Friday, March 29, 2024

నేటి రాశిఫలాలు(27-01-2023)

మేషం: వ్యయ ప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు-. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మరింత సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలోచికాకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. భూములు కొంటారు. కొన్ని వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

- Advertisement -

సింహం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య : వ్యవహారాలలో అవరోధాలు. రుణయత్నాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆర్థిక విషయాలలో నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలోచికాకులు.

తుల: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తులు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు
ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు తప్పదు.

కుంభం: పొరపాట్లు -సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement