Thursday, April 25, 2024

చిత్ర విచిత్రాల దేవాలయాలు!

అద్భుత ఆలయాలకు నిలయం భారత దేశం. దేశవ్యాప్తంగా భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి, దర్శించదగినవి అనే క అద్భుతమైన, అనేక విశేషణాలు జరిగేటటువంటి దేవాలయాలు మన దేశంలో ఎన్నో… ఎన్నెన్నో. వాటి గురిం చి చదివినా, విన్నా, కన్నా అలౌకికానందానికి లోనవుతాం. ఆ దేవాలయ విశిష్టతను, అక్కడ నెలవై ఉన్న భగవం తుని గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తిస్తాం. అలాంటి దేవాలయా లలో కొన్ని

  • సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయ హాసంబా దేవాలయం. ఇది కర్ణా టకలోని హాసన్‌లో వుంది. ఇక్కడ నివేదించిన అన్న ప్రసాదాలు సంవత్సరం తర్వాత కూడా చెడిపోకుండా అలానే ఉంటాయిట.
  • నీటితో దీపం వెలిగించే దేవాలయం మధ్యప్రదేశ్‌లో వున్న ఘడియఘాట్‌ మాతా జీ మందిర్‌. అమ్మవారు పూజారికి కలలో కనబడి దీపాన్ని నీటితో వెలిగించ మని చెప్పిందిట. ఇప్పటికీ యిక్కడ ఇలాగే జరుగుతూ ఉంటుంది.
  • స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.
  • సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు- నాగలా పురం వేదనారాయణ స్వామి దేవస్థానం. కొల్లాపూర్‌ లక్ష్మి దేవస్థానం. బెంగళూర్‌ గవి గంగాధర్‌ దేవస్థానం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవ స్థానం. కోదండరామ దేవాలయం, కడప జిల్లా. భ్రమరాంబికా సమేత సిద్ధేశ్వర ఆలయం చెన్నారావుపేట.
  • నిరంతరం జలం ప్రవహించే దేవాలయాలు
  • మహానంది, జంబుకేశ్వర్‌, బుగ్గ రామలింగేశ్వర్‌ దేవాలయం, కమండల గణ పతి దేవాలయం, కర్ణాటక. హైదరాబాద్‌ కాశీ బుగ్గ శివాల యం. బెంగళూర్‌ మల్లేశ్వర్‌ దేవాలయం. రాజరాజేశ్వర్‌ బెల్లంపల్లి శివాలయం.
  • సముద్రం వెనక్కు వెళ్లే ఆలయాలు- నిష్కళంక మహాదేవ్‌ ఆలయం, గుజరాత్‌. 40 ఏళ్లకు ఒకసారి సముద్రజలంతో పూజ

జరిగే పుంగనూరు శివాలయం.

  • రంగులు మారే ఆలయాలు- ఉత్తరాయణం, దక్షిణాయణంలో రంగులు మారే… తమిళనాడులోని అతిశయ వినాయక దేవాలయం.
  • పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగు మారే….పంచారామ సోమేశ్వరాల యం, తూర్పు గోదావరి జిల్లా.
  • నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు ఉన్న ఆలయాలు: కాణిపాకం వినాయక ఆలయం, యాగంటి బసవన్న ఆలయం, కాశీ తిలభండేశ్వర్‌ ఆలయం, బెంగుళూరు బసవేశ్వర్‌ ఆలయం, బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయం.
  • సంవత్సరానికి ఒకసారి స్వయంభువుగా వెలిసే అమర్నాథ్‌ ఆలయం.
  • ఆరునెలలకు ఒకసారి తెరిచే ఆలయాలు- బదరీనాథ్‌ ఆలయం, కేదారనాథ్‌ ఆల యం. (ఆరునెలల తరువాత కూడా దీపం ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది)
  • గుహ్యకాళీ మందిరం. ఒంటిస్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేదా రేశ్వర్‌ ఆలయం. ఇక్కడ వేసవిలో కూడా నీరు చల్లగా ఊరుతుంది.
  • మనిషి శరీరంలాగే ఉండే ఆలయాలు: హిమాచల నరసింహ స్వామి ఆలయం. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. మనిషి లాగే గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామి ఆలయం.
    బ‌ఛాయా విశేషాలు ఉండే దేవాలయాలు- ఛాయాసోమేశ్వరం ఆలయం. స్థంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్‌. గోపురం నీడ (రివర్స్‌)లో ఒకచోట పడు తుంది. బృహదీశ్వరాలయం, నేపాల్‌.
  • పూరీ ఆలయం- పక్షులు ఎగరని పూరి. సముద్ర ఘోష వినని పూరి సముద్రం వైపే గాలి వీచే పూరి. గోపురం నీడ పడని పూరీ దేవాలయం, దేవునికి సమర్పించగానే ఘుమఘుమ లాడే ప్రసాదం యిక్కడి ప్రత్యేకత. ఇంకా యిలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని దర్శించుకోవడం శుభకరం. పుణ్యప్రదం.
    రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement