Wednesday, December 11, 2024

నేటి రాశిఫలాలు(15–11–2024)

మేషం: పనులు నిదానిస్తాయి. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో మరింత గౌరవం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: సోదరులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో కలహాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement