Saturday, March 18, 2023

త్రిమూర్తి స్వరూపుడి ఆరాధన

బ్రహ్మవిష్ణశ్చ రుద్రశ్చ ఈశ్వర్చ సదాశివ:
పంచబ్రహ్మ మయాకార యేన జాతాస్త మీశ్వరమ్‌,
బ్రహ్మ స్వరూప ముదిరే,మధ్యాహ్నమే తు మహశ్వర:
సంధ్యాకాలే స్వయం విష్ణు: స్తయీమూర్తి దివాకర:”
ప్రత్యక్ష దైవం అయిన ఆదిత్యుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూపంగా ప్రకృతి లో జీవాన్ని నింపి, వేయికి పైగా కిరణాలతో మధ్యాహ్నం వేళ మహేశ్వరుడిగా మారి, సాయంకాలం సంధ్యావేళలో విష్ణువు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. లోకంలోని సమస్త చీకటిని తొలగించి, అందరికీ వెలుగును ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత పవిత్రమైన రోజు రథసప్తమి.
భారతీయ సంస్కృతిలో తెలుగు నెలలకు ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రతీ నెలలోను ఆధ్యాత్మిక భావనకు, ప్రకృతి ఆధారంగా ఉన్న పంచభూతాలు ప్రాముఖ్యత ను తెలుసుకోవడానికి ఎన్నో పండుగలు, పర్వదినాలు గుర్తించబడ్డాయి. వాటిలో ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమి ఒకటి. మాఘ మాసంలో ప్రతీరోజూ విశేషమైనదే. మాఘ మాసంలో ”మా” అంటే మన యొక్క, ”అఘము” అంటే పాపము. మనం చేసే పాపాలను పోగొట్టుకోవడానికి, ఈ రోజున అంటే రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు, రెండు లేదా మూడు రేగిపళ్ళు నెత్తిన పెట్టుకొని, స్నానం చేయాలి. ఏడు ఆకు లు అంటే ఏడు జన్మల పాపాలు పోగొట్టుకోవడం. జిల్లేడును ‘అర్క’ అంటారు. సూర్యుడు నామాల్లో ‘అర్క:’ అనే నామం ఉంది. రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు సూర్య తేజస్సును తమలో ఇముడ్చుకొంటాయి. అవి శిరస్సును ధరించడం వల్ల తేజస్సు, మన బ్ర#హ్మరంధ్రం ద్వారా ప్రేరేపితమై, మనలోని షట్కచక్రాలు ఉత్తేజితం అవుతా యి. స్నానంచేసి, తూర్పువైపు తిరిగి, సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం సమర్పించాలి.
ఈ రథసప్తమి రోజున స్త్రీలు, సూర్య కిరణాలు పడేటట్లుగా క్షీరాన్నం వండి, చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం సమర్పిస్తారు. చిక్కుడు కాయలతో రథం తయారు చేసి, సూర్య ప్రతిమనో, ఫొటోనో ఉంచి తులసి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఈ చిక్కు డు కాయలు, ఆకులు పరమార్థం ఏమిటంటే, మనకు ఏర్పడుతున్న చిక్కులు అన్నీ తొలగాలనే భావన. తరువాత సూర్య అష్టోత్తర శతనామావళితో పూజించి, ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రము చదువుకోవాలి. తులసి పూజ చేస్తారు. కంటికి కనపడే, ప్రత్యక్ష దైవం సూర్యుడే. అంతేకాకుండా, భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ద్వాదశాదిత్యుల లో ”విష్ణువు” అనే ఆదిత్యుడను అని వివరించారు. అందుకే ప్రత్యక్ష నారాయణుడుగా కొలుస్తారు. కొందరు ఆరోగ్య సిద్ధి కొరకు సప్తమీ వ్రతాన్ని ఆచరిస్తారు.
సూర్య రథ విశిష్టత

ఆదిత్య స్తోత్రములో ”ఏక చక్ర రథో యస్య దివ్య: కనకభూషిత:” అని ఉంది.
సూర్యుడు రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది. ఏడు గుర్రాలు ఏడు చంధ స్సులకు, వారంలోని ఏడు రోజులకు ప్రతీక. మహాత్ములు ఏడు గుర్రాలను మనలోని పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి ఏడు అయితే, మన దేహమే సూర్య రథం ఆ చక్రానికి ఉన్న ఆరు ఆకులు ఆరు ఋతువులకు, ఏకచక్రం సంవత్సరానికి సంకేతం. సూర్యుడు ప్రతీనెల ఒక్కో రాశిలో (తెలుగు నెలలు) ప్రవేశిస్తాడు. ఆయన రథం సువర్ణ మయంగా శోభిల్లుతుంది. ప్రతీ నెలా ఆయన ఒక్కో రాశిలో ప్రవేశిస్తే సంక్రమణం అం టారు. ఒక్కోనెల ఒక్కో పేరుతో పిలవబడతాడు. రథసారథి అసురుడు. ఇతను ఊరు వులు (తొడలు) లేని వాడు. అంటే విషయ వ్యామోహము లేని దానికి సంకేతం. ఈ భౌతిక ప్రపంచంలో మనం కూడా భౌతిక వాంఛలు లేకుండా ఉండాలనే విషయాన్ని తెలియచేస్తోంది. సూర్యుడు ప్రతీనెలా ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు, ఒక్కో పేరు తో ఉంటాడు. అంటే సూర్యభగవానుడు ద్వాదశాదిత్యులుగా పేరు పొందాడు. చైత్ర మాసంలో ధాత, వైశాఖ మాసంలో ఆర్యముడు, జ్యేష్ట మాసంలో మిత్రుడుగా, ఆషా ఢంలో వరుణుడు పేరుతో, శ్రావణం ఇంద్రుడు, భాద్రపద మాసంలో వివస్వంతుడు, ఆశ్వీయుజ మాసంలో త్వష్టగా కార్తీకంలో విష్ణువు పేరుతో, మార్గశిరంలో అంశుమం తుడుగా, పుష్యమాసంలో భృగుడుగా, మాఘమాసంలో పూషుడుగా, ఫాల్గుణ మాసంలో పర్జన్యుడుగా విశ్వం అంతా సంచరిస్తూ ఉంటాడు. వీరినే ద్వాదశ ఆదిత్యు లు అంటారు. ఇవన్నీ మనం పుణ్యక్షేత్రం కాశీలో దేవాలయాలు నెలకొల్పబడ్డాయి.
పాండవులు అరణ్యవాసంలో ఉండగా, తమతో వచ్చేవారికి, అతిథులకు సత్కా రాలకు, వారి పురోహతుడు ధౌమ్యుడు సూచనలు మేరకు సూర్యు డిని ఆరాధించడం వల్లనే అక్షయ పాత్ర పొందారు ఆ దౌమ్య మహర్షి వలననే సూర్య అష్టోత్తర శత నామా వళి అందించబడింది. శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు సాంబుడుకు కుష్ఠు రోగం వస్తే సూర్యోపాసన చేసి పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. యాజ్ఞవల్క మహ ర్షికి, ఆంజనేయస్వామికి వేద విద్యలను బోధించినవారు సూర్యుడే. అందుకే మనకు ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా ఆదిత్య హృదయం, సూర్య స్తుతి పారాయణం చేయాలని పెద్దలు చెబుతారు.

- Advertisement -
   

ఆరోగ్యదాయకం రథసప్తమీ స్నానం

రథ సప్తమికి వాతావరణ పరంగా ప్రాధాన్యం ఉంది. సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంత రం వాతావరణంలో వేడి ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించేటపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట. సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్య తలు స్వీకరించాడట. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు. వారంలో రోజులు ఏడు. వర్ణంలో రంగులు ఏడు. తిథు లలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు గుర్రాల రథంపైన తన గమనాన్ని మొదలెడతాడట. దీనికి సూచ నగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట. ఈ రోజున ప్రాత: కాలమున అర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేయాలి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం జిల్లేడు లో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చి న మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి. చర్మ రోగాలను నివారిస్తుంది.
”జననీ త్వంహ లోకానాం సప్తమీ సప్తసప్తికే/ సప్తమ్యా #హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే” అనే మంత్రంతో స్నానంచేసి, అర్ఘ్యం సమర్పించాలి. – డా. చదలవాడ

Advertisement

తాజా వార్తలు

Advertisement