Wednesday, April 24, 2024

సామరస్య భావనతోనే శాంతి..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో మొదటి వారని అమెరికాకి చెందిన కన్సల్టింగ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెెల్లడికావడం వాస్తవానికి అద్దం పడుతోంది. మోడీకి దేశంలోనూ, విదేశాల్లోనూ ఆదరణ అంతకం తకు పెరుగుతోంది. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరి కాసహా, అన్ని దేశాల్లో నాయకత్వాలు వివిధ రకాల సమ స్యల కారణంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నమాట నిజమే కానీ, దేశ ప్రజలకు భవిష్యత్‌పై ఆశలు కల్పించ డంలో మోడీ కృతకృత్యులు అవుతున్నారన్న మాట కాద నలేని విషయం. ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఎదుర వుతున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు లభిస్తున్న మన్ననలతో పోలిస్తే దేశంలో విమర్శలు పెద్ద పరిగణనలోకి రావు. ఇటీవల జి-20 కూటమి సదస్సు లో మోడీ ప్రపంచశాంతికోసం వసుధైక కుటుం బ భావ నను వ్యాప్తి చేసి ఆ సదస్సుకు హాజరైన నేతల్లో ఆలోచ నలు రేకెత్తించారు. ప్రజాదరణలో ప్రపంచవ్యాప్తంగా మోడీకి 77 శాతం రేటింగ్‌ రాగా, మెక్సికో అధ్యక్షుడు ఆం డ్రూ లుపేజ్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఎయి ల్‌బెన్స్‌లు రెండవ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షు డు బిడెన్‌ తొమ్మిదవ స్థానంలోనూ, బ్రిటిష్‌ ప్రధాని సునాక్‌ పదవ స్థానంలో ఉన్నారు.

వయసు, అనుభవం రీత్యా ఈ నాయకులందరికన్నా మోడీ సీనియర్‌ మాత్ర మే కాదు, అంతర్జాతీయ వ్యవహా రాల్లో అనుభవం ఆయనకు ఈ రేటింగ్‌ని తెచ్చి పెట్టింది. త్వరలో జీ-20 కూటమి నాయకత్వాన్ని చేపట్టనున్న ఆయనకు మరింత ఆదరణ పెరిగింది. డిసెంబర్‌ ఒకటవ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు. ప్రపంచ దేశాల న్నీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య, ఆర్థిక పరిస్థితులు మందగించడం ఒక కార ణ మైతే, ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల చమురు, గ్యాస్‌ రంగాల్లో సంక్షోభం తీవ్రతరం కావడం మరో కారణం. ఈ పరి స్థితులను గురించి విశ్లేషిస్తూ మోడీ జి-23 సదస్సులో చేసిన ప్రసంగం భారతీయ సంస్కృతి, సంప్రదా యాలకు అనుగుణంగా ఉంది.

ముఖ్యంగా, మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని గుర్తు చేసింది. ప్రజలు ఇప్పు డు యుద్ధాలను కోరుకోవడం లేదు, శాంతిని కోరుకుం టున్నారంటూ మోడీ చేసిన స్పష్టీకరణ ఇటు ఉక్రెయిన్‌ నాయకత్వానికీ, అటు రష్యన్‌ నేతలకూ హితబోధ వంటిదే. ప్రపంచంలో ఉన్న వనరులను ఏ ఒక్క దేశమో స్వంతం చేసుకోవాలన్న ఆలోచనలు రావడం వల్లనే సంక్షోభాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి భావ నలు అగ్రరాజ్యాల్లోనే ఉండేది. ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ భావన వ్యాప్తి చెందుతోంది. దేశాల మధ్య తగాదా లను తీర్చా ల్సిన ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు చేతులెత్తేసిన తరు ణంలో ప్రపంచ దేశాల నాయకులలో పునరాలోచన కలిగించే బాధ్యతను తలకెత్తుకున్న మోడీని ప్రపంచంలో పెక్కు దేశాలు ప్రశంసిస్తున్నాయి. అటు అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ సామరస్యంగా మెలుగుతున్న మోడీ నోటి మాటలు ఆ సదస్సుకు హాజ రైన వారందరికీ హితవచనాలే. ప్రపంచ శాంతి కోసం మన దేశం మొదటి నుంచి కృషి చేస్తోంది. అల నాడు చికాగోలో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకా నంద చేసిన ప్రసంగం విశ్వశాంతిని పాదుకొల్పేందుకే. ఆ తర్వాత భారత గడ్డ మీద పుట్టిన ఎందరో మహనీయులు ఆ బాధ్యతను కొనసాగిస్తూ వస్తున్నారు. వనరులను పంచుకోవడంలో సంబంధిత వర్గాల మధ్య సామరస్య భావన ఉండాలన్న భారతీయ సిద్ధాంతం దేశాలకూ వర్తిస్తుంది.

శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్య భావనల వల్లనే విశ్వశాంతి సాధ్యం.ఈ భావనను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మోడీ మన పెద్దల సంప్ర దాయాన్ని అంది పుచ్చు కున్నారు. అందుకే, ఆయనకు ఈనాడు ప్రపంచ దేశాల్లో ఆదరణ లభిస్తోంది. అంతే కాకుండా విదేశాంగ విధానాన్ని వాణిజ్య, ఆర్థిక సంబం ధాల మెరుగుకోసం ఉపయోగి స్తున్నారు. దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదటి నుంచి ఉన్నప్పటికీ, ఇప్పుడు సమర్థవం తంగా తీర్చిదిద్దారు. ఇచ్చి పుచ్చు కునే ధోరణ ద్వైపాక్షిక సంబంధాల విజయానికి కారణం అవుతుంది. ఇది కూడా భారతీయ సంస్కృతిలో భా గమే. ఈ భావనను బాగా ఆకళింపు చేసుకుని వివిధ దేశాలతో సంబంధాలను మెరు గుప ర్చుకోవడానికి ఇదే సరైన మార్గంగా ఆయన పరిగ ణిస్తున్నారు. యావత్‌ మానవాళి ఉనికికి సవాల్‌గా నిలిచిన కరోనా సమ యంలో భారత్‌ అనుసరించింది ఇదే. అందుకే, భారత్‌కి ప్రపంచ దేశాల్లో మంచిపేరు వచ్చింది. కష్టం వచ్చిన ప్పుడు అంతా ఒకటి కావాల న్నది కూడా భారతీయ సంప్రదాయమే. దానిని ఆచర ణలో పెట్టడం వల్లనే మోడీకి ప్రపంచ దేశాల్లో మంచిపే రు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement