Saturday, April 20, 2024

సైన్యం పదఘట్టనలో మయన్మార్‌!

మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, నోబెల్‌ బహుమతి గ్రహీత అంగసాన్‌ సూకీకి దేశంలో ప్రజల మద్దతు నానాటికీ పెరుగుతుండటంతో సైనిక ప్రభుత్వానికి కంటగింపుగా ఉంది. ఆమెపై పాత కేసులు తవ్వి జైలులో ఎక్కువ కాలం ఉండేట్టు చేస్తున్నారు. తాజాగా హెలికాప్టర్‌ను లీజుకు తీసుకునే విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న కేసును ప్రభుత్వం బనాయించగా, మిలటరీ కోర్టు తూతూ మంత్రంగా విచారణ జరిపి ఆమెకు ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జా తీయ సంస్థలేవీ సైనిక ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చైనా మద్దతుతో మిలటరీ ప్రభుత్వ అధికారులు చెలరేగిపోతున్నారు. అమెరికా కూడా మయన్మార్‌ పరిణామాలను ఖండించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది. ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభు త్వాలను కాపాడేందుకు కంకణంకట్టుకున్నట్టు గొప్పలు చెప్పే అమెరికా మయన్మార్‌ ప్రభుత్వం జోలికి వెళ్ళడం లేదు. అక్కడ కోర్టులు మిలటరీ పాలకులు చెప్పినట్టు నడుచుకుంటున్నాయి.

సూకీని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితిసహా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ సహా ప్రజాస్వామిక దేశాలు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదనలు అవుతున్నాయి. అమెరికా, చైనా రెండూ ఇప్పుడు పెట్టుబడి దేశాల పాత్ర వహిస్తున్నాయి. గతంలో అమెరికా, రష్యా ఆ పాత్ర పోషించేవి. సోవి యట్‌ యూ నియన్‌ పతనానంతరం అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే గొడవల్లో తలదూర్చేది. ఇప్పు డు చైనా కూడా అదే పాత్ర పోషిస్తోండటంతో అమెరికా గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం లేదు. మయ న్మార్‌పై ఈ రెండు దేశాలకు ప్రేమకన్నా, మయ న్మార్‌లో లభించే సహజ వనరులు, ఖనిజ సంపదలపైనే మక్కువ ఎక్కువ. గత ఏడాది ఫిబ్రవరిలో అంగసాన్‌ సూకీ నేతృ త్వంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని సైనికాధి కారులు కుంటి సాకులు చెప్పి కూలదోశారు. ఆమెను గృహ నిర్బం ధంలోకి పంపారు.అప్పటికే ఆమె దశాబ్ద న్నర కాలం పాటు గృహనిర్బంధంలో ఉన్నారు. ఎన్నిక ల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా సైనిక ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.

- Advertisement -

దేశంలో రొహింగ్యా ముస్లింలను ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెచ్చగొట్టారు. రొహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కూ, మన దేశానికీ వచ్చి తలదాచు కుంటు న్నారు. వారికి ఎక్కడా పౌరసత్వం లేదు. మయ న్మార్‌ లో వారికి పౌరసత్వం కల్పించేందుకు సూకీ ప్రభు త్వం చేసిన ప్రయత్నాలను సైనికాధికారులు చెడగొ ట్టారు. సైని క ప్రభుత్వం అరెస్టు చేసిన వారిలో ఆమె పార్టీకి చెంది నవారే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఖైదీలకు లభిం చాల్సిన సౌకర్యాలను కూడా సైనికాధికారులు నిరాకరి స్తున్నారు. జైళ్ళు నరకం కన్నా దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాల వారు మొర బెట్టుకున్నా, మయన్మార్‌ జైళ్ళన్నీ మురికి కూపాలుగానే ఉన్నాయి. స్వాతంత్య్ర సమరంలో మన దేశానికి చెందిన స్వాతంత్య్ర యోధులను మాండలే జైలులో నిర్బంధించే వారు. ఆ జైళ్ళల్లో ఎలాంటి పరి స్థితులున్నాయో చరిత్ర పాఠాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు అంతకన్నా దారుణమైన పరి స్థితులు నెలకొ న్నట్టు వార్తలందుతు న్నాయి. మయన్మార్‌లో సామాన్య ప్రజల జీవనం సాఫీీ గా సాగే పరిస్థితులు లేవు.అన్ని వర్గాలపైనా సైనికాధికా రులు ఏదో మిషపై కేసులు పెడుతున్నారు. దేశంలో లభించే ఆహార ధాన్యాలు, ఖనిజాలు, ఇతర వనరులను చైనాకి దోచి పెడుతున్నారు.

మయన్మార్‌పై గతవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానం చేసింది. అక్రమంగా అరెస్టు చేసినవారిని విడుద ల చేయాలనీ, జైళ్లల్లో పరిశుభ్రమై, ఆరోగ్యకర వాతావరణం ఉండేట్టు చూడాలని సైనిక ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో హెచ్చరిం చింది. చైనా, రష్యాలు ఆ తీర్మానంపై ఓటు వేయకుండా బహిష్క రించాయి. మయన్మార్‌లో మానవ, పౌరహ క్కుల హన నంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఎన్నోసార్లు హెచ్చరించినా సైనిక పాలకులు ఖాతరు చేయడం లేదు. అగ్రరాజ్యమైన అమెరికా ఆమ్నెస్టీ హెచ్చరికలను పట్టించు కోవడం లేదు. మానవజాతి చరిత్రలో అత్యం తదారుణమైన, దుర దృష్టకరమైన రీతిలో మయన్మార్‌ ప్రజలు అనుభవి స్తున్న కష్టాలను గురించి ఎవరూ పట్టిం చుకోవడం లేదు. అంగసాన్‌ సూకీ నేరం చేశారా లేదా అన్నది ఏ కేసు లోనూ ఇంతవరకూ రుజువు కాలేదు. అయినా, ఆమెను మిలటరీ పాలకులు వేధిస్తున్నారు. ఆమెను సమర్థిస్తున్న వారిని ఇక్కట్ల పాలు చేస్తున్నారు. ప్రపంచంలో సైనిక ప్రభు త్వాలు ఎన్నో దేశాల్లో ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్లు ఉన్నాయి. ఇంతటి దౌష్ట్యం, కర్క శత్వంగల ప్రభుత్వం ఎక్కడా లేదని అంతర్జాతీయ హక్కు ల సంఘాలు స్పష్టం చేస్తున్నా, ఎవరూ పట్టించుకో కపోవడం మానవజాతికే మాయని మచ్చ.

Advertisement

తాజా వార్తలు

Advertisement