Friday, April 19, 2024

హనుమాన్‌ పూజా విశిష్ఠత

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుడు ఎంత ప్రయత్నించినా విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామిలను ఏమీ చేయలేకపోయాడని, వారిపై ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాడని
పురాణాలు పేర్కొంటున్నాయి.

శ్రీమద్రామాయణంలో లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వ రుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేం దుకే శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్‌ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు. కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేం దుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావిం చిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలి పెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అం దుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయ డంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతోపాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబు తున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీక రించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు. అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పు కున్న హనుమంతుడిని పూజించేవారికి, శని గ్రహ దోష నివారణకు, బాధల నుండి విముక్తి లభిస్తుంది. శనిగ్రహ దోష నివారణకు, బాధల నుండి విముక్తి కొరకు శనివార వ్రతాన్ని చేయాలి. శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగి పోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపం వెలిగించే వారికి సకల సంపదలు చేకూరతాయని విశ్వాసం. ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీ శ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుని స్తుతిస్తే.. వారికి శనిగ్రహించే ఏర్పడా ల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

  • డి.పద్మ
Advertisement

తాజా వార్తలు

Advertisement