Friday, April 19, 2024

జనవరి 11 నుంచి 14 దాకా గదుల కేటాయింపులు ఉండవ్‌

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని అదే నెల 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంట్‌ బుకింగ్‌ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది. ఎంబీసీ – 34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్‌, ఏఆర్‌పీ కౌంటర్లలో జనవరి 11 తెల్లవారుజామున 12నుంచి 14వ తేది అర్ధరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించేది లేదని పేర్కొంది. కావున 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదులు కేటాయింపు సౌకర్యం ఉండదని తెలిపింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవిందసాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి, గదులు కేటాయిస్తారని తెలిపింది. స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయిస్తారని పేర్కొంది. సామాన్య భక్తులకు సీఆర్‌వో జనరల్‌ కౌంటర్‌ ద్వారా గదులు మంజూరు చేస్తారని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement