Sunday, January 23, 2022

ధర్మం మర్మం – మార్గశిరమాస విశిష్టత

అశుచిర్వాప్యనాచారో మహాపాపం సమాచరేత్‌ |
శుచిరేవ భవేన్నిత్యం ఊర్థ్వుఉండ్రాంకితో నర: ||

మత్ప్రియార్థం శుబార్థం వా రక్షార్థం చతురానన |
మత్పూజా హోమకే చైవ సాయంప్రాతస్సమాహిత: |
మద్భక్త: ధారయేన్నిత్యం ఊర్థ్వపుండ్రం భయాపహమ్‌ ||

ఊర్థ్వపుండ్ర ధరో మర్త్య: మ్రియతే యది కుత్ర చిత్‌ |
శ్వపాకోపి విమానస్థ: మమలోకే మహీయతే ||

ఊర్థ్వపుండ్ర ధరో మర్త్య: యదా యస్యాన్న మశ్నుతే |
తదా వింశత్కులం తస్య నరకాదుద్ధరామ్యహమ్‌ ||

వీక్ష్యాదర్శే జలేవాపియో విదధ్యాత్ప్రయత్నత: |
ఊర్థ్వపుండ్రం మహాభాగ సయాతి పరమాంగతిమ్‌ ||
అపరిశుద్ధుడైననూ, ఆచారహీనుడైననూ మహాపాపమును ఆచరించినవాడైననూ నిత్యము ఊర్థ్వపుండ్రమును(నుదుటున తిరునామము)న ధరించిన నరుడు శుచియే యగును. నా ప్రీతి కొరకు కాని, శుభము కొరకు కాని, రక్షణ కొరకు కాని నా పూజలో, హోమములో సాయంకాలము, ప్రాత: కాలము సావధానచిత్తుడైన నా భక్తుడు భయమును తొలగించు ఊర్థ్వపుం డ్రమును నిత్యము ధరించవలయును. ఊర్థ్వపుండ్రమును ధరించిన మానవుడు ఎక్కడ మరణించిననూ అతను ఛండాలుడైననూ విమానమును అధిరోహించి నా లోకమున ఆరాధించబడును. ఊర్థ్వపుండ్రమును ధరించిన మానవుడు ఎవని ఇంటిలో అన్నమును భుజించిననూ అతని కులమును ఇరువది తరముల నరకము నుండి ఉద్ధరించబడును. అనగా నేనే ఉద్ధరించెదను. అద్దమున కాని, జలమున కాని ఊర్థ్వపుండ్రమున ధరించి మనుజుడు ఉత్తమ గతిని అనగా పరమపదమును పొందును.

డా|| కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News