Tuesday, October 3, 2023

శ్రీసాయినాథుని దివ్యానుగ్రహం!

భ క్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం, భక్త జన సంరక్ష కుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియు గ దైవం, అయిన శ్రీ సాయినాథులకు గల ముఖ్య భక్తులలో బలరాం దురంధర్‌ ఒకరు. వీరు 1878వ సంవత్సరంలో పఠారే ప్రభు జాతిలో జన్మించారు. ఈయన లా లో డిగ్రీని పొంది బొంబాయి హకోర్టు లో న్యాయవాదిగా చాలాకాలం పనిచేసారు. క్రమ శిక్షణతో, అంకిత భావంతో పనిచేసి తన వృత్తిలో చక్కని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అటు తర్వాత బొంబాయిలోని లా కాలేజిలో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. బలరాం దురంధర్‌ తన పఠారే ప్రభు జాతి యొక్క సంక్షేమం కోసం విస్తృతంగా కృషి చేసారు. ఆ విషయాలన్నింటినీ ఒక చక్కని పుస్తకం లో వ్రాసారు. తర్వాత తన దృష్టిని ఆధ్యాత్మికత వైపుకు మరల్చి భగవద్గీత, రామాయణం, మహా భారతం వంటి గ్రంథాలను చదివి అందులోని తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. బలరాం దురం ధర్‌ పండరీపురం విఠలుడి భక్తుడు. ప్రతీ సంవత్స రం తన కుటుంబ సభ్యులతో పండరీపురం యాత్ర చేయడం అతని జీవితంలో ఒక భాగం అయ్యింది. దురంధర్‌ యొక్క పూర్వజన్మ సుకృతం వలన అత నికే కాదు అతని కుటుంబ సభ్యులందరికీ ఆధ్యాత్మిక చింతన, సద్గంధ పఠన, నిత్య పుజాది కార్యక్రమము లను చేయుట వంటి సద్గుణములు అలవడ్దాయి.
ఒక సందర్భంలో అతని సోదరులైన బాబూల్జి, వామనరావులు శిరిడీకి వెళ్ళి శ్రీ సాయిని దర్శించి చక్కని అనుభవాలను పొంది, ఆ విషయాలన్నిం టినీ బలరాంకు చెప్పారు. దాంతో బలరాం తన కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ సాయిని దర్శనం చేసుకుందామని నిర్ణయించుకొని అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు.
బలరాం శిరిడీ ప్రయాణం ప్రారంభించగానే శ్రీ సాయి మశీదులో తన భక్తులతో ”ఈ రోజున నా భక్తు లు వస్తున్నారు” అని ప్రకటించారు. బలరాం దురం ధర్‌ తన కుటుంబ సభ్యులతో శిరిడీ చేరగానే ఈ విషయం తెలుసుకొని తాము శిరిడీ వస్తు న్నట్లు ఎవ్వరికీ తెలియజేయనప్పటికీ శ్రీ సాయి ముందుగానే ఈ విషయం ప్రక టించారని, అందువలన శ్రీ సాయి సర్వ జ్ఞుడని నిర్ధారణ చేసుకున్నారు. అంద రూ శ్రీ సాయికి సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నారు.
సాయి వారితో ”మన మందరికీ గత 60 జన్మల నుండి సంబంధ బాంధ వ్యాలు వున్నాయి. అందుకే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను” అన్నారు. శ్రీ సాయిని దర్శించిన వెంటనే బలరాం దురంధర్‌ కుటుంబ సభ్యులందరికీ ఎం తో ప్రశాంతత కల్గింది. సంశయాలన్నీ మటుమాయంఅయ్యాయి. కళ్ళు ఆనం దంతో వర్షించసాగాయి. భగవంతుడిని దర్శించడంతో కలిగే ఆధ్యాత్మికత, అలౌ కిక ఆనందం వారికి కలిగింది. భోజనా నంతరం కాసేపు విశ్రమించి తిరిగి మశీదుకు వచ్చా రు. బలరాం సాయి వద్దకు వచ్చి పాదములను వత్త సాగాడు. ఆ క్షణంలోనే అతనికి శక్తిపాతం జరిగి మనసు అంతర్ముఖం అయ్యింది. అత్యద్భుతమైన, అనిర్వచనీయమైన అధ్యాత్మిక జాగృతి కలిగింది. ఎన్నో సంవత్సరాలు, కఠోర నియమాలతో, తీవ్రం గా ధ్యానం చేస్తేగాని కలుగని దివ్యానుభవాలు ఆ క్షణంలో బలరాం దురంధర్‌కు కలిగాయి. అప్పుడు శ్రీ సాయి చిలుము త్రాగుతూ దానిని బలరాంకు ఇచ్చి పీల్చమన్నారు. బలరాం జీవితంలో ఒక్కసారి కూడా ప్రొగ త్రాగి వుండలేదు. అయినా సద్గురువు ఆజ్ఞను శిరసా వ#హంచి ఆ చిలుమును అతి కష్టం మీద పీల్చి తిరిగి బాబాకు అందించాడు. అంతే! గత 10 సంవత్సరాలుగా అతడిని పట్టి పీడిస్తున్న ఉబ్బసం వ్యాధి చిలుం పీల్చిన వెంటనే మటుమా యం అయ్యింది.
చూసారా మన సాయినాథుని దివ్యలీల! ఏ మందులకూ లొంగక, తరచుగా వచ్చి పీడించే ఈ వ్యాధి చిలుం పీల్చిన వెంటనే తగ్గిపోయింది. ఇందు లోని రహస్యం శ్రీ సాయినాథులు తన భక్తునిపై కురిపించిన దివ్య అనుగ్రహం తప్ప మరేమీ కాదు.
ఆ రోజు గురువారం కావడంతో సాయంత్రం దురంధర్‌ కుటుంబీకులు చావడి ఉత్సవం చూసా రు. ఈ ఉత్సవం సమయంలో శ్రీ సాయినాథుని దివ్య ముఖంలో వారికి పాండురంగని దివ్య దర్శ నం కల్గింది. ఇష్ట దేవతారాధన ఒక సద్గురువును చూపుతుందని, ఆ సద్గురువు మార్గంలో సూటిగా దిక్కులు చూడక నడచిన వారికి ఇహంలోనూ, పరంలోనూ అన్ని కోరికలు తీరి ముక్తి లభిస్తుందన్న వేదోక్తి వారికి చాలా స్పష్టంగా అర్ధమయ్యింది. నాటి నుండి వారందరూ శ్రీ సాయికి ముఖ్య భక్తులై, నిత్యం సాయిని సేవిస్తూ, కొలుస్తూ, ఆయన దివ్యాను గ్రహానికి పాత్రులై తరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement