Tuesday, March 21, 2023

తపిస్తేనే దైవదర్శనం!

దేవుడ్ని చూడాలి అని అందరికీ ఉంటుంది. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి, ఆ దేవ దేవుడితో మనసారా మాట్లాడే మహద్భాగ్యం ఒక్కసారి కలగాలని మనం కోరుకుంటాం. అలాంటి అద్భుతమైన అదృష్టం మనకు కలగటం మనం చేసు కున్న జన్మజన్మల పుణ్యఫలం అని తలపోస్తాం. అంతటి భాగ్యం ఒక్కసారి కలిగితే జీవితం ధన్యమైపోతుంది అని భావిస్తాం. అలాంటి భాగ్యం కలగాలని మనసు తహతహలాడు తుంది. అయితే దేవుడు ఎక్కడుంటాడో తెలీదు. ఎలా ఉంటాడో తెలీదు. ఎలా కనిపిస్తాడో తెలీదు. భగవంతుడ్ని చూడాలంటే మనం ఏం చేయాలో తెలీదు. అసలు దేవుడు ఉన్నాడో లేదో కూడా తెలీదు.
కొందరు దేవుడు ఉన్నాడంటారు. మరికొందరు దేవుడు లేడే లేడంటారు. ఉండీ లేన ట్లు ఉంటాడంటారు ఇంకొందరు. లేనట్టు అనిపిస్తూనే అంతటా అన్నింటా దేవుడు ఉంటా డంటారు మరికొందరు. ”లేడు” ”ఉన్నాడు” అనే రెండింటి మధ్య ఊయల ఊగుతూ దేవుడు మనతోనే, మనలోనే ఉంటాడంటారు ఇంకొందరు.
హరణ్యకశిపుడు హరి ‘లేడు’ ‘లేడు’ అనే మాటలలోనే దేవుడు ఉన్నాడనే భావం పరో క్షంగా ధ్వనిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అవును. హరి లేనప్పుడు, హరి లేడు లేడు అనే మాటలు ఎందుకు? అవసరం ఉండదు కదా??
అలాగే భగవంతుడు ఎక్కడా లేడు అనే వారు ఏుd ఒ కుఠ|స| అని ఆంగ్లంలో కూడా బల్లగుద్ది చెబుతుంటారు. అలా చెప్పడంలోనే దేవుడు ఉన్నాడనే భావం యిమిడి ఉం దని, దేవుడు ఉన్నాడనే వారంటారు. అందుకు ఋజువుగా పైన చెప్పుకున్న ఆంగ్ల వాక్యం ఏుd ఒ కుఠ|స| లో ఉన్న ూ ని అంతకు ముందున్న పదం కు తగిలిస్తే ,ఏుఒ కుూ ఐ|స| గా మారుతుంది అంటారు . దానర్ధం భగవంతుడు లేడు లేడనే దాంట్లోనే, యిక్కడే దేవుడు ఉన్నాడు అనేది దాగి ఉందని దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు వివరిస్తూ, దేవుడు లేడు లేడు అనే మాటలోనే దేవుడు ఉంటాడని విశ్లేషణ చేస్తారు.
దేవుడు లేడు అని మనల్ని భ్రమ పెడుతూనే, ఆ విధమైన భ్రమ కల్పించడంలోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటాడు అని అర్ధం చేసుకోవాలని చెబుతారు.
అంతటి లీలా మానుష రూపుడ్ని మహమాన్వితుడ్ని ఒక్కసారి కనులారా చూస్తే చాల ని జీవితమంతా వేదన పడేవారు ఎందరెందరో!
అలాంటి పరిస్థితుల్లో భగవంతుడ్ని నేను చూసేను అని ఎవరైనా అంటే ఏం చేస్తాం? మనకూ అతను దేవుడ్ని చూపిస్తాడేమో అనే ఆశతో మనం అతడ్ని ఆశ్రయిస్తాం. పైగా తాను చూసిన దేవుడ్ని మనకూ ఆయన చూపెట్టగలడని తెలిస్తే మహదానంద పడిపోతాం. మన కూ ఆ దేవుడ్ని చూపించమని ఆయన్ని ప్రార్ధిస్తాం. మన కోరిక మన్నించి ఆ భగవంతుడ్ని, మనకి ఆ పెద్దాయన చూపెడతాడని ఉబ్బితబ్బై పోతాం. నవ నవోన్మేషమైన ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు ఉవ్విళ్ళూరుతాం. అనుక్షణం దేవుడ్ని చూడబో యే ఆ క్షణం కోసం ఆదుర్దా పడతాం. ఆరాటపడతాం. హరానా పడిపోతాం.
శ్రీ రామక్రిష్ణ పరమహంస సశరీరంగా ఉన్న రోజులవి. పరమహంస దేవుడ్ని చూసేర ని , అవసరమైతే పరమహంస అందరికీ దేవుడ్ని చూపించగలరని, చూపిస్తారని అందరూ ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ మాట ఆ నోటా యీ నోటా పాకి మెల్లగా ఓ పిల్లాడి చెవిన పడింది. ఆ కుర్రాడికి దేవుడ్ని చూడాలనే కోరిక కలిగింది.
