Thursday, April 25, 2024

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 22 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు క్యూలో వేచిఉన్నారు. వీరికి 30 గంటల్లో స్వామివారి ద‌ర్శ‌నం కలుగుతుంది. భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాలు ఇచ్చి, హుండీలో కానులు వేశారు. 28,519 మంది తలనీలాలు స‌మ‌ర్పించ‌గా.. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చింది. అదేవిధంగా టీటీడీ అధికారులు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తిక మహా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement