Thursday, April 25, 2024

వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21 నుంచి ప్రారంభం కాగా వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 21న విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 3 వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాల వివరాలు..

21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన

22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానంహవనం నిర్వహిస్తారు.

23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటుంది.

- Advertisement -

24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.
25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ నిర్వహిస్తారు.

26న ఉదయం 9 గంటలకు గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ ఉంటుంది.

27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం

మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.

మార్చి 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన ఉంటుంది.

3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement