ పాటిస్తే ఎటు వంటి సమస్యలూ ఉత్పన్నం కావని గతంలో కూడా స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా న్యాయమూర్తుల మౌఖికవ్యాఖ్యలను నివేదించకుండా మీడియాను నియంత్రించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాలకు సంబంధిం చిన సమాచారం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందనీ, ఆ సమాచారాన్ని అందిం చవద్దని మీడియాను నియంత్రించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్రా సు హైకోర్టు ఇటీవల ఎన్నికల కమిషన్‌ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా విజృంభిస్తున్నవేళ ఎన్నికల పోలింగ్‌కు అనుమతి ఇచ్చిన అధికారులపై హత్యకేసులు నమోదు చేయాలంటూ ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టిం చాయి. ఇందుకు సంబంధించిన వార్తలు వార్తా ప్రసార సాధనాల్లో ప్రముఖంగా రావడంతో నొచ్చుకున్న ఎన్నికల సంఘం దీనిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కొంత కఠినంగా ఉన్న మాటనిజమేనని సుప్రీం కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. విషయం ఎంత తీవ్రమైనది అయినా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందనీ,ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు నిగ్రహాన్ని పాటించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచించారు. నిజానికి కరోనా రెండవదశ విజృంభణ సమయంలో ఎన్నికల తేదీలను ప్రకటించడాన్ని దేశంలోని ప్రతిపక్షాలు ఇంతకన్నా తీవ్రంగా విమర్శించాయి. కంద్రం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం నడుచుకుంటోందనీ,ముఖ్యంగా, కేంద్రం ఒత్తిడిపైనే బెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్‌ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిందని ప్రతిపక్షాలు ఆరోపిం చాయి. అయితే,ఎ న్నికల సంఘం పోలింగ్‌ తేదీలపై నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి కరోనా ఉధృతి ఇంతగా లేదని ఎన్నికల కమిషన్‌ వివరణ ఇచ్చింది. బంగాల్‌లో పోలింగ్‌ తేదీల విస్తరణవల్లే ఎన్నికల ప్రచారానికిఎక్కువ సమయం ఇవ్వడానికి అవకాశంకలిగిందని రాష్ట్రంలో అధికారంలోఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. చివరి నాలుగు దశల నూ కలిపి ఒకేసారి పోలింగ్‌ జరిపించాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆ పార్టీ నాయకుల ఆగ్రహానికి కారణం.నిజానికి పోలింగ్‌ గతంలో రెండు లేక మూడు దశల్లో జరిపించేవారు.ఎన్నికల ప్రచారంలోనే కాకుండా, పోలింగ్‌ సందర్భంగా దౌర్జన్యాలు, హింసాకాండవంటి అవాంఛ నీయ సంఘటనలు తరచూ జరుగుతున్న దృష్ట్యా పోలింగ్‌ దశలను ఎన్నికల సంఘం పెంచు తూ వస్తోంది. ఆ సంఘం రాజ్యాంగ బద్దమైన సంస్థ అయినా, ప్రభుత్వాన్ని సంప్రదించే తేదీలను ప్రకటిస్తుందనేది ప్రతిపక్షాల అనుమానం. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లుచేసే బాధ్యత ప్రభుత్వానిదే కనుక అది సహజమే. పోలింగ్‌ తేదీల ప్రకటన నాటికి కరోనా ఉధృతి లేకపోయినా, తర్వాత పోలింగ్‌ దశలను తగ్గించ వచ్చు కదా అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. దీంతో ఎన్నికల కమిషన్‌ అధికారులపై దేశవ్యాప్తంగా అసంతృప్తి వెల్లడైంది.దానిని దృష్టిలో ఉంచుకునే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య లు చేసిఉండవచ్చు. అయితే, ఆయన వ్యాఖ్యల్లో కాఠిన్యతను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. విచారణ సందర్భంగా అలాంటి వ్యాఖ్యలు సహజమే అయినా, ఆ సమాచారాన్ని మీడియా యథతథంగా ప్రజలకు అందించకుండా నియంత్రించాలని ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టు ను కోరింది. రాజ్యాంగంలోని19 (1) ఆర్టికల్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పౌరులకు ప్రసాదించిన దృష్ట్యా, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ సంస్థలన్నింటిపైనా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక హక్కును సమర్ధిస్తూనే, స్వీయ నియంత్రణ పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement