Monday, October 14, 2024

విశేష ఫలప్రదంశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన!

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం
దారుణం త్రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం!!
సుబ్రహ్మణ్య అనే పదానికి సంస్కృత భాష లో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఉత్తముడు అని అర్థం. ఈయనను స్కందుడు, క్రౌంచధార ణుడు, కుమారస్వామి, కార్తికేయుడు, శరవణభవుడు మొదలైన నామాలతో కొలుస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న భారతదేశంలోని అనేక సంస్కృ తుల కలయికతో ఏర్పడినదే సుబ్రహ్మణ్యారాధన. ఈయనలో శైవ- వైష్ణవ మతాలు మనకు కనిపిస్తా యి. శైవమత పురాణాల ప్రకారం స్కందుడు శివు ని పుత్రుడు కనుక ఈయన శైవమతానికి చెందిన వాడు. భగవద్గీతలోని విభూతియో గములో శ్రీ కృష్ణుడు ”సేనానీ నామ హం స్కన్ద” అనగా ”సేనానులలో స్కందుడను నేనే” అని చెప్పడం ద్వారా ఈయన విష్ణాంశ సంభూతు నిగాను, వైష్ణవ మతానికి చెందిన వాడుగాను పేర్కొనవచ్చును. శివ కేశవులకు బేధం లేదని చెప్పటానికి సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్ష నిదర్శ నం. స్కాందపురాణములో కార్తికే యుని వర్ణించటం జరిగింది.
శ్రీ పరమేశ్వర తేజస్సు షట్‌కృ త్తికల గర్భంలో ప్రవేశింపగా, వారు దానిని భరింపలేక గంగాతీరాన విడు వగా ఆరు ముఖాలతో, అమితమైన తేజస్సుతో సుబ్రహ్మణ్యుడు ఉద్భవిస్తాడు. అందువలన ఈయనను షణ్ముఖుడు అని వ్యవహరిస్తారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి తమతమ శక్తివం తమైన ఆయుధాలను ఈయనకు ప్రసాదిస్తారు. వాటి ప్రభావంతో తారకాసురుని సంహరించి లోకాలను కాపాడతాడు. దేవతల కోరిక మేరకు స్కందుని దేవతల సేనానిగా పరమేశ్వరుడు నియ మిస్తాడు. ఈ శుభ సంద ర్భంలో దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో అతి వైభవంగా వివా హం జరిపిస్తాడు. సుబ్రహ్మణ్యుడు తాను వలచిన వల్లిదేవిని కూడా వివాహం చేసుకుంటాడు. వల్లిదేవి ఇచ్ఛాశక్తిగాను, దేవ సేన క్రియశక్తిగాను వ్యవ హరింపబడతారు.
శ్రీ సుబ్రహ్మణ్యారాధన అత్యంత విశేషమై నది. ఇది అతి నియమ నిష్టలతో కూడుకున్నది. వివాహ సమస్యలకు, సంతానప్రాప్తికి, అనారోగ్య సమస్యలకు, జాతకంలోని కుజ, కాలసర్పదోషా లకు సుబ్రహ్మణ్యారాధన విశేష ఫలవంతమైనది. ఉదయాన్నే తలస్నానం చేసి, తడిబట్టలతో స్వామి వారికి పాలు, పువ్వులు, వెండి పడగలు, పండ్లు మొదలైనవి సమర్పిస్తారు. రోజంతా ఉపవసిం చి, రాత్రివేళ ఫలహారం చేస్తారు. మద్య మాం సాదులు స్వీకరింపరాదు. నాగప్రతిష్ట చేయటం ద్వారా సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వా సం. తమతమ కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి కావడి రూపంలో మ్రొక్కులు చెల్లించుకుం టారు. తాంత్రిక విధానములో కూడా సుబ్రహ్మ ణ్యుని ఆరాధించే విధివిధానాలు మనకు కనబడ తాయి. కాని అవి శాస్త్ర విధివిధానాలతో చేయకపో యినట్లయితే తీవ్రమైన చెడు ఫలితాలు సంభ వి స్తాయని పెద్దలు చెబుతారు. అందువలన తాంత్రి క విధివిధానాల ద్వారా కాకుండా సౌమ్య పద్ధతు లలో శ్రీస్వామిని కొలుచుట సర్వదాశ్రేయస్కరం. సుబ్రహ్మణ్యస్వామి జన్మ నక్షత్రము కృత్తిక. ఆషా డమాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర ము నాడు స్వామి వారిని అర్చిస్తే కుజ సంబంధమైన చెడు ప్రభావా లు తొలగిపోతాయి.
సుబ్రహ్మణ్యస్వామిలో జ్ఞా న, వైరాగ్య, బల, కీర్తి, సంపద, దైవశక్తి అనే ఆరు లక్షణాలు కన బడతాయి. స్వామివారి ధ్వజ మైన కోడిపుంజు (కుక్కు టము) ఉదయించే జ్ఞానాన్ని, ప్రకాశాన్ని సూచిస్తుంది. తామస లక్షణాలైన అహంకారం, గర్వం, డాంబికం మొదలైన లక్షణాలకు ప్రతీకయైన నెమలిని అధిరోహంచటం ద్వారా, వాటిని అదుపు చేసే శక్తిసమన్వితుడుగా కొలువ బడుతున్నాడు.
పరమేశ్వర వాహనమైన నందీశ్వరుడు అగ స్త్య మహర్షికి ప్రసాదించిన స్కందకుమార అష్టో త్తరాన్ని భక్తి, శ్రద్ధలతో పఠించిన వారి సమస్యల న్నీ తొలగిపోతాయని స్కాంద పురాణము మనకు వివరిస్తుంది. శ్రీశంకరాచార్యులవారు రచించిన ”సుబ్రహ్మణ్య భుజంగం”మానవాళికి మహత్తర మైన వరము. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ శంకరాచార్యులవారు తిరుచందూర్‌ క్షేత్రములో స్వామివారిని దర్శించి, తన్మయత్వం చెంది తన శారీరిక బాధలను సైతం మరచి ”సుబ్రహ్మణ్య భుజంగం” అనే స్తోత్రాన్ని ఆశువుగా పఠిస్తారు. తక్షణమే ఆయనకు అనారోగ్యంనుంచి ఉపశ మనం కలుగుతుంది. కార్తికేయుని మనస్ఫూర్తి గా, భక్తిశ్రద్ధలతో కొలిచేవారి కొంగుబంగారమై, ఏదో ఒక రూపంలో వచ్చి సమస్యలను పరిష్కరి స్తాడు. నిండు మనస్సుతో అయిదు మంగళవార ములు సుబ్రహ్మణ్యస్వామిని మందారపూవులతో అర్చిస్తే మంచి సంతానం కలుగుతుందని శాస్త్రవచనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement