Friday, March 29, 2024

యజ్ఞయాగాల అంతరార్థం

అగ్నిదేవుణ్ణి ఆవాహనచేసి దేవుళ్లను సంతృప్తిపర చడానికి అగ్నిహూత్రం ఏర్పాటుచేస్తారు. రాగిపాత్రలో లేదా కుండలో పిడకలు పేర్చి, కర్పూరం వేసి అగ్ని రాజేస్తారు. అగ్ని అనేది అధిష్ఠాన దేవత. హూత్రం అంటే హవిస్సు. అగ్నిలో భక్తి పూర్వకంగా, మంత్ర సహతంగా ఆయా దేవుళ్లకు స్వాహా అంటూ జారవిడిచే పాలు, అన్నం, నెయ్యి, మూలికలు మొదలైనవి హవి స్సులు. యజ్ఞం విష్ణు స్వరూపం. దేవతలకూ, మనకూ సంధానం ఏర్పరచేది హోమం. దేవతలను హవిస్సులతో సంతృప్తిపరచి, ఆరోగ్యం, ఆయుష్షు, కీర్తి, సంతతి, శాంతి పొందాలనుకుంటారు. యజ్ఞా లవల్ల పర్యావరణం పరిశుభ్రమవుతుంది.వర్షాలు కురుస్తాయి. రోగనిర్మూ లక మూలికలు వేసి మండించడం వల్ల వ్యాధులు దూరమవుతాయి.
తద్వారా మనసు ప్రక్షాళితమై ప్రశాంతమవుతుంది. అత్యధిక సంఖ్య లో సాధువులు పాల్గొనే, అధిక ధనం ఖర్చయ్యే అతిరాత్ర యాగం, చండీయాగంలాంటి మహా యాగాలే కాకుండా అందరూ చేయదగిన కొన్ని సంప్రదాయ ప్రక్రియలూ ఉన్నాయి. నిత్యం ఇళ్లలో హోమం చేస్తే నిత్యాగ్నిహోత్రు లంటారు. యాగాల్లో అశ్వమేధ, పుత్రకామేష్టి, రాజసూ య, సర్ప, విశ్వజిత్‌ యాగాలు ముఖ్యమైనవి. పెళ్లిలో నవదంపతులు అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవ టం, అగ్నిసాక్షిగా ఒక్కటవడం తెలిసిందే. నూతన గృహంలో గణపతి హోమం శాంతి సౌఖ్యాలనిస్తుంది. యాగాలు, హోమాలతో సుఖశాంతులు లభిస్తాయన్నది మహర్షుల ఉవాచ.

Advertisement

తాజా వార్తలు

Advertisement