Thursday, February 2, 2023

ఆధ్యాత్మిక చైతన్యం!

దాస భూతమిదం తస్య జగస్థావర జంగమం
శ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వర:
(పద్మ పురాణం)
”సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు. చరాచర ప్రాణులు, వస్తువులన్నీ అతని సేవకులే”. ప్రాపంచిక భౌతిక విషయాసక్తి- ”నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది” అనే ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధ మే ఆధ్యాత్మిక చైతన్యం. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, ”భగవంతుడే సమస్త జగత్తుకి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్ధ సేవకుడిని/ సేవకురాలిని. నాకున్న దాన్ని అం తా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి.” అని. ఆ ప్రకారముగా, తనే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోరాదు.
ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో (24-7)
కర్మణే వాధికారస్తే మా ఫలేషు కదాచనే|
మా కర్మఫల హేతుర్భూ: మా తే సంగోస్త్వకర్మణి||
(శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఆ కర్మ ఫలములపై నీ కు ఎటువంటి హక్కు లేదు. నీవే ఆ కర్మ ఫలములకు హితువు అని ఎప్పుడు అనుకోకు. అలా అనుకుని చేయవలసిన కర్మలు మానుటయందు ఆసక్తి చూపరాదు) అని అర్జునునికి జ్ఞాన బోధ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement