Tuesday, October 19, 2021

నేటి సంపాదకీయం – విజయోత్సవాలకు వేళ కాదు

కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలను కేంద్రమూ, రాష్ట్రాలూ, రాజకీయ పార్టీలూ పాటించడం లేదు. అయినప్పటికీ ఆ సంస్థ సమయం వచ్చినప్పుడల్లా పార్టీలకు హెచ్చరికలను జారీ చేస్తూనే ఉంది.మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లిd ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నా యి. వీటి ఎన్నికల పోలింగ్‌ పూర్తి అయిననాటి నుంచి ఫలితాలపై ఊహాగానాలు, బెట్టింగ్‌లూ సాగుతూనే ఉన్నాయి. కోవిడ్‌ వేళ కూడా ఎన్నికల ఫలితాలపైనా, క్రికెట్‌ ఆటపైనా బెటింగ్‌లు కాసే మహానుభావులు ఉన్నారు.ఒక వంక కోవిడ్‌ రోగు లకు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు పోతుంటే,ఫలితాల పై ఉత్కంఠ ఉన్న ప్పటికీ కాయ్‌ రాజా కాయ్‌ అన్నట్టు పందెంకాసే ఆర్థిక స్థోమతు జనానికి ఎలా కలుగుతోందన్న సందేహాలు ప్రజ లకు కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. ఫలితాల వెల్లడి రోజున అభ్యర్ధి తరఫున ఒకరిద్దరిని మాత్రమే అనుమతించాలనీ, విజేతల తరఫున ఊరేగింపులూ, ర్యాలీలనూ, వీధుల్లో విజయోత్సవాలను నిర్వహించరాద ని ఆదేశించింది.అంతేకాకుండా చెవులు చిల్లులుపడేట్టు బాణసంచా కాల్చరాదని ఆదేశించిం ది. కరోనా వ్యాప్తి ఊహించిన దాని కన్నాఎక్కువగా ఉన్నందున విజేతలు తమ ఆనందాన్ని అతిదగ్గర మిత్రులు,సన్నిహితులతోమాత్రమే పంచుకోవాలని కూడా ఆదేశించింది. కాగా, కరోనా రోగులకు ఆక్సిజన్‌ అందకపోవడాన్ని, రోగులకు సరైన వైద్య సౌకర్యాలను అందిం చలేకపోవడాన్ని మీడియాలో వచ్చిన వార్తలను సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని తాజా పరిస్థితిపైఅఫిడవిట్‌ సమర్పించమని కోరింది. కేంద్రంతీసుకున్న చర్యలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మరికొన్ని సూచనలు చేసింది.ఆక్సిజన్‌ను ఇతర దేశాల నుంచి తెప్పించడాన్ని ప్రశంసిస్తూనే, దిగుమతి అయిన ఆక్సిజన్‌ నిల్వలను అన్ని రాష్ట్రాలకూ సరఫరా అయ్యేట్టుచూడాలని ఆదేశించింది. ముఖ్యంగా,దేశ రాజధాని ఢిల్లిdలో పరిస్థితి విషమించడంపట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లిd ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండానిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. కోవిడ్‌ పై కేంద్రం సమర్పించిన 200 పేజీల జాతీయ ప్రణాళికను సమగ్రంగా పరిశీలించి వచ్చే శుక్రవారం విచారణ జరుపుతా మని సర్వోన్నతన్యాయస్థానం పేర్కొంది.ఆక్సిజన్‌ నిల్వలు నిండుకోవడంతో రోగుల ప్రాణా లు పోయే పరిస్థితి నెలకొన్నట్టు సూరత్‌ తదిత ర నగరాల్లో పరిస్థితిని గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది.ఆక్సిజన్‌ ఉత్పత్తికి, దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నప్పటికీ ఎందుకు ఈ పరిస్థితివస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రాల మధ్య సమన్వయం లేదనేది బహిర్గతమవుతోందనీ, గతవారం ఇదే విషయమై తాము నొక్కి చెప్పామనీ,కానీ, రాష్ట్రాలు వేటికవే రీతిలో వ్యవహరిస్తుండటం విచారకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్‌ దిగుమతుల్లో సైనికుల సహాయాన్ని స్వీకరించడం వివరణ ఇవ్వాలనీ, వ్యాక్సిన్‌ రేట్లలోతేడాలెందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తరలించడంలో భద్రతాప్రమాణాలన మరింత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, సైన్యంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారి సేవలను వినియోగించుకుంటున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే, వ్యాక్సిన్‌ రేట్ల ను తగ్గించాలని వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను కోరినట్టు తెలియజేసింది. ఈ పరిస్థితుల్లో అందరికీ సమాన బాధ్యతఉంది. కేవలం ప్రభుత్వం తీసుకునే చర్యలతోనే మహమ్మారిని తరిమి వేయడంసాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరింది. ముఖ్యంగా, కోవిడ్‌ నియమనిబంధనలను పాటించడం ద్వారా ప్రజలు కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టాలనీ, గతంలో మాదిరిగా తమకేం కాదన్న ధీమాతో విచ్చలవిడిగా వ్యవహరించ రాదని స్పష్టం చేసింది.కోవిడ్‌ మొదటి దశ కన్నా, రెండవ దశలో పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అన్ని సంస్థలూ, దేశాలూ హెచ్చరిస్తున్న తరుణంలోఐచ్చిక నియంత్రణకు చాలా రాష్ట్రాల్లో ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడం స్వాగతించాల్సిన అంశం. కోవిడ్‌లో స్వీయ నియంత్రణను పాటించడం ద్వారా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలే తప్ప ఎవరో వచ్చి ఏదో సాయం అందిస్తారనే భ్రమలు పెట్టుకోవద్దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News