తిన్నగా రామక్రిష్ణ పరమహంస దగ్గర కొచ్చాడు కుర్రాడు. ”ఏంటి సంగతి?” అని అడిగారు పరమహంస. ”నాకు దేవుడ్ని చూడాలని ఉంది. చూపించండి.” అన్నాడు కుర్రాడు. ”ఇప్పుడు కాదు. రేపు ఉదయం రా నీకు దేవుడ్ని చూపిస్తాను.” అని పరమహంస చెప్పారు. ”నిజంగానా!” అన్నాడు కుర్రాడు.
”నిజంగానే.” అని హామీ ఇచ్చారు పరమ హంస. కుర్రాడు బాగా సంతోషించాడు. రేపుదయం దేవుడ్ని చూస్తాను అనే ఆనందంలో రాత్రంతా బాగా నిద్రపోయాడు. తెల్లారింది. ఉదయమే శుభ్రంగా తయారై రామక్రిష్ణులు గారి దగ్గరకు వెళ్ళాడు. ”నిన్న సాయంత్రం వచ్చేను కదా. రేపుదయం రా దేవుడ్ని చూపిసాను అని చెప్పారు కదా. దేవుడ్ని చూపిస్తే చూడాలని వచ్చాను. చూపించండి.” ఉత్సా#హంగా అడిగాడు కుర్రాడు.
పరమ#హంస చిన్నగా నవ్వి ”పద. చూపిస్తాను.” అని కుర్రాడికి చెప్పి కుర్రాడిని దగ్గర లో ఉన్న నది దగ్గరకు తీసుకెళ్ళారు. కుర్రాడితో సహా నీళ్ళలో దిగారు. ”దేవుడ్ని చూడాలం టే మనం పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి శుభ్రంగా తలారా స్నానం చెయ్యి.” అని చెప్పారు. స్నానం చేయడానికి కుర్రాడు నీళ్ళలో గబుక్కున మునిగాడు. నీళ్ళలో నుంచి తల తీద్దా మని కుర్రాడు నీళ్ళలోంచి తలను లేపుతున్న సమయంలో కుర్రాడి మెడ దగ్గర తన చేతిని అదిమి పెట్టి కొంచెంసేపు నీళ్ళలో నుంచి కుర్రాడు పైకి రాలేనంతగా నొక్కి ఉంచారు. కుర్రా డు నీళ్ళలో గిల గిల కొంటున్నాడు. గిజగిజ లాడిపోతున్నాడు. అప్పుడు కుర్రాడి మెడ మీం చి తన చేతిని తీసారు పరమహంస. నీళ్ళలో గిజగిజ కొట్టుకుంటున్న కుర్రాడు నీళ్ళలోంచి పైకి వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. ఊపిరాడక ఆపసోపాలు పడుతున్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. తేరుకుని పరమ#హంస వైపు కోపంగా చూస్తూ ”ఏంటండి మీరు. దేవుడ్ని చూపిస్తాను అన్నారు. నీళ్ళలోకి తీసుకొచ్చారు. తలారా స్నానం చేయి అని చెప్పి, నేను నీళ్ళలో మునగగానే, నా మెడ మీద మీ చేతితో అదిమి పెట్టారు. నన్ను చంపేద్దామను కున్నారా? మీకిది భావ్యమా?” అని కోపంగా ధైర్యంగా పరమహంస గార్ని కుర్రాడు అడి అడుగుతూ కోప్పడ్డాడు.
పరమహంస మాత్రం అలా పిల్లాడ్ని చూస్తున్నారు. ఆయన ముఖంలో ఏ భావం లె దు. నిర్మలంగా ఉన్నారు. అలా ఉన్న పరమహంసను చూసిన కుర్రాడికి చిర్రెత్తి పోయింది. ”ఏంటండి! దేవుడ్ని చూపిస్తానన్నారు. దేవుడేడీ చూపించండి.” అని నిలదీసాడు.
పరమహంస చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. ”చూడు నాయనా! ఇందాక నీళ్ళలో ఉండిపోయినప్పుడు, నీ ప్రాణాలను కాపాడుకునేందుకు, నువ్వు నీళ్ళలో గిలా గిలా కొట్టు కుంటూ గిజగిజ లాడేవు చూసావా? అలా ఆ దేవుని కోసం నువ్వు గిజగిజ కొట్టుకున్నపుడు, దేవుని కోసం నీ ప్రాణాలన్నీ గిలగిలా లాడినప్పుడు, ఆ దేవుడ్ని నీకు ఎవరూ చూపించాల్సిన అవసరం లేదయ్యా! నీకు నువ్వే ఆ దేవుడ్ని చూడగలవు. నేను కూడా దేవుడ్ని అలాగే చూసానయ్యా. ఆ రకంగానే ఆ దేవుడ్ని చూస్తున్నానయ్యా!” అంటూ రహస్యాన్ని విప్పి చెప్పారు రామక్రిష్ణ పరమహంస.
కుర్రాడికి విషయం పూర్తిగా అర్ధమైంది. అవును. దేవుణ్ణి మనకి ఎవరూ చూపించాల్సి న పని లేదు. మనం దేవుని కోసం తపిస్తే, తపన పడితే, ఆ దేవుడే మనకి కనిపిస్తాడు. దేవుని కోసం మనం వేగిపోతే, వేదన పడితే, అర్రులు జాస్తే, దేవుని కోసమే అనుక్షణం పలవరిస్తే ఆ దేవుడే మన ముందు నిలుస్తాడు. నిలువెత్తై మన ముందు సాక్షాత్కరిస్తాడు. అందుకోసం మనందరం ప్రయత్నిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement