Friday, March 29, 2024

నేటి సంపాద‌కీయం – చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వ‌త్తాసు..

క‌రోనా వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు అసత్యం కాదని స్పష్టం అవుతోంది. కరోనా వ్యాప్తి చైనాలోని వూహన్‌ నగరం లేబొరేటరీ నుంచి కాకుండా గబ్బిలాల నుంచివ్యాపించినట్టు చైనా నివేది క పేర్కొంది.అయితే,ఆ నివేదికను అధికారికంగా ఇంకా వెల్లడి చేయలేదు. ఈలోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిం ది. గబ్బిలాల నుంచి మరో జంతువుకి,వాటి ద్వారా మనుషులకు వ్యాపించి ఉండ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ప్ర పంచఆరోగ్య సంస్థపై చైనా ఒత్తిడి తేవడం వల్లనే ఈ నివేదికవచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా పలువురు నిపుణులు, ఆరోగ్య శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఈ వైరస్‌ చైనాలోని వూహన్‌ లేబొరేటరీ నుంచి వచ్చిందని జర్మనీకి చెందిన ఒక శాస్త్రవేత్త మొదటిగా వెల్లడించారు.అయితే,వూహన్‌ లేబొరేటరీ నుంచి కాదనీ, గబ్బిలాల నుంచే ఈ వైరస్‌ వ్యాపించిందని చైనా వాదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ అథనోమ్‌కి ముందు ఆసంస్థ డైరక్టర్‌ జనరల్‌గా చైనాకి చెందిన వ్యక్తి ఆ పదవిలోఉండేవారు.ఆయన తన తర్వాత అథనోమ్‌కి అవకాశంఇచ్చేందు కు తోడ్పడటం వల్ల ఆయన మొదటి నుంచి చైనా అనుకూల వైఖరిని అనుసరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, చైనా ఈ వార్తలను కొట్టి పారేసింది. ఇప్పుడు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వూహన్‌ లేబొరేటరీ ప్రమేయం లేదనిచెప్పడం చైనాను ఈ వివాదం నుంచి బయటపడేయడానికే ఆయన రూపొందించినట్టు భావిస్తున్నారు. చైనాఇప్పటికీ ప్రపంచ దేశాలపై తీవ్రమైన ఒత్తిడితెస్తోంది. కరోనా వైరస్‌ పుట్టుక వూహన్‌ లేబొరేటరీ కాదని జనాన్ని నమ్మించేప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి చైనాలోని వూహన్‌ లేబొరేటరీ నుంచే ఇది వ్యాపించిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శించే వారు. ఆయన చైనావైరస్‌ అంటూ కరోనా వైరస్‌కి పేరుపెట్టారు.అయితే, అమెరికా అధ్యక్షునిగా వచ్చిన డెమోక్రాటిక్‌ నాయకుడు జో బిడైన్‌ చైనాపై విమర్శల ఘాటును తగ్గించారు. తమ దేశంలో కరోనా వైరస్‌ని అంతం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నా రు. ఆయన అధ్యక్ష బాధ్యతలుచేపట్టిన తర్వా త అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతున్నట్టుసమాచారం. అలాగే, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ రాత్రి 8 గంటలకే మూసివేస్తు న్నారు. ముంబాయిలో పెద్ద దుకాణాలు, రెస్టారెంట్లు మూత పడుతున్నాయి. ఉత్తరాఖండ్‌ లో కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.రుషీకేష్‌లోని తాజ్‌ హోటల్‌ లో 76 మందికి కరోనా సోకడంతో ఆ హోటల్‌ ని మూసివేశారు.దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి రెండురోజుల క్రితం ఉన్నత స్థాయిసమావేశాన్ని నిర్వహించి జాగ్రత్తలు సూచించారు. హోళీఉత్సవాలను ఆర్భాటంగా జరుపుకోవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ వేడుకలు యథాతథంగా జరిగినట్టు సమాచారం.కొత్త కేసుల్లో 73.64 శాతంకేసులు మూడు రాష్ట్రాల్లోనే నమోదైనట్టు కేంద్రానికి సమాచారం అందింది. గడిచిన 24గంటల్లో 60 వేల కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌ తర్వాత ఒక్క రోజులో ఇన్నికేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల నమోదు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఉప ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాల్లో అధికార పార్టీలు, ఇతర పార్టీలు తమ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. బంగాల్‌లో మొదటి విడత పోలింగ్‌ పూర్తి అయింది.రాష్ట్రంలో ఏడు విడతలలో పోలింగ్‌ జరగనుంది. ప్రజల్లో కరోనా పట్ల గత ఏడాది అంతటి భయంలేదనిపిస్తోంది. చాలా మంది వ్యాక్సినేషన్‌ చేయించుకున్న దృష్ట్యానూ, మాస్క్‌లు ధరించడం జాగ్రత్తలు పాటిస్తున్న దృష్ట్యా గత ఏడాది మాదిరిగా జనం భయ పడటం లేదు. బహుశా ఈ దిలాసాయే కేసులు పెరగడానికి కారణం కావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